'అశ్విన్, భజ్జీల బౌలింగ్పై అనుమానం' | Ajmal's doosra: Bhajji and Ashwin are chuckers | Sakshi
Sakshi News home page

'అశ్విన్, భజ్జీల బౌలింగ్పై అనుమానం'

Published Tue, Nov 3 2015 10:12 AM | Last Updated on Sat, Mar 23 2019 8:48 PM

'అశ్విన్, భజ్జీల బౌలింగ్పై అనుమానం' - Sakshi

'అశ్విన్, భజ్జీల బౌలింగ్పై అనుమానం'

టీమిండియాలో కీలక స్పిన్నర్లుగా కొనసాగుతున్న హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ ల బౌలింగ్ యాక్షన్ పై పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయ్యద్ అజ్మల్ తీవ్ర ఆరోపణలు చేశాడు. 'హర్భజన్, అశ్విన్ల యాక్షన్ పై నాకు చాలా అనుమానాలున్నాయి. నిజానికి వాళ్లిద్దరూ చకింగ్ చేస్తారు. ఆ విషయం మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది' అని అజ్మల్ అన్నారు. 'ఇంకా..నేను ఛాలెంజ్ విసురుతున్నా. బౌలింగ్ చేస్తున్నప్పుడు హర్భన్ చేయి 15 డిగ్రీల కంటే ఎక్కువ వంచుతాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం దానిని చకింగ్ గానే పరిగణిస్తారు' అని వ్యాఖ్యానించాడు.

పాకిస్థాన్ కు చెందిన ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజ్మల్ ఈ కామెంట్లు చేసినట్లు.. ఆయనను ఇంటర్వ్యూ చేసిన టీవీ యాకంర్ జైనాబ్ అబ్బాస్ వెల్లడించారు. అజ్మల్ ఇంతగా ఫ్రస్ట్రేట్ కావటం ఇదవరకెన్నడూ చూడలేదని అన్నారు. ఈ మేరకు మంగళవారం అబ్బాస్ కొన్ని ట్వీట్లు వదిలాడు. చకింగ్ చేస్తున్నాడని నిరూపణ కావడంతో గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరణకు గురైన సయ్యద్ అజ్మల్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఉన్నట్టుండి ఇలా దాయాది దేశ ఆటగాళ్లపై ఆరోపణలు చేయడం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి మరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement