పాకిస్థాన్ బౌలర్పై సస్పెన్షన్ వేటు | ICC suspends Ajmal for illegal action | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ బౌలర్పై సస్పెన్షన్ వేటు

Published Tue, Sep 9 2014 1:05 PM | Last Updated on Sat, Mar 23 2019 8:23 PM

పాకిస్థాన్ బౌలర్పై సస్పెన్షన్ వేటు - Sakshi

పాకిస్థాన్ బౌలర్పై సస్పెన్షన్ వేటు

దుబాయ్: పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్పై వేటుపడింది. అజ్మల్ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేశాడని రుజువు చేయడంతో ఐసీసీ అతణ్ని సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ఐసీసీ పేర్కొంది. వన్డే ర్యాంకింగ్స్లో  36 ఏళ్ల అజ్మల్ అగ్రస్థానంలో ఉన్నాడు.


గత నెలలో శ్రీలంకతో టెస్టు మ్యాచ్ సందర్భంగా అజ్మల్ బౌలింగ్ శైలిఫై ఫిర్యాదులు రావడంతో ఐసీసీ విచారణకు ఆదేశించింది. ఐసీసీ నియమించిన విచారణ కమిటీ గత నెల 25న అజ్మల్ బౌలింగ్ శైలిని పరిశీలించింది. అతని బౌలింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో ఐసీసీ చర్యలు తీసుకుంది. కాగా ఐసీసీ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయాల్సిందిగా పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అజ్మల్ కు సలహా ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement