Saeed Ajmal
-
వరల్డ్‌కప్‌లో ఘోర పరాభవం.. పాక్ బోర్డు మరో కీలక నిర్ణయం
CWC 2023- Pakistan Team- PCB: వన్డే వరల్డ్‌కప్-2023లో ఘోర పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోగా.. పేసర్ షాహిన్ ఆఫ్రిదిని టీ20 సారథిగా ప్రకటించింది. అదే విధంగా టెస్టు పగ్గాలను షాన్ మసూద్‌కు అప్పగించింది. ఇక కెప్టెన్సీ మార్పులతో పాటు పాలనా విభాగం, శిక్షనా సిబ్బందిలోనూ కీలక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా.. మాజీ క్రికెటర్లు మహ్మద్ హఫీజ్‌ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించిన పీసీబీ.. వహాబ్ రియాజ్‌ను చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేసింది. బౌలింగ్ కోచ్‌లుగా ఉమర్ గుల్, సయీద్ అజ్మల్ తాజాగా.. పీసీబీ తమ కోచింగ్ స్టాఫ్‌లో మరో ఇద్దరు మాజీ క్రికెటర్లను చేర్చుకుంది. ఉమర్ గుల్, సయీద్ అజ్మల్లకు బౌలింగ్ కోచ్‌లుగా అవకాశం ఇచ్చింది. గుల్ ఫాస్ట్‌బౌలింగ్ విభాగానికి కోచ్‌గా సేవలు అందించనుండగా.. అజ్మల్ స్పిన్ దళానికి మార్గదర్శనం చేయనున్నాడు. వీరిద్దరు డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు పీసీబీ చైర్మన్ జకా ఆష్రఫ్ మంగళవారం ప్రకటన విడుదల చేశాడు. కాగా ఉమర్ గుల్ ఇప్పటికే పాకిస్తాన్ జట్టుతో ప్రయాణం ఆరంభించాడు. అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా కోచ్‌గా వ్యవహరించాడు. మోర్నీ మోర్కెల్ గుడ్‌బై కాగా భారత్ వేదికగా ప్రపంచకప్ ఈవెంట్లో పాకిస్తాన్ దారుణ వైఫల్యంతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బాబర్ బృందం వరుస ఓటముల కారణంగా.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ముఖ్యంగా వన్డే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అఫ్గనిస్తాన్ చేతిలో చిత్తై పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ తన విధుల నుంచి వైదొలిగాడు. ఉమర్ గుల్.. సయీద్ అజ్మల్ కెరీర్ వివరాలు పాకిస్తాన్ తరఫున 2003లో ఎంట్రీ ఇచ్చిన 2016లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక తన కెరీర్లో ఈ రైటార్మ్ పేసర్ 47 టెస్టులాడి 163, 130 వన్డేల్లో 179, 60 టీ20లలో 85 వికెట్లు పడగొట్టాడు. అజ్మల్ విషయానికొస్తే.. 2008లో ఇంటర్నేషనల్ క్రికెట్ మొదలుపెట్టిన ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్.. 2015లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. తన కెరీర్లో 35 టెస్టులు, 113 వన్డేలు, 64 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 178, 184, 85 వికెట్లు పడగొట్టాడు. చదవండి: T20 WC: ‘వరల్డ్‌కప్-2024లో కెప్టెన్ రోహిత్ శర్మనే! కోహ్లి కూడా..’ -
ఆరోజు నాకు అన్యాయం చేసి ధోనికి అవార్డు ఇచ్చారు! ఎందుకంత ఏడుపు..
MS Dhoni: 350 వన్డేలు.. 10వేలకు పైగా పరుగులు(10773) .. 321 క్యాచ్‌లు.. 123 స్టంపింగ్స్‌లో భాగం.. ఓ వరల్డ్‌కప్ ట్రోఫీ.. వన్డే ఫార్మాట్లో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ట్రాక్ రికార్డు ఇది. అయితే, విచిత్రంగా తన కెరీర్లో వందలాది మ్యాచ్‌లు ఆడిన మహీ గెలుచుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు మాత్రం 21. అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాళ్ల జాబితాలో ఓవరాల్‌గా 33, టీమిండియా ఆటగాళ్లలో ఏడోస్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఓ మ్యాచ్‌లో తనకు అన్యాయం చేసి మరీ ధోనికి అవార్డు కట్టబెట్టారంటూ పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ తాజాగా ఆరోపించాడు. ‘‘నిజంగా అది నా దురదృష్టమే. టీమిండియాతో వన్డే సిరీస్‌లో భాగంగా ఆఖరైన మూడో మ్యాచ్‌లో వాళ్లను 175 పరుగులకే ఆలౌట్ చేయడంలో నాదే ముఖ్యపాత్ర. ఆ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు మేమే గెలిచాం. ఆ మ్యాచ్‌ల్లోనూ నేను మెరుగ్గా రాణించా. నా కెరీర్లో అత్త్యుత్తమ గణాంకాలు నమోదు చేశా. నాకు అన్యాయం చేశారు కానీ.. 