సిడ్నీ: శ్రీలంక పర్యటనలో విజృంభించిన ఆ్రస్టేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్ (Australia Left Arm Spinner) మ్యాట్ కునేమన్ (Matthew Kuhnemann) బౌలింగ్ శైలిపై (Bowling Action) సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సందర్భంగా కునేమన్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు లోబడి లేదని అంపైర్లు సందేహాలు లేవనెత్తడంతో... ఆసీస్ స్పిన్నర్ బయోమెకానికల్ పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తోంది.
‘శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన రెండో టెస్టు తర్వాత మ్యాచ్ అధికారుల కునేమన్ బౌలింగ్ అంశాన్ని ఆ్రస్టేలియా జట్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో మా ప్లేయర్‌కు పూర్తి మద్దతు ఇస్తాం’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
2017లో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసినప్పటి నుంచి 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన కునేమన్... ఆ్రస్టేలియా జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడి 25 వికెట్లు పడగొట్టాడు. తాజాగా శ్రీలంతో సిరీస్‌లో 28 ఏళ్ల కునేమన్ 17.18 సగటుతో 16 వికెట్లు తీశాడు. కునేమన్ బౌలింగ్‌పై ఫిర్యాదు అందడం ఇదే తొలిసారి అని సీఏ వెల్లడించింది.
ఈ నెల ఆఖర్లో బ్రిస్బేన్‌లో కునేమన్ బయోమెట్రిక్ పరీక్ష చేయించుకోనున్నాడు. అనంతరం ఫలితాలను విశ్లేషణ కోసం ఐసీసీకి పంపనున్నారు. ఒకవేళ కునేమన్ ఈ పరీక్షలో విఫలమైతే అతడిపై సస్పెన్షన్ వేటు పడగనుంది.
Comments
Please login to add a commentAdd a comment