
దుబాయ్: పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌కు మరోసారి ఐసీసీ ఆమోదం లభించింది. గత అక్టోబరులో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో అంపైర్లు అతని బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉందని నివేదిక ఇవ్వడంతో ఐసీసీ నిషేధం విధించింది.
అనంతరం తన యాక్షన్‌ను సరిదిద్దుకొని రెండు వారాల అతను పరీక్షకు హాజరయ్యాడు. తాజా యాక్షన్‌ను సరైనదిగా గుర్తించి అతను ఆఫ్‌స్పిన్ బౌలింగ్ వేసేం దుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. హఫీజ్ కెరీర్‌లో ఇలా జరగడం ఇది మూడోసారి.