175 పరుగులలో ఏవో కొన్ని రన్స్ తీసి.. రెండు క్యాచ్‌లు డ్రాప్ చేసినందుకేమో తనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. నిజంగా ఇది అన్యాయం. అసలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరికిస్తారో తెలుసా? ఓ మ్యాచ్‌లో జట్టు గెలిచినా ఓడినా సరే.. అత్యుత్తమంగా ఆడిన ప్లేయర్‌కే ఇవ్వాలి. కానీ ఆ మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది కాబట్టి ధోనికి అవార్డు ఇచ్చారు. అది కూడా క్యాచ్‌లు వదిలేసినందుకే అనుకుంటా’’ అంటూ అజ్మల్ ధోని ఆట తీరును కించపరిచే విధంగా మాట్లాడుతూ అక్కసు వెళ్లగక్కాడు. నాదర్ అలీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ నంబర్ 1 బౌలర్.. ఒక్క అవార్డు లేదు కాగా అజ్మల్ వన్డే, టీ20లలో వరల్డ్ నంబర్ 1 బౌలర్‌గా ఎదిగినప్పటికీ ఒక్కసారి కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో.. ‘‘ఒక్క మ్యాచ్‌లోనూ గెలిచింది లేదు. మరి ధోనిపై మాత్రం ఎందుకంత ఏడుపు!’’ అని తలా ఫ్యాన్స్ అతడిని ట్రోల్ చేస్తున్నారు. 2012-13లో పాకిస్తాన్ భారత పర్యటనకు వచ్చింది. ఈ సందర్భంగా.. రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడింది. టీ20 సిరీస్‌లో దాయాదులు చెరో మ్యాచ్ గెలవగా.. వన్డే సిరీస్‌ను మాత్రం పాక్ 2-1(తొలి రెండు గెలిచి)తో కైవసం చేసుకుంది. మతిమరుపు వచ్చిందా? ఇక వన్డే సిరీస్‌లో నాడు ధోని సాధించిన పరుగులు వరుసగా.. 113(నాటౌట్- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్), 54 నాటౌట్, 36. సయీద్ అజ్మల్ ఆరోపించినట్లు నాటి మ్యాచ్‌లో రెండు సులువైన క్యాచ్‌లు వదిలేయలేదు. కేవలం ఒకటి మాత్రమే మిస్ చేశాడు. అంతేకాదు సయీద్ అజ్మల్ ఇచ్చిన క్యాచ్ పట్టి అతడిని పెవిలియన్‌కు పంపాడు. ఇదిలా ఉంటే.. మూడో వన్డేలో అజ్మల్ 9.4 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి టీమిండియా 167 పరుగులకే కుప్పకూలడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 10 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, 45 ఏళ్ల సయీద్ అజ్మల్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ టీమిండియా 175 పరుగులకు ఆలౌట్ అయిందని చెప్పడం గమనార్హం. ఈ విషయాన్ని హైలైట్ చేసిన ధోని అభిమానులు.. ‘‘మతిమరుపులో ఏం మాట్లాడుతున్నావో అర్థం కానట్టుంది. పైగా ధోని గురించి అవాకులు చెవాకులు పేలడం.. ఇదేం బాగాలేదు.. నువ్వు ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది’’అని సెటైర్లు వేస్తున్నారు. చదవండి: కొనసాగుతున్న సీన్ విలియమ్స్ భీకర ఫామ్.. వదిలితే రన్‌మెషీన్‌ను మించిపోయేలా ఉన్నాడు! -
ఇది పాక్ క్రికెటర్లకే సాధ్యం.. 13 ఏళ్లకు సేమ్‌సీన్ రిపీట్
వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగిన టి20 సిరీస్‌ను పాకిస్తాన్ గెలుచుకుందనే విషయం కంటే మరొక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాఫిక్‌గా మారింది. పాకిస్తాన్ ఆటగాళ్లు ఇఫ్తికార్ అహ్మద్, మొహ్మద్ హస్నేన్లు చేసిన పని పాక్ జట్టును ట్రోల్స్ బారిన పడేలా చేసింది. ఇద్దరి మధ్య ఏర్పడిన సమన్వయ లోపంతో విండీస్ బ్యాట్స్‌మన్ బ్రూక్స్ ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశారు. తప్పు నీదంటే నీది అని కాసేపు వాదోపవాదాలు చేసుకున్నారు. ఆ సమయంలో తమ చెత్త ఫీల్డింగ్‌తో 13 ఏళ్ల కింద జరిగిన సంఘటనను రీక్రియేట్ చేశామని పాపం వారికి తెలియదు. ఇదే వారి కొంపముంచింది. అసలు విషయం ఏంటంటే.. 2008లో అచ్చం ఇదే తరహాలో షోయబ్ మాలిక్, సయీద్ అజ్మల్‌లు సమన్వయ లోపంతో ఒక క్యాచ్‌ను వదిలేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అప్పుడు, ఇప్పుడు ప్రత్యర్థి వెస్టిండీస్ కావడం విశేషం. సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఇఫ్తికార్ అహ్మద్, మొహ్మద్ హస్నేన్లను ట్యాగ్ చేస్తూ.. మాలిక్, అజ్మల్ 2.0 అంటూ ట్రోల్ చేశారు. ''ఏదైనా పాక్ క్రికెటర్లకే సాధ్యం.. చరిత్రను తిరగరాశారు''.. '' హస్నేన్ క్యాచ్ వదిలేసి సయీద్ అజ్మల్ గౌరవాన్ని పెంచాడు.''.. ''న్యూ అజ్మల్, మాలిక్‌లు.. బట్ సేమ్ ఓల్డ్ వెస్టిండీస్'' అంటూ కామెంట్స్ పెట్టారు. Hasnain & ifti 🤝 Malik & ajmal On both occasions opponent was west indies 😂😂❤️ #PAKvWI pic.twitter.com/YQj12liy5P — Saad Irfan 🇵🇰 (@SaadIrfan967) December 16, 2021 -
బీసీసీఐ పుణ్యమా అని అశ్విన్ బయటపడ్డాడు.. లేకపోతే..?
