అల్ట్రాటెక్ సిమెంట్ ఫలితాలు భేష్!
ముంబై: ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ ఎనలిస్టుల అంచనాలకు మించి ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. ముంబై ఆధారిత సిమెంట్ తయారీ సంస్థ 31 శాతం నికర లాభాలను నివేదించింది. (స్వతంత్ర ఆధారంగా) నికర లాభం 601.05 కోట్లను, అమ్మకాలపై . 6,134.63 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు వెల్లడించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో సమయంలోనికర లాభం రూ457.41లుగా నమోదు చేసింది. ఈబీఐటీడీఏ లేదా ఆపరేటింగ్ లాభం రూ. 17.6 శాతం పెరిగి రూ.1,155 కోట్లుగా నమోదు చేసింది. గత సంవత్సరం అదే త్రైమాసికంలో సమయంలో 982 కోట్లను ఆర్జించింది. ఇతర ఆదాయం 29 శాతం పెరిగి రూ. 172.5 కోట్లుగా నమోదైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 2 శాతం క్షీణించి రూ. 6196 కోట్లకు పరిమితమైంది. మార్జిన్లు 3 శాతంపైగా పెరిగి 18.6 శాతాన్ని తాకాయి. అటు అల్ట్రాటెక్ సిమెంట్ రూ. 547 కోట్లను రూ నికర లాభాల రిపోర్టు చేయనుందనిఎనలిస్టులు అంచనావేశారు.
కాగా మౌలిక ఖర్చులు, మంచి వర్షాకాలం, టైర్-1, టైర్-11 నగరాల్లో గృహ డిమాండ్ అభివృద్ధి దారితీసిందని పేర్కొంది. మంచి వర్షపాత అంచనాలు, ప్రభుత్వ స్మార్ట్ నగరాల నిర్మాణం ఆలోచన నేపథ్యంలో భవిష్యత్తులో కూడా తమకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందనుందని కంపెనీ తెలిపింది. ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్ గత మూడు నెలల్లో 14 శాతం లాభపడింది