
దుబాయ్: ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్ (106; 16 ఫోర్లు) శతకం బాదడంతో ఆస్ట్రేలియాతో ఆదివారం ప్రారంభమైన తొలి టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది. మరో ఓపెనర్ ఇమాముల్ హక్ (188 బంతుల్లో 76; 7 ఫోర్లు, 2 సిక్స్) అర్ధశతకంతో రాణించడంతో ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 3 వికెట్లకు 255 పరుగులు చేసింది.
రెండు సెషన్ల పైగా క్రీజులో నిలిచిన హఫీజ్, ఇమాముల్ తొలి వికెట్‌కు 205 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో పాటు రెండు ఓవర్లలో ఆట పూర్తవుతుందనగా ప్రధాన బ్యాట్స్‌మన్ అజహర్ అలీ (18) అవుటయ్యాడు. దీంతో ఆసీస్‌కు కొంత ఊరట దక్కింది. హరిస్ సొహైల్ (15 బ్యాటింగ్), అబ్బాస్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సిడిల్, నాథన్ లయన్, హోలాండ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.