కరాచీ: పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ టీమిండియాపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు బీసీసీఐపై పలు ఆరోపణలు చేశాడు. అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన అశ్విన్‌ను బీసీసీఐ కాపాడిందని, లేకపోతే అతనిపై నిషేధం పడేదని వెల్లడించాడు. ఐసీసీకి యాష్పై అనుమానం కలిగినప్పుడు బీసీసీఐ అతన్ని కొన్ని నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంచిందని, ఆ సమయంలో యాష్ తన బౌలింగ్ యాక్షన్‌ను సరిచేసుకున్నాడని ఆరోపణలు గుప్పించాడు. కాగా, స్పిన్ బౌలర్ భుజం 15 డిగ్రీలు వంపు తిరగాల్సిందేనంటూ ఐసీసీ విధించిన ఆంక్షల నేపథ్యంలో అజ్మల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా, ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజ్మల్ మాట్లాడుతూ.. బీసీసీఐ పుణ్యమా అని అశ్విన్ నిషేధం బారిన పడకుండా బయటపడ్డాడని, అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)లో ఇలాంటి పరిస్థితి ఉండదని, వారికి తమ ఆటగాళ్ల భవిష్యత్తు కంటే డబ్బే ముఖ్యమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అజ్మల్ ఐసీసీపై కూడా పలు ఆరోపణలు గుప్పించాడు. ఐసీసీ.. ఒక్క బీసీసీఐ సలహాలు మాత్రమే పరిగణలోకి తీసుకుని నిబంధనలను మారుస్తుందని, ఎంతటి కఠిన నిబంధనలైనా భారత్‌కు వర్తించకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నాడు. కాగా, అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన కారణంగా అజ్మల్‌పై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కుడి చేతి ఆఫ్ స్పిన్నర్ అయిన అజ్మల్ పాక్ తరఫున 2008-15 మధ్యలో 35 టెస్ట్‌లు, 113 వన్డేలు, 64 టీ20లు ఆడి మొత్తంగా 447 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే టీమిండియా స్టార్ బౌలర్ అశ్విన్ 78 టెస్ట్‌లు, 111 వన్డేలు, 46 టీ20లు ఆడి మొత్తంగా 611 వికెట్లు సాధించాడు. చదవండి: అసభ్య పదజాలంతో రైనా టీషర్ట్, చీవాట్లు పెట్టిన ద్రవిడ్ -
‘అండర్సన్ తల పగులగొట్టాలనుకున్నా’
‘‘ఇంగ్లండ్ ఆటగాళ్లు కొత్త బంతిని తీసుకున్నపుడు.. అండర్సన్ నా దగ్గరకు వచ్చాడు. బౌన్సర్లు ఎదుర్కొనేందుకు సిద్ధమేనా అని అడిగాడు. నాకు ఇంగ్లిష్ రాదని తనకు చెప్పాను. బహుషా నేను టెయిలెండర్ అయినందు వల్లే అతడలా జోక్ చేసి ఉంటాడు. నన్ను త్వరగా ఔట్ చేయాలని భావించి ఉంటాడు అంటూ ఇంగ్లండ్- పాకిస్తాన్ టెస్టు క్రికెట్ మ్యాచ్ నాటి సంగతులను పాక్ మాజీ క్రికెటర్ సయీద్ అజ్మల్ గుర్తుచేసుకున్నాడు. క్రికెట్ పాకిస్తాన్‌తో మాట్లాడిన అతడు.. 2010లో బర్మింగ్‌హాంలో జరిగిన సెకండ్ టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు తనను టార్గెట్ చేశారని చెప్పుకొచ్చాడు.(కరోనాతో మాజీ క్రికెటర్ మృతి) ఇక ఆనాటి మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసి సత్తా చాటిన ఈ ఆఫ్ స్పిన్నర్ మాట్లాడుతూ... ‘‘ బౌన్సర్లు సంధించి నన్ను పరీక్షించారు. ఆరేడు బంతుల తర్వాత... జుల్కర్నైన్ను పిలిచి అండర్సన్ తలను నా బ్యాట్‌తో పగులగొట్టేస్తానని చెప్పాను. క్రీజు వదిలి ముందుకొచ్చి రెండు బౌన్సర్లు బాదేశాను. ఇక అప్పటి నుంచి బంతి నా బ్యాట్ మీదకు రావడం మొదలెట్టింది. అలా 50 పరుగులు పూర్తి చేశా’’అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పాక్ కేవలం 72 పరుగులే చేసి కుప్పకూలగా.. ఇంగ్లండ్ 251 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కాస్త మెరుగ్గా రాణించిన పాకిస్తాన్ 296 పరుగులు సాధించి చెప్పుకోదగ్గ స్కోరు చేయగా... ప్రత్యర్థి జట్టు కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి పాక్‌ను మట్టికరిపించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్ గ్రేమ్ స్వాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. నాలుగు టెస్టుల సిరీస్‌ను 3-1 తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.('టిమ్ పైన్ ఉత్తమ కెప్టెన్‌గా నిలుస్తాడు') -
'ఆనాటి సచిన్ నాటౌట్.. నేటికి నాకు పజిలే'
కరాచీ:అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్తాన్ వివాదాస్పద స్పిన్నర్ సయీద్ అజ్మల్ వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. నేషనల్ టీ 20 చాంపియన్ షిప్లో భాగంగా బుధవారం ఫైసలాబాద్ తరపున అజ్మల్ చివరి క్రికెట్ మ్యాచ్ ఆడేశాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)పై అజ్మల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. 'ఇప్పుడు నాకు 40 ఏళ్లు. కాబట్టి నేను తప్పుకొని యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాలనుకుంటున్నాను. ఎంతో అసంతృప్తితో ఇప్పుడు రిటైరవుతున్నాను. ఇందుకు ప్రధాన కారణం ఐసీసీ. నా బౌలింగ్ శైలి సరిగా లేదంటూ నాపై పదే పదే నిషేధం విధిస్తూ వచ్చారు. ఈ సందర్భంగా నేను ఐసీసీకి ఒక సవాలు విసురుతున్నాను. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న బౌలర్లకు ఒకసారి పరీక్ష నిర్వహించండి. అందులో ఎంతమంది ఫెయిల్ అవుతారో చూడండి. నాకు తెలిసి 90 శాతం మంది బౌలింగ్ సరిగా లేదని నేను కచ్చితంగా చెప్పగలను 'అని అజ్మల్ విమర్శించాడు. కాగా, దాదాపు ఆరేళ్ల క్రితం నాటి ఒక సంఘటనను అజ్మల్ ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నాడు. 'నా కెరీర్లో ఇప్పటికీ అర్థం కాని ఒక విషయం ఉంది. 2011 ప్రపంచకప్ సెమీ ఫైనల్-2లో మేము భారత్‌తో తలపడ్డాం. ఆ మ్యాచ్‌లో సచిన్ 85 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 37వ ఓవర్లో నా బౌలింగ్‌లోనే సచిన్ అఫ్రిదికి క్యాచ్ ఇచ్చాడు. అంతకుముందే నా బౌలింగ్‌లో సచిన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ దాన్ని అవుట్‌గా ప్రకటించాడు. కాకపోతే భారత్ రివ్యూకు వెళ్లింది. కానీ థర్డ్ అంపైర్ ఔటివ్వలేదు. అప్పుడు థర్డ్ అంపైర్ నాటౌట్ అని ప్రకటించడం నాకు ఇప్పటికీ పజిలే. ఆ సమయంలో బంతి క్లియర్ గా వికెట్ల మీదుగా వెళుతుంది. కానీ డీఆర్ఎస్లో బంతి లెగ్ స్టంప్‌కు బయటకు వెళుతున్నట్లు కనబడింది. అది నాకు ఇప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది'అని అజ్మల్ గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు. -
