ముంబై: బిర్లా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) మూడో త్రైమాసిక కాలంలో 80 శాతం మేర పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.396 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.712 కోట్లకు పెరిగిందని అల్ట్రాటెక్ సిమెంట్ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.10,294 కోట్ల నుంచి రూ.10,176 కోట్లకు తగ్గిందని పేర్కొంది. స్టాండ్‌అలోన్ పరంగా చూస్తే. నికర లాభం రూ.433 కోట్ల నుంచి రూ.643 కోట్లకు ఎగసిందని వివరించింది. వివాద పరిష్కార పథకం కోసం రూ.133 కోట్లు కేటాయించామని, దీనిని కూడా కలుపుకుంటే ఈ నికర లాభం మరింతగా పెరిగి ఉండేదని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment