దేశీయ సిమెంట్ రంగంలో అతిపెద్ద డీల్ ఇదే!
దేశీయ సిమెంట్ రంగంలో అతిపెద్ద డీల్ ఇదే!
Published Tue, Jun 13 2017 5:55 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM
ముంబై: దేశీయ సిమెంట్ రంగంలో అతిపెద్ద డీల్ మరోనెలలో పూర్తికాబోతుంది. జైప్రకాశ్ అసోసియేట్స్ సిమెంట్ డివిజన్ ను కొనుగోలుచేస్తున్న ఆల్ట్రాటెక్ సిమెంట్ ఈ ప్రక్రియను జూలై చివరి వరకు ముగించనున్నట్టు రిపోర్టులు వచ్చాయి. జూలై చివరి వరకు ఈ డీల్ పూర్తికానున్నట్టు తెలియగానే, జేపీ అసోసియేట్స్ నేటి మార్కెట్లో ఒక్కసారిగా పైకి దూసుకెళ్లింది. నేటి(మంగళవారం) ఇంట్రాడేలో స్టాక్ 15 శాతం పైగా పైకి ఎగిసింది. ఇప్పటికే ఈ డీల్ కు సంబంధించి ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ల్లో ఆమోదం లభించింది. ఇంకా మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లలో ఆమోదం లభించాల్సి ఉందని రిపోర్టులు పేర్కొన్నాయి.
ఈ డీల్ మొత్తం విలువ రూ.16,189కోట్లు. జేపీ అసోసియేట్స్ కు చెందిన 12 సిమెంట్ ప్లాంట్లను కొనుగోలుచేయడానికి ఆల్ట్రాటెక్ ఈ డీల్ కుదుర్చుకుంది. ఈ ప్లాంట్ల కొనుగోలుతో 94.5 మిలియన్ టన్నుల కెపాసిటీతో ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో సిమెంట్ కంపెనీగా(చైనా మినహా) అవతరించనున్నది. కాగ గతేడాదే ఆల్ట్రాటెక్ సిమెంట్స్ కు, జేపీ అసోసియేట్స్ కు మధ్య ఒప్పందం కుదిరింది.
Advertisement
Advertisement