'నేను రిటైర్ కాను..ఇంకా ఆడతా'
కరాచీ: దాదాపు రెండేళ్ల నుంచి అంతర్జాతీయ నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌కు ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచన లేదట. గతవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) పలువురు తమ దేశ క్రికెటర్లకు ఘనమైన వీడ్కోలు ఏర్పాట్లు చేయాలని భావించింది. ఇందులో ప్రధానంగా పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో పాటు సయీద్ అజ్మల్‌లు పీసీబీ వీడ్కోలు జాబితాలో ఉన్నారు. అయితే అజ్మల్ మాత్రం తన రిటైర్మెంట్కు సంబంధించి పీసీబీ తొందర పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. 'ఇప్పట్లో క్రికెట్ కు వీడ్కోలు చెప్పే యోచన లేదు. నేను ఇప్పటికే జాతీయ టీ 20 కప్‌లో ఫిట్నెస్ను నిరూపించుకున్నా. ఇది నాకు జట్టులో చాన్స్‌కు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నా. ఒకవేళ నేను నిరూపించుకోపోతే.. జట్టు నుంచి స్వతహాగా వైదొలుగుతా. ఇంకా దేశవాళీ క్రికెట్ ను కొనసాగించి సత్తాచాటుకుంటా'అని అజ్మల్ తెలిపాడు. 2014లో అజ్మల్ తన బౌలింగ్ ను నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నాడనే కారణంతో అతనిపై నిషేధం పడింది. అయితే గతేడాది బౌలింగ్ ను సరి చేసుకుని బంగ్లాదేశ్ పర్యటకు ఎంపికయ్యాడు. కాగా, మరొకసారి అతని బౌలింగ్ లో ఇబ్బందులు తలెత్తడంతో నిషేధం ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది పాకిస్తాన్ జాతీయ టీ 20 కప్‌లో అజ్మల్ 20 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో 6.28 స్ట్రైక్ రేట్‌తో ఆకట్టుకున్నాడు. కాగా, పాకిస్తాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నజీమ్ సేథీ మాత్రం ఆఫ్రిది, అజ్మల్లతో రిటైర్మెంట్ నిర్ణయంపై త్వరలోనే చర్చిస్తానని స్పష్టం చేశాడు. -
'అకాడమీ పేరుతో అజ్మల్ దగా చేశాడు'
కరాచీ:అనుమానస్పద బౌలింగ్ తో అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన పాకిస్తాన్ స్పిన్నర్ సయిద్ అజ్మల్ అకాడమీ పేరుతో మోసం చేశాడని ఫైసలాబాద్ అగ్రికల్చర్ యూనివర్శిటీ నిర్వహణ శాఖ ఆరోపించింది. ఉచితంగా కోచింగ్ ఇస్తానని ప్రకటించిన అజ్మల్.. దాదాపు అందులో చేరిన వారందరి దగ్గర్నుంచీ భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పేర్కొంది. ఈ అకాడమీకి సంబంధించి గత సంవత్సర కాలంగా యూనివర్శిటీ యాజమాన్యానికి, అజ్మల్ కు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొంత కాలం క్రితం అజ్మల్ అకాడమీని మూసేశాడు. కాగా, ఆ అకాడమీలో 350 మంది విద్యార్థులను సభ్యులుగా చేర్చుకుని పదిహేను వేల రూపాయల చొప్పున వసూలు చేసినట్లు యూనివర్శిటీ పరిపాలన శాఖ తాజాగా స్పష్టం చేసింది. ఈ రూపంలో రూ.50 లక్షలను వసూలు చేశాడని తెలిపింది. ఉచితంగా క్రికెట్ అకాడమీని విస్తరించేందుకు యూనివర్శిటీ స్థలాన్ని అజ్మల్ కు ఇస్తే విద్యార్థులను దగా చేయడంతో ఆ స్థలాన్ని ఖాళీ చేయమని ఆదేశించినట్లు యూనివర్శిటీ నిర్వహణ అధికారి ఒకరు తెలిపారు. ఒక సమయంలో స్థలాన్ని బలవంతంగా ఆక్రమించుకోవాలని అజ్మల్ తీవ్ర యత్నాలు చేశాడన్నారు. ఇదిలా ఉండగా, గత నెలలోనే ప్రభుత్వం చొరవతో ఆ వివాదం సద్దుమణిగిందని, దీనిలో భాగంగా ఫైసలాబాద్ కమిషనర్‌ను, అకాడమీ సంబంధిత అధికారుల్ని కూడా పలుమార్లు కలిసిట్లు అజ్మల్ పేర్కొన్నాడు. తమ మధ్య తిరిగి అకాడమీని తెరిచేందుకు ఒప్పందం కుదిరిన తరువాత యూనివర్శిటీ అధికారులు ఇలా వ్యవహరించడం తగదన్నాడు. అకాడమీని నిర్మించడానికి సొంత డబ్బులు ఖర్చు చేసినట్లు అజ్మల్ పేర్కొన్నాడు. -
ఐసీసీ తీరును తప్పుబట్టిన అజ్మల్ పై చర్యలు!
కరాచీ: ప్రపంచ క్రికెట్ లోని సందేహాస్పద బౌలింగ్ పట్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వ్యవహరించే తీరు ఏకపక్షంగా ఉంటుందంటూ విమర్శలకు దిగిన పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్(38) పై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. బుధవారం జియో చానల్ నిర్వహించిన టాక్ షోలో అజ్మల్ మాట్లాడుతూ.. ఐసీసీ తీసుకునే చర్యలు కేవలం ఆఫ్ స్పిన్నర్లేపైనే ఉంటాయా? అంటూ ప్రశ్నించి తాజా వివాదానికి తెరలేపాడు. చాలా మంది బౌలర్లు తమ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నప్పటికీ వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అజ్మల్ ప్రశ్నించాడు. 'ఆఫ్ స్పిన్నర్లే లక్ష్యంగా ఐసీసీ వ్యవహరిస్తోంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లపై చర్యలు ఎందుకు తీసుకోరు. అందులో లెగ్ స్పిన్నర్లకు ఫాస్ట్ బౌలర్లకు మినహాయింపు ఎందుకు ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఎప్పట్నుంచో గమనిస్తునే ఉన్నాను. ఐసీసీ నిబంధనలు ఉల్లంఘిస్తున్న చాలా మంది పేర్లు నాకు తెలుసు. కానీ వారి పేర్లు చెప్పాలని అనుకోవడం లేదు' అని అజ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలా బహిరంగంగా విమర్శలు గుప్పించిన అజ్మల్ పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీరియస్ గా ఉంది. దీనిలో భాగంగా అతనిపై చర్యలు తీసుకోవాలని పాక్ క్రికెట్ పెద్దలు భావిస్తున్నారు. అసలు అజ్మల్ మాట్లాడిన టేపును నిపుణులతో పర్యవేక్షించిన తరువాత అతనిపై చర్యలు తీసుకోవాలని బోర్డు యోచనగా ఉంది. కాగా, దీనిపై 48 గంట్లలో వివరణ ఇవ్వాలని కోరుతూ అజ్మల్ కు పాక్ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సందేహాస్పాద బౌలింగ్ యాక్షన్ తో గత సంవత్సరం నుంచి అజ్మల్ పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. -
