మరో కంపెనీపై అదానీ కన్ను | Adani Group expressed interest in acquiring Jaiprakash Associates | Sakshi
Sakshi News home page

మరో కంపెనీపై అదానీ కన్ను

Published Thu, Mar 27 2025 8:46 AM | Last Updated on Thu, Mar 27 2025 8:46 AM

Adani Group expressed interest in acquiring Jaiprakash Associates

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ గ్రూప్‌ అదానీ తాజాగా మౌలిక రంగ సంస్థ జేపీ అసోసియేట్స్‌(జేఏఎల్‌)పై దృష్టి పెట్టింది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జేపీ గ్రూప్‌ సంస్థ జేఏఎల్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2024 జూన్‌3న జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) అలహాబాద్‌ బెంచ్‌ ఆదేశాల ప్రకారం జేఏఎల్‌ దివాల చట్ట పరిధిలోకి చేరింది. దీంతో దివాలా పరిష్కరా చర్యలకు తెరలేచింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌ ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్‌ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అంబుజా వంటి కంపెనీల్లో అదానీ గ్రూప్‌ వాటాలు పెంచుకుంది.

బిజినెస్‌లను విడదీయకుండా ఏకమొత్తంగా కంపెనీ(జేఏఎల్‌)పై దివాల పరిష్కార ప్రక్రియను చేపట్టేందుకు ఎన్‌సీఎల్‌టీ ఈ నెల మొదట్లో ఆదేశించింది. 2025 ఫిబవ్రరి 20కల్లా జేఏఎల్‌ చెల్లించవలసిన రుణాల విలువ రూ. 55,493 కోట్లను దాటింది. చెల్లించవలసిన రుణాలను జాతీయ ఆస్తుల పునర్‌నిర్మాణ కంపెనీ(ఎన్‌ఏఆర్‌సీఎల్‌)కు రుణదాతల కన్సార్షియం బదిలీ చేసినట్లు ఇటీవల జేఏఎల్‌ వెల్లడించింది. రుణదాతల కన్సార్షియంలో బ్యాంకింగ్‌ దిగ్గజాలు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, యాక్సిస్, కెనరా, పీఎన్‌బీ, యుకో, బీవోఎం, కరూర్‌ వైశ్యా, బీవోఐ, ఇండస్‌ఇండ్, బీవోబీ, ఎగ్జిమ్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ తదితరాలున్నాయి. అయితే ఎన్‌ఏఆర్‌సీఎల్‌కు బదిలీ చేసిన రుణాల విలువ వెల్లడికాలేదు. జేఎల్‌ఎల్‌ దివాల పరిష్కార ప్రక్రియను నిర్వహించేందుకు భువన్‌ మదన్‌ ఎంపికయ్యారు. కాగా.. జేపీ గ్రూప్‌ సంస్థ జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను దివాల ప్రక్రియ ద్వారా ఇంతక్రితం ముంబైకి చెందిన సురక్షా గ్రూప్‌ సొంతం చేసుకున్న విషయం విదితమే.

ఇదీ చదవండి: ఐటీ షేర్లకు ఏమైంది?


యూకే అండ్‌ కోతో రీపోస్‌ మ్యాట్రెస్‌ ఒప్పందం

హైదరాబాద్‌: మిడ్‌–టు–ప్రీమియం పరుపుల తయారీ సంస్థ రీపోస్‌ మ్యాట్రెస్‌.. కుటుంబ వ్యాపార సలహా సంస్థ ‘యూకే అండ్‌ కో’తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. వ్యాపార అభివృద్ధి, విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఒప్పందాన్ని చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది. యూకే అండ్‌ కో సంస్థ విలువైన సలహాలు వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాయని రీపోస్‌ మ్యాట్రెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాలచందర్‌ ఎస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒప్పంద కార్యక్రమంలో యూకే అండ్‌ కో వ్యవస్థాపకుడు ఉల్లాస్‌ కామత్, రీపోస్‌ మ్యాట్రెస్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామనాథ్‌ భట్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement