స్పష్టం చేసిన అ్రల్టాటెక్ సిమెంట్
న్యూఢిల్లీ: దక్షిణాదిన కార్యకలాపాలు విస్తరించిన ఇండియా సిమెంట్స్(ఐసీఎల్) స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టెడ్ కంపెనీగా కొనసాగుతుందని అ్రల్టాటెక్ సిమెంట్ తాజాగా పేర్కొంది. ఐసీఎల్‌ను డీలిస్ట్ చేసే యోచనలేదని ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్ దిగ్గజం తెలియజేసింది. వారాంతాన ఐసీఎల్ ప్రమోటర్ల నుంచి 32.72 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అల్ట్రాటెక్ వెల్లడించిన నేపథ్యంలో లిస్టింగ్ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
డీల్ విలువ రూ.3,954 కోట్లుకాగా.. ఇప్పటికే ఐసీఎల్‌లో 23 శాతం వాటా కలిగిన అల్ట్రాటెక్ దీంతో నిబంధనల ప్రకారం పబ్లిక్ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. షేరుకి రూ.390 ధరలో 8.05 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు అల్ట్రాటెక్ రూ.3,142 కోట్లకుపైగా వెచ్చించనుంది. అయితే ఐపీఎల్ క్రికెట్ టీమ్.. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) యాజమాన్యంలో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది.
ఐసీఎల్ ప్రమోటర్ ఎన్.శ్రీనివాసన్, కుటుంబ సభ్యులు ప్రమోటర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. అల్ట్రాటెక్ తరఫున ఓపెన్ ఆఫర్‌ను చేపట్టిన యాక్సిస్ క్యాపిటల్.. ఐసీఎల్‌ను డీలిస్ట్ చేసే యోచనలేదన్న విషయాన్ని స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. పూర్తిస్థాయిలో ఓపెన్ ఆఫర్ విజయవంతమైతే ఐసీఎల్‌లో అ్రల్టాటెక్ వాటా 81.49 శాతానికి చేరే వీలుంది!
బీఎస్‌ఈలో ఐసీఎల్ షేరు 0.7 శాతం నీరసించి రూ. 372 వద్ద ముగిసింది. ఓపెన్ ఆఫర్ ధరతో పోలిస్తే ఇది 4.6 శాతం డిస్కౌంట్.
Comments
Please login to add a commentAdd a comment