'అశ్విన్, భజ్జీల బౌలింగ్‌పై అనుమానం'
టీమిండియాలో కీలక స్పిన్నర్లుగా కొనసాగుతున్న హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ ల బౌలింగ్ యాక్షన్ పై పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయ్యద్ అజ్మల్ తీవ్ర ఆరోపణలు చేశాడు. 'హర్భజన్, అశ్విన్‌ల యాక్షన్ పై నాకు చాలా అనుమానాలున్నాయి. నిజానికి వాళ్లిద్దరూ చకింగ్ చేస్తారు. ఆ విషయం మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది' అని అజ్మల్ అన్నారు. 'ఇంకా..నేను ఛాలెంజ్ విసురుతున్నా. బౌలింగ్ చేస్తున్నప్పుడు హర్భన్ చేయి 15 డిగ్రీల కంటే ఎక్కువ వంచుతాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం దానిని చకింగ్ గానే పరిగణిస్తారు' అని వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ కు చెందిన ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజ్మల్ ఈ కామెంట్లు చేసినట్లు.. ఆయనను ఇంటర్వ్యూ చేసిన టీవీ యాకంర్ జైనాబ్ అబ్బాస్ వెల్లడించారు. అజ్మల్ ఇంతగా ఫ్రస్ట్రేట్ కావటం ఇదవరకెన్నడూ చూడలేదని అన్నారు. ఈ మేరకు మంగళవారం అబ్బాస్ కొన్ని ట్వీట్లు వదిలాడు. చకింగ్ చేస్తున్నాడని నిరూపణ కావడంతో గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరణకు గురైన సయ్యద్ అజ్మల్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఉన్నట్టుండి ఇలా దాయాది దేశ ఆటగాళ్లపై ఆరోపణలు చేయడం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి మరి! -
అజ్మల్ మళ్లీ వచ్చాడు
కరాచీ: సందేహాస్పాద బౌలింగ్ యాక్షన్ లో సస్పెన్షన్ కు గురైన పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు కల్పించారు. హరూన్ రషీద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టెస్టులు, వన్డేలు, టి20లకు వేర్వేరుగా టీమ్ ను ఎంపిక చేసింది. మూడు ఫార్మెట్ ల్లోనూ అజ్మల్ స్థానం దక్కించుకున్నాడు. ఈ నెల 17 నుంచి బంగ్లాదేశ్ పర్యటన ప్రారంభమవుతుంది. బౌలింగ్ యాక్షన్ మార్పులు చేసుకోవడంతో ఐసీసీ అతడికి ప్రపంచకప్ కు ముందు లైన్ క్లియర్ అయింది. -
ప్రపంచకప్‌కు అజ్మల్!
చెన్నై: పాకిస్తాన్ నిషేధిత స్పిన్నర్ సయీద్ అజ్మల్... ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు కనబడుతున్నాయి. జనవరి 24న చెన్నైలో జరిగిన బయోమెకానిక్ పరీక్షలో అతను అద్భుతమైన పురోగతి చూపించాడని టెస్టు నిర్వహించిన కోచ్‌లు పేర్కొన్నారు. ఐసీసీ నిపుణుల నుంచి క్లియరెన్స్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం అజ్మల్ పరీక్ష నివేదికను ఐసీసీ ప్రధాన కార్యాలయానికి పంపారు. బౌలింగ్ యాక్షన్ సరి చేసుకున్న తర్వాత 12 వేల బంతులు వేసిన అజ్మల్ రెండు దేశవాళీ మ్యాచ్‌లు కూడా ఆడాడు. హఫీజ్ డుమ్మా పాదం గాయంతో బాధపడుతున్న నిషేధిత బౌలర్ మహ్మద్ హఫీజ్... శుక్రవారం జరగాల్సిన ఐసీసీ అధికారిక బయోమెకానిక్ పరీక్షకు గైర్హాజరయ్యాడు. దీంతో మరో తేదీని ప్రకటించాలని పీసీబీ... ఐసీసీని కోరింది. అయితే ఈనెల 10న పరీక్ష నిర్వహించే అవకాశాలుండటంతో 15న భారత్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో అతను బౌలింగ్ చేయడంపై సందిగ్ధం నెలకొంది. -
బౌలింగ్ టెస్టుకు హాజరైన అజ్మల్
చెన్నై: పాకిస్తాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ శనివారం ఐసీసీ అధికారిక బౌలింగ్ పరీక్ష కోసం హాజరయ్యాడు. ఇక్కడి ఐసీసీ గుర్తింపు పొందిన లాబొరేటరీలో జరిగిన ఈ పరీక్షకు దుబాయ్ నుంచి ఇద్దరు సాంకేతిక నిపుణులు వచ్చారు. అజ్మల్‌తో పాటు బంగ్లాదేశ్ ఆఫ్ స్పిన్నర్ సొహాగ్ గజీ కూడా హాజరయ్యాడు. 10 రోజుల్లోగా ఫలితం రానుంది. ముంబైపై రాంచీ గెలుపు ముంబై: మిడిల్టన్ రెండు గోల్స్‌తో చెలరేగడంతో హాకీ ఇండియా లీగ్‌లో రాంచీ రేస్‌కు తొలి గెలుపు దక్కింది. మహీంద్రా స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ముంబైని 2-1 తేడాతో మట్టికరిపించింది. మూడో క్వార్టర్లో ముంబైకి స్టార్ స్ట్రయికర్ టామ్ బూన్ గోల్‌తో 1-0 ఆధిక్యం అందించాడు. వెంటనే తేరుకున్న రాంచీ... మిడిల్టన్ చేసిన గోల్స్‌తో విజయం సాధించింది. -
అజ్మల్‌కు పరీక్ష 24న
కరాచీ: సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌కు ఈ నెల 24న ఐసీసీ పరీక్ష నిర్వహించనుంది. చెన్నైలోని బయోమెకానిక్ పరీక్ష కేంద్రంలో దీనిని నిర్వహిస్తారు. గత సెప్టెంబరులో అజ్మల్‌పై ఐసీసీ నిషేధం విధించింది. ఆ తర్వాత తన బౌలింగ్ శైలిని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేసిన ఈ పాక్ స్పిన్నర్ పలుమార్లు అనధికార టెస్టుల్లో పాల్గొన్నాడు. ఇప్పుడు తన బౌలింగ్ శైలి నిబంధనలకు అనుగుణంగా ఉందని పాక్ బోర్డుకు చెప్పడంతో... అధికారిక పరీక్ష నిర్వహించమని కోరారు. దీంతో చెన్నైలోని సెంటర్‌కు జనవరి 24 వెళ్లాలని ఐసీసీ తెలిపింది. ఒకవేళ ఈ పరీక్షలో గనక అజ్మల్ విఫలమైతే... ఏడాది పాటు మరోసారి ఐసీసీ పరీక్ష నిర్వహించదు. అంటే అజ్మల్ మరో ఏడాది పాటు క్రికెట్‌కు దూరం కావలసి ఉంటుంది. పరీక్ష కోసం బ్రిస్బేన్‌లోని సెంటర్‌కు వెళ్తానని అజ్మల్ కోరినా... ఐసీసీ మాత్రం చెన్నై వెళ్లాలని సూచించింది. ప్రపంచకప్‌కు పాకిస్తాన్ జట్టులో అజ్మల్‌కు స్థానం దక్కలేదు. -
బీసీసీఐ హస్తం లేదు:అక్రం
కరాచీ: వచ్చే ప్రపంచకప్ నుంచి సయీద్ అజ్మల్ తప్పుకోవడం వెనుక బీసీసీఐ హస్తముందన్న ఆరోపణలను పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ మహ్మద్ అక్రం ఖండించారు. తన సందేహాస్పద బౌలింగ్ శైలిని ఇంకా పూర్తి స్థాయిలో మెరుగుపర్చుకోలేదనే అభిప్రాయంతోనే అజ్మల్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పారు. ‘ప్రపంచకప్ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం పూర్తిగా అజ్మల్ తీసుకున్నాడు. ప్రస్తుత బౌలింగ్ శైలి అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలకు అనుగుణంగా లేదనే అభిప్రాయంతో అతను ఉన్నాడు. అంతేకానీ ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ప్రపంచకప్‌తోనే అంతా అయిపోయినట్టు కాదు. ఇంకా చాలా క్రికెట్ ఉంది. ఇది అర్థం చేసుకునే అజ్మల్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడు’ అని అక్రం స్పష్టం చేశారు. మరోవైపు అజ్మల్ తనపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ స్విట్జర్లాండ్‌లోని కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ (సీఏఎస్)లో కేసు దాఖలు చేయాలని పాక్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ సలహా ఇచ్చాడు. శారీరక వైకల్యం కారణంగానే అజ్మల్ బౌలింగ్ చేస్తున్నపుడు తన చేయిని 15 డిగ్రీలకంటే ఎక్కువగా వంచుతున్నాడని అక్తర్ అభిప్రాయపడ్డాడు. -
చెన్నైకి పాకిస్థాన్ స్పిన్నర్లు
కరాచీ: సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ క్రికెట్ స్పిన్నర్లు సయీద్ అజ్మల్, మొహమ్మద్ హఫీజ్ చెన్నైకి వెళ్లనున్నారు. ఐసీసీ గుర్తింపు పొందిన చెన్నై బౌలింగ్ సెంటర్ లో తమ బౌలింగ్ యాక్షన్ ను వారు పరీక్షించుకోనున్నారు. అజ్మల్, హఫీజ్ అభ్యర్థన మేరకు వారిని చెన్నై పంపుతున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తెలిపింది. వారి పర్యటన ఖరారైందని వెల్లడించింది. భారత హైకమిషన్, తమ విదేశాంగ శాఖ అనుమతి కూడా లభించిందని తెలిపింది. రెండు, మూడు రోజుల్లో అజ్మల్, హఫీజ్ చెన్నైకి బయలుదేరతారని పేర్కొంది. -
మూడు నెలల తరువాత ఫీల్డ్ లోకి అజ్మల్!
లాహోర్: సస్పెన్షన్ వేటు పడ్డ పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ మూడు నెలల అనంతరం ఫీల్డ్ లోకి దిగాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో భాగంగా లాహోర్ లో శుక్రవారం కెన్యాతో జరిగిన వన్డే మ్యాచ్ లో అజ్మల్ బౌలింగ్ చేశాడు. పాకిస్థాన్- ఎ తరుపున కేవలం ఆరు ఓవర్లు మాత్రమే వేసిన అజ్మల్ ఒక వికెట్టు తీసి 23 పరుగులు ఇచ్చాడు. చెన్నైలో బయోమెకానిక్ పరీక్షకు పంపడానికి ముందు కెన్యాతో జరిగే చివరి రెండు వన్డేల్లో బరిలోకి దించాలని పీసీబీ నిర్ణయించడంతో ఈ మ్యాచ్ లో అజ్మల్ పాల్గొన్నాడు. ఆరు ఓవర్లు వేసిన అజ్మల్ బౌలింగ్ వివిధ యాక్షన్లలో వేయగా, దూస్రాలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. మూడు నెలల అనంతరం బౌలింగ్ చేసిన తన యాక్షన్ పై అజ్మల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. తాను తిరిగి ప్రపంచకప్ నాటికి జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడన్న కారణంతో గత సెప్టెంబర్ లో సయీద్ అజ్మల్‌పై ఐసీసీ నిషేధం విధించింది. -
హఫీజ్‌పై ఐసీసీ వేటు
దుబాయ్: పాకిస్తాన్ క్రికెట్‌కు మరో ఎదురుదెబ్బ. తమ స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ సస్పెన్షన్ ఇంకా కొనసాగుతుండగానే తాజాగా ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్బౌలింగ్పైనా వేటు పడింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ఐసీసీ తెలిపింది. అతడి బౌలింగ్ శైలి వివాదాస్పదంగా ఉండడమే దీనికి కారణం. ‘హఫీజ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు నిర్ణీత 15 డిగ్రీల స్థాయి కన్నా ఎక్కువగా మోచేతిని వంచుతున్నట్టు స్వతంత్ర విచారణలో తేలింది. ఇది నిబంధనల ప్రకారం అనైతికం. అందుకే అంతర్జాతీయ క్రికెట్ బౌ లింగ్ నుంచి తక్షణం సస్పెండ్ చేస్తున్నాం’ అని ఐసీసీ ప్రకటించింది. -
పాక్ ప్రాబబుల్స్‌లో అజ్మల్
కరాచీ: సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌ను వన్డే ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో ఎంపిక చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి మార్చి 31 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగే ప్రపంచ కప్ కోసం 30 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) శనివారం ప్రకటించింది. తుది జట్టును ఖరారు చేసేందుకు మరో నెల రోజుల గడువు ఉన్నందుకే అజ్మల్‌ను ఎంపిక చేశామని పీసీబీ అధికారి వివరణ ఇచ్చారు. తన బౌలింగ్ శైలిని సరిదిద్దుకునే పనిలో ఉన్న అజ్మల్ త్వరలో ఐసీసీ నిర్వహించే పరీక్షకు హాజరుకానున్నాడు. అజ్మల్‌తోపాటు ప్రాబబుల్స్‌లో వెటరన్స్ కమ్రాన్ అక్మల్, షోయబ్ మాలిక్‌లకు చోటు దక్కింది. -
సక్లయిన్ ముస్తాక్ నెలకు రూ.10 లక్షలు!
