బౌలింగ్ టెస్టుకు హాజరైన అజ్మల్ | Saeed Ajmal, Sohag Gazi Undergo Bowling Test in Chennai | Sakshi
Sakshi News home page

బౌలింగ్ టెస్టుకు హాజరైన అజ్మల్

Published Sun, Jan 25 2015 12:39 AM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM

బౌలింగ్ టెస్టుకు హాజరైన అజ్మల్ - Sakshi

బౌలింగ్ టెస్టుకు హాజరైన అజ్మల్

చెన్నై: పాకిస్తాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ శనివారం ఐసీసీ అధికారిక బౌలింగ్ పరీక్ష కోసం హాజరయ్యాడు. ఇక్కడి ఐసీసీ గుర్తింపు పొందిన లాబొరేటరీలో జరిగిన ఈ పరీక్షకు దుబాయ్ నుంచి ఇద్దరు సాంకేతిక నిపుణులు వచ్చారు. అజ్మల్‌తో పాటు బంగ్లాదేశ్ ఆఫ్ స్పిన్నర్ సొహాగ్ గజీ కూడా హాజరయ్యాడు. 10 రోజుల్లోగా ఫలితం రానుంది.
 
ముంబైపై రాంచీ గెలుపు
ముంబై: మిడిల్‌టన్ రెండు గోల్స్‌తో చెలరేగడంతో హాకీ ఇండియా లీగ్‌లో రాంచీ రేస్‌కు తొలి గెలుపు దక్కింది. మహీంద్రా స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ముంబైని 2-1 తేడాతో మట్టికరిపించింది.  మూడో క్వార్టర్‌లో ముంబైకి స్టార్ స్ట్రయికర్ టామ్ బూన్ గోల్‌తో 1-0 ఆధిక్యం అందించాడు. వెంటనే తేరుకున్న రాంచీ... మిడిల్‌టన్ చేసిన  గోల్స్‌తో విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement