
అజ్మల్ మళ్లీ వచ్చాడు
కరాచీ: సందేహాస్పాద బౌలింగ్ యాక్షన్ లో సస్పెన్షన్ కు గురైన పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు కల్పించారు. హరూన్ రషీద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టెస్టులు, వన్డేలు, టి20లకు వేర్వేరుగా టీమ్ ను ఎంపిక చేసింది.
మూడు ఫార్మెట్ ల్లోనూ అజ్మల్ స్థానం దక్కించుకున్నాడు. ఈ నెల 17 నుంచి బంగ్లాదేశ్ పర్యటన ప్రారంభమవుతుంది. బౌలింగ్ యాక్షన్ మార్పులు చేసుకోవడంతో ఐసీసీ అతడికి ప్రపంచకప్ కు ముందు లైన్ క్లియర్ అయింది.