కరాచీ:పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లయిన్ ముస్తాక్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) తో ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బౌలింగ్ పై ఐసీసీ నిషేధం విధించడంతో అతని యాక్షన్ సరిదిద్దేందుకు పాకిస్తాన్ నడుంబిగించింది. ఇందులో భాగంగానే సక్లయిన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం బౌలింగ్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ గా ఉన్న అజ్మల్ పై నిషేధం అంశం పాకిస్తాన్ క్రికెట్ ను కలవర పెట్టింది. వచ్చే ప్రపంచకప్ నాటికి అతని బౌలింగ్ యాక్షన్ ను సరిదిద్ది మరోమారు అంతర్జాతీయ క్రికెట్ లోకి తీసుకు రావాలని పాకిస్తాన్ యోచిస్తోంది. అందుకు గాను ఆ దేశ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ సహాయం కోరింది. దీనికి అంగీకరించిన పీసీబీ అతనికి నెలకు రూ.10 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడన్నకారణంతో వన్డేల్లో ప్రపంచ నంబర్‌వన్ బౌలర్ సయీద్ అజ్మల్‌పై ఐసీసీ నిషేధం విధించారు. ఇక నుంచి ఈ పాకిస్థాన్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకూడదని స్పష్టం చేసింది. బంతులు వేసేటప్పుడు అజ్మల్ తన చేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నట్లు ఓ స్వతంత్ర సంస్థ చేసిన పరిశోధనలో వెల్లడైందని క్రికెట్ మండలి వెల్లడించింది. గత నెలలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 36 ఏళ్ల అజ్మల్ బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని ఆన్‌ఫీల్డ్ అంపైర్లు బెన్ ఆక్సెన్‌ఫోర్డ్, ఇయాన్ గౌల్ట్ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కు ఫిర్యాదు చేశారు. -
అజ్మల్ కు అండగా పీసీబీ!
కరాచీ:ఐసీసీ నిషేధానికి గురైన పాకిస్తాన్ స్పిన్నర్ సయిద్ అజ్మల్ ను కాపాడేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) నడుంబిగించింది.అతడి బౌలింగ్ యాక్షన్ ను సరిదిద్ది మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి తీసుకోచ్చేందుకు మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాఖ్ సాయం కోరింది. అజ్మల్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ తాజాగా ఐసీసీ అతనిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో పీసీబీ.. ఆ దేశ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ ను సంప్రదించింది. అజ్మల్ బౌలింగ్ శైలిలో మార్పు తెచ్చి.. తిరిగి అంతర్జాతీయంగా అతన్ని ఆడించాలని పాకిస్తాన్ భావిస్తోంది. 'పీసీబీ నన్ను సంప్రదించింది. అజ్మల్ కు సాయం చేయాలని కోరింది. . అజ్మల్ ఒక పోరాట యోధుడు. అతని బౌలింగ్ మళ్లీ సరిదిద్దుకుని ఐసీసీ సమీక్షకు వెళ్లే అవకాశం ఉందని' సక్లయిన్ తెలిపాడు. అతని బౌలింగ్ ను సరిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సక్లయిన్ పేర్కొన్నాడు. తొలుత ఐసీసీ నిషేధాన్నిసవాలు చేయాలని భావించిన పాకిస్తాన్.. ఆ నిర్ణయాన్ని మార్చుకుని సక్లయిన్ సాయాన్ని కోరింది. ఒకవేళ ఐసీసీ నిషేధాన్ని సవాల్ చేయాలని పాకిస్తాన్ భావించనప్పటికీ.. ఆ పరీక్షల్లో కూడా అజ్మల్ విఫలమైతే మరిన్ని సమస్యలు రావచ్చని పాకిస్తాన్ ముందుగా అతని బౌలింగ్ సరిచేయడానికి యత్నాలు ఆరంభించింది. -
పాకిస్థాన్‌కు చావుదెబ్బ!!
తమ జట్టులో ప్రధాన స్పిన్నర్.. చాలావరకు మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించగల సత్తా ఉన్న సయీద్ అజ్మల్ మీద నిషేధం వేటు పడటంతో పాకిస్థాన్ జట్టుకు చావుదెబ్బ తగిలింది. వన్డేలలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న అజ్మల్ బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉందని గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఐసీసీ అతడి బౌలింగ్ యాక్షన్‌ను ఓ స్వంతంత్ర సంస్థతో పరిశీలించి నివేదిక తెప్పించుకుంది. బంతులు వేసేటప్పుడు అజ్మల్ తన చేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నట్లు తేలడంతో అతడి మీద నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణం అమలులోకి వస్తుందని, ఇక నుంచి ఈ పాకిస్థాన్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకూడదని స్పష్టం చేసింది. పాకిస్థాన్ తరఫున ఇప్పటి వరకు 35 టెస్టులు ఆడిన అజ్మల్ 178 వికెట్లు తీశాడు. 111 వన్డేల్లో 183 వికెట్లు తీసి జట్టు బౌలింగ్‌కు పెద్ద దిక్కుగా మారాడు. గత నెలలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 36 ఏళ్ల అజ్మల్ బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని ఆరోపణలు వచ్చాయి. చివరకు.. అజ్మల్ బౌలింగ్ నిబంధనల ప్రకారం లేదని నివేదిక ఇవ్వడంతో ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇదే ఇప్పుడు పాక్ జట్టుకు ఆశనిపాతంలా మారింది. -
అజ్మల్‌పై నిషేధం
సందేహాస్పద బౌలింగ్‌పై ఐసీసీ చర్యలు అప్పీలు చేయనున్న పీసీబీ దుబాయ్ / కరాచీ: నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడన్న కారణంతో వన్డేల్లో ప్రపంచ నంబర్‌వన్ బౌలర్ సయీద్ అజ్మల్‌పై ఐసీసీ నిషేధం విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని, ఇక నుంచి ఈ పాకిస్థాన్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకూడదని స్పష్టం చేసింది. బంతులు వేసేటప్పుడు అజ్మల్ తన చేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నట్లు ఓ స్వతంత్ర సంస్థ చేసిన పరిశోధనలో వెల్లడైందని క్రికెట్ మండలి వెల్లడించింది. గత నెలలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 36 ఏళ్ల అజ్మల్ బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని ఆన్‌ఫీల్డ్ అంపైర్లు బెన్ ఆక్సెన్‌ఫోర్డ్, ఇయాన్ గౌల్ట్ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అజ్మల్ మరోసారి తన బౌలింగ్‌ను పరీక్షించుకోవాల్సి వచ్చింది. ఆగస్టు 25న బ్రిస్బేన్‌లో జాతీయ క్రికెట్ సెంటర్లో ఐసీసీకి చెందిన ‘హ్యూమన్ మూవ్మెంట్ స్పెషలిస్ట్’లు బౌలర్ యాక్షన్ పూర్తిస్థాయిలో విశ్లేషించారు. అజ్మల్ బౌలింగ్ నిబంధనల ప్రకారం లేదని నివేదిక ఇవ్వడంతో ఐసీసీ చర్యలు తీసుకుంది. 2009లో తొలిసారి ఆరోపణలు అజ్మల్ బౌలింగ్ సందేహాస్పదంగా ఉందని అతను అరంగేట్రం చేసిన ఏడాది (2009)లోనే ఆరోపణలు వచ్చాయి. అతను వేసే ‘దూస్రా’ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పెర్త్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా’లో బౌలింగ్ యాక్షన్‌ను విశ్లేషించిన నిపుణులు క్లీన్చిట్ ఇచ్చారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలా మంది బౌలర్లకు పెర్త్ యూనివర్సిటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో... ఇటీవలే ఐసీసీ తన బౌలింగ్ యాక్షన్ ప్రొటోకాల్‌ను మార్చి బ్రిస్బేన్‌లోని సెంటర్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో అజ్మల్ బౌలింగ్ యాక్షన్‌ను విశ్లేషించిన నిపుణులు నిబంధనలకు అనుకూలంగా లేదని తేల్చారు. పాక్‌కు ఎదురుదెబ్బ అజ్మల్‌పై నిషేధం విధించడంతో పాక్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో ప్రధాన స్పిన్నర్‌గా చాలా మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించిన అతను వన్డే ప్రపంచకప్ జట్టులో కీలక సభ్యుడు కూడా. పాకిస్థాన్ తరఫున ఇప్పటి వరకు 35 టెస్టులు ఆడిన అజ్మల్ 178 వికెట్లు తీశాడు. 111 వన్డేల్లో 183 వికెట్లు తీసి జట్టు బౌలింగ్‌కు పెద్ద దిక్కుగా మారాడు. అప్పీలు చేస్తాం: పీసీబీ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తామని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు. ‘పూర్తి విషయాలు మాకు ఇంకా తెలియవు. అయితే అజ్మల్‌కు మరో అవకాశం ఉంది. తన బౌలింగ్‌పై కసరత్తులు చేస్తే తాజా పరీక్షలు చేయాలని కోరుతాం. రెండు వారాల్లో దీనిపై అప్పీల్ చేస్తాం’ అని ఖాన్ పేర్కొన్నారు. మరోవైపు ఐసీసీ నిషేధం ఎదుర్కొంటున్న అజ్మల్‌కు తన సహచరుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించింది. ప్రపంచకప్‌లో ఆడతా: అజ్మల్ కరాచీ: ఐసీసీ నిషేధంపై పోరాడతానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అజ్మల్ అన్నాడు. దేశం తరఫున ప్రపంచకప్‌లో ఆడేందుకు ఎంత వరకైనా వెళ్తానన్నాడు. ‘బయోమెకానిక్ పరీక్ష నిరాశపర్చింది. అయితే దీన్ని అంత సులువుగా వదిలిపెట్టను. నిషేధం పెద్ద సమస్య కాదు. అవసరమైన చర్యలు తీసుకుంటా. మళ్లీ జట్టులోకి వస్తా. వీలైంతన తొందరగా పీసీబీ పెద్దలను కలిసి తదుపరి చర్యల గురించి ఆలోచిస్తా. వైద్య నివేదికలు వచ్చిన తర్వాత దీనిపై అప్పీలు చేస్తాం’ అని అజ్మల్ వెల్లడించాడు. -
పాకిస్థాన్ బౌలర్‌పై సస్పెన్షన్ వేటు
దుబాయ్: పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌పై వేటుపడింది. అజ్మల్ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేశాడని రుజువు చేయడంతో ఐసీసీ అతణ్ని సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ఐసీసీ పేర్కొంది. వన్డే ర్యాంకింగ్స్‌లో 36 ఏళ్ల అజ్మల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గత నెలలో శ్రీలంకతో టెస్టు మ్యాచ్ సందర్భంగా అజ్మల్ బౌలింగ్ శైలిఫై ఫిర్యాదులు రావడంతో ఐసీసీ విచారణకు ఆదేశించింది. ఐసీసీ నియమించిన విచారణ కమిటీ గత నెల 25న అజ్మల్ బౌలింగ్ శైలిని పరిశీలించింది. అతని బౌలింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో ఐసీసీ చర్యలు తీసుకుంది. కాగా ఐసీసీ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయాల్సిందిగా పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అజ్మల్ కు సలహా ఇచ్చాడు. -
రేపు అజ్మల్ బౌలింగ్ కు పరీక్ష
దుబాయ్ : పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బౌలింగ్ యాక్షన్ ను సోమవారం పరీక్షించనున్నారు. అజ్మల్ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేశాడంటూ ఫిర్యాదు అందడంతో అతని బౌలింగ్ యాక్షన్ ను ఐసీసీ రేపు పరిశీలించనుంది.శ్ రీలంకతో గాలెలో జరిగిన తొలి టెస్టులో అజ్మల్ బౌలింగ్ యాక్షన్ పై ఆరోపణలు వచ్చాయి. శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా పాక్ స్పిన్నర్ వేసిన చాలా బంతుల్నిసందేహాస్పదంగా పరిగణిస్తున్నట్టు మ్యాచ్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆనాటి మ్యాచ్ లో అతను వేసే దూస్రా బంతుల్నిఐసీసీ క్షుణ్ణంగా పరిశీలించనుంది. 2009 లో అజ్మల్ బౌలింగ్ శైలిపై సందేహాలు వచ్చిన సంగతి తెలిసిందే.