సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అతి ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు పరుగులు తీయడంపై ఆదిత్యా బిర్లా గ్రూపునకు దేశీయ సిమెంట్ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ హర్షం వ్యక్తం చేసింది. మెట్రో సెక్టార్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పబ్లిక్ ప్రయివేట్ పార్టనర్ షిప్ ప్రాజెక్టు అయిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణంలో ముఖ్యమైన భూమిక పోషించామంటూ అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ సంతోషం వ్యక్తం చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా నవంబర్ 29న ప్రారంభమైన ఈ మెట్రో రైలుకు సిమెంట్, కాంక్రీట్ సరఫరా చేయడంలో ముఖ్యమైన భాగస్వామిగా నిలిచామని సంస్థ ఒక మీడియా ప్రకటనలో తెలిపింది. నాలుగు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా గ్రే సిమెంట్ సరఫరా చేశామని వెల్లడించింది.
అలాగే భారతదేశంలో అనే ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులకు అల్ట్రాటెక సిమెంట్ విశ్వసనీయమైన బ్రాండ్ అని అల్ట్రాటెక్ పేర్కొంది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, టి 12 టెర్మినల్ సహా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా, మెట్రో ప్రాజెక్టులు తమ సిమెంట్ శక్తి, మన్నికతోనే విజయవంతంగా నిర్మించినట్టు తెలిపింది. అత్యున్నత నాణ్యత, విశ్వసనీయత, హరిత సాంకేతికకు, ఆవిష్కరణకు దీటుగా నిలిచిందని చెప్పింది. అందుకే ప్రతి విశిష్టమైన ఇంజనీరు, వినియోగదారుని ప్రథమ ఎంపిక అని అల్ట్రాటెక్ ప్రకటించింది .
Comments
Please login to add a commentAdd a comment