దమానీల నుంచి 23 శాతం వాటా కొనుగోలు
డీల్ విలువ రూ. 1,889 కోట్లు ∙ప్రస్తుతం ప్రమోటర్ల వాటా 28.42 శాతం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అ్రల్టాటెక్ సిమెంట్ తాజాగా చెన్నైకు చెందిన ఇండియా సిమెంట్స్‌లో భారీ వాటాను దక్కించుకుంది. ఇండియా సిమెంట్స్‌లో దమానీలకు ఉన్న 23 శాతం వాటాను సొంతం చేసుకుంది. బీఎస్‌ఈ గణాంకాల ప్రకారం ఇందుకు రూ. 1,889 కోట్లు వెచి్చంచింది. తద్వారా ఇండియా సిమెంట్స్‌లో ప్రమోటర్ల తదుపరి రెండో పెద్ద వాటాదారుగా అవతరించింది. రెండు బ్లాక్ డీల్స్ ద్వారా షేరుకి రూ. 265–283 ధరల శ్రేణిలో మొత్తం 7,05,64,656 షేర్లను కొనుగోలు చేసింది.
ఇది 22.77 శాతం వాటాకు సమానం కాగా.. ప్రస్తుతం ఇండియా సిమెంట్స్‌లో ప్రమోటర్లు 28.42 శాతం వాటాను కలిగి ఉన్నారు. వాటాను విక్రయించినవారిలో దమానీలు.. గోపీకిషన్ శివకిషన్, కిరణ్ దేవి, రాధాకిషన్ శివకిషన్, శ్రీకాంత దేవి ఉన్నారు. ఆర్‌కే దమానీకి చెందిన డిరైవ్ ఇన్వెస్ట్‌మెంట్స్, డిరైవ్ ట్రేడింగ్ అండ్ రిసార్ట్స్ సైతం షేర్లను విక్రయించాయి. గురువారం సమావేశమైన బోర్డు ఇండియా సిమెంట్స్‌లో దాదాపు 7.06 కోట్ల షేర్ల కొనుగోలుకి గ్రీన్ సిగ్నల్ ఇచి్చనట్లు అ్రల్టాటెక్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. ఇండియా సిమెంట్స్‌లో 23% నియంత్రేతర వాటా కొనుగోలుని ఫైనాన్షియల్ పెట్టుబడిగా అ్రల్టాటెక్ పేర్కొంది.
ఇండియా సిమెంట్స్ తీరిదీ...
2024 మార్చి31 కల్లా ఇండియా సిమెంట్స్‌లో ప్రమోటర్ల వాటా 28.42 శాతంగా నమోదైంది. కంపెనీ వైస్‌చైర్మన్, ఎండీ ఎన్. శ్రీనివాసన్ 0.36 శాతం వాటాను కలిగి ఉన్నారు. ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఈడబ్ల్యూఎస్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు 21.56 శాతం వాటా ఉంది. కంపెనీ మొత్తం 16 ఎంటీపీఏ సిమెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిలో అనుబంధ కంపెనీ త్రినేత్ర సిమెంట్‌కుగల 1.5 ఎంటీపీఏ సామర్థ్యం కలసి ఉంది.
గతేడాది (2023–24) ఇండియా సిమెంట్స్ రూ. 5,112 కోట్ల ఆదాయం, రూ. 227 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2022–23)లో నమోదైన రూ. 127 కోట్లతో పోలిస్తే నష్టం పెరిగింది. 2023 సెపె్టంబర్‌లో ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లాలోని కంటకాపల్లె, చిన్నిపాలెంలోగల 73.75 ఎకరాల భూమిని విక్రయించింది. వీటిని రూ. 70 కోట్లకు అ్రల్టాటెక్ సొంతం చేసుకుంది. 2022 అక్టోబర్‌లో స్ప్రింగ్‌వే మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌కు రూ. 477 కోట్లకు విక్రయించింది.
అల్ట్రాటెక్ స్పీడ్..
అ్రల్టాటెక్ సిమెంట్ స్థాపిత సామర్థ్యం వార్షికంగా 152.7 మిలియన్ టన్నులు (ఎంటీపీఏ)కాగా.. విస్తరణ బాటలో సాగుతోంది. మహారాష్ట్రలోని ఇండియా సిమెంట్స్ గ్రైండింగ్ యూనిట్‌ను రూ. 315 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఏప్రిల్ 20న ప్రకటించింది. వైట్ సిమెంట్, కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్ తయారీ కోసం యూఏఈ సంస్థ రాక్ సిమెంట్‌లో 25 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు ఈ వారం మొదట్లో ఆఫర్ ధరను సవరించింది. విస్తరణ నేపథ్యంలో గ్రే సిమెంట్ సామర్థ్యం 198.2 ఎంటీపీఏను తాకనుంది.ఈ వార్తలతో అ్రల్టాటెక్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 11,715కు చేరగా.. ఇండియా సిమెంట్స్ 11%పైగా దూసుకెళ్లి రూ. 293 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment