చెన్నై: పాకిస్తాన్ నిషేధిత స్పిన్నర్ సయీద్ అజ్మల్... ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు కనబడుతున్నాయి. జనవరి 24న చెన్నైలో జరిగిన బయోమెకానిక్ పరీక్షలో అతను అద్భుతమైన పురోగతి చూపించాడని టెస్టు నిర్వహించిన కోచ్‌లు పేర్కొన్నారు. ఐసీసీ నిపుణుల నుంచి క్లియరెన్స్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం అజ్మల్ పరీక్ష నివేదికను ఐసీసీ ప్రధాన కార్యాలయానికి పంపారు. బౌలింగ్ యాక్షన్ సరి చేసుకున్న తర్వాత 12 వేల బంతులు వేసిన అజ్మల్ రెండు దేశవాళీ మ్యాచ్‌లు కూడా ఆడాడు.
హఫీజ్ డుమ్మా
పాదం గాయంతో బాధపడుతున్న నిషేధిత బౌలర్ మహ్మద్ హఫీజ్... శుక్రవారం జరగాల్సిన ఐసీసీ అధికారిక బయోమెకానిక్ పరీక్షకు గైర్హాజరయ్యాడు. దీంతో మరో తేదీని ప్రకటించాలని పీసీబీ... ఐసీసీని కోరింది. అయితే ఈనెల 10న పరీక్ష నిర్వహించే అవకాశాలుండటంతో 15న భారత్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో అతను బౌలింగ్ చేయడంపై సందిగ్ధం నెలకొంది.
ప్రపంచకప్‌కు అజ్మల్!
Published Sat, Feb 7 2015 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM
Advertisement
Advertisement