Hafeez
-
మీడియా ఫోకస్ కోసమే ఈ డ్రామా
-
క్షతగాత్రులకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పరామర్శ
సాక్షి, కర్నూలు: వెల్దుర్తి మండలం మదార్‌పురం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. పవిత్రమైన అజ్మీర్ యాత్రకు వెళ్తుండగా ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, నలుగురు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు చిత్తూరు జిల్లా మదనపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో వాహనంలో 18 మంది ఉన్నారని, డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. -
ఢోలక్ ధడ్కన్
ఢోలక్.. దక్కన్ సంప్రదాయపు ధడ్కన్! ఒకప్పుడు హైదరబాదీ లోగిళ్లలో సందడి చేసిన ఈ ఢోలక్ హోరు తగ్గిందిప్పుడు.దావతులన్నీ డీజేలతో మారుమోగుతుంటే చిన్నబుచ్చుకొని మూలన పడింది ఢోలక్. అయినా అడపాదడపా ఆ దరువుతో తన పాటను వినిపిస్తోంది హఫీజా ఆపా. ఆమే ఇప్పుడు ఢోలక్ కే గీత్కి ధడ్కన్! మా నల్లకోడి పోయింది ఏం చేయమంటారు? ఆ కోడి కూర గురించి కలకంటూన్న మా అత్తగారు అంతలోకి అడగనే అడిగారు ‘ఈ పూట వంటేం వండుతున్నావ్ కోడలు పిల్లా?’ అంటూ! మా నల్లకోడి పోయింది ఏం చెప్పమంటారు? జొన్నరొట్టె.. గోంగూర’ అని చెప్పనా?’అంటూ ఓ కోడలు పిల్ల బాధపడుతోంది. ఫుల్లుగా మందుకొట్టి బజార్లో తూలుతుంటే పోలీసులు పట్టుకొని మత్తు వదలకొట్టిరి.. రాత్రంతా స్టేషన్లో గడిపి పొద్దున్నే ఇంటికెళ్లితే గిన్నెలు గంటెలు విసిరి పెళ్లాం స్వాగతం పలికే అంటూ ఓ తాగుబోతుగోడు వెళ్లబోసుకుంటున్నాడు.అలాగే ఓ పెళ్లికొడుకు పెళ్లికూతురిని పొగడడం, చుట్టుపక్కల వాళ్లు ఒకరి మీద ఒకరు విసుర్లు విసురుకోవడం ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇవి మాటలు కావు.. దక్కనీ సంగీతం. హైదరాబాద్‌కే ప్రత్యేకమైన ఉర్దూ జానపదాలు. జనసామాన్యంలో సింపుల్‌గా ఇవి ఢోలక్ కే గీత్‌గా స్థిరపడిపోయాయి. ఏ ఇంట్లో ఏ శుభకార్యమైనా ఢోలక్ కే గీత్తోనే ప్రారంభం కావాలని అనేంత అసామాన్య ఆదరణను సంపాదించాయి. అయితే.. ఇప్పుడు ఇవి వినిపించకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఢోలక్ కే గీత్ ఆలపిస్తున్న హఫీజా .. ఢోలక్ బజాయిస్తూ .. ఆ జనపదాలను ఆలపిస్తూ వాటి ప్రాణం నిలపాలని ప్రయత్నిస్తున్న చివరితరం కళాకారిణి. ఆమె గురించి.. హైదరాబాద్, యాకుత్‌పురాలో పుట్టిపెరిగిన హఫీజా చిన్నప్పుడే ఢోలక్ కే గీత్ పట్ల ఆకర్షితురాలైంది. ఆమెకు ఎనిమిదేళ్లున్నప్పుడు వాళ్లింటి దగ్గరున్న ఓ రిటైర్డ్ పోలీస్ ఈ ఢోలక్ కే గీత్ పాడేవాడు. రోజూ వాళ్లింటికి వెళ్లి ఆ పాటలను వినేది. క్రమంగా ఆ ఆసక్తి ఆ పాటలను నేర్చుకోవాలనే పట్టుదలగా మారింది. అది గమనించిన ఆ రిటైర్డ్ పోలీస్ ఆ దక్కనీ సంప్రదాయ సంగీతం నేర్పించాడు. డోలక్తో సహా. కూతురు ఆరాటం గమనించి హఫీజా తల్లిదండ్రులు మహ్మద్ వాహెద్ అలీ, లాల్‌బీ కూడా అభ్యంతరం చెప్పలేదు. ప్రోత్సహించారు. హఫీజాకు ఇద్దరు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు. ఢోలక్ కే గీత్ ఈమెకు వినిపించినంత ఇష్టంగా మిగిలిన నలుగురికీ వినిపించలేదు. అందుకే ఆ ఇంటి నుంచి హఫీజా ఒక్కతే గాయనిగా మారింది. తొలుత బంధువుల ఇళ్లల్లో శుభకార్యాలకు గీతాలను ఆలపించేది. తర్వాత్తర్వాత ఎవరు ఆహ్వానించినా ఢోలక్తో వెళ్లి ఆనందంగా పాటలు పాడి వచ్చేది. ‘ఇది ఒక కళ అని కూడా తెలియని వయసు అది. ఎవరు పాడమంటారా అని ఎదురుచేసేదాన్ని. పాడు అంటే చాలు ఢోలక్ మోగేది.. నా గొంతు పాడేది. శుభకార్యం జరుపుకుంటున్న ఇల్లుగల వాళ్లు డబ్బు చేతిలో పెడుతుంటే కొత్తలో చిత్రంగా అనిపించేది. కాని తర్వాత తర్వాత గర్వంగా ఉండేది నా ఖర్చులకు నేను సంపాదించుకుంటున్నానని. అక్షరం ముక్క రాని నాకు ఆ కళ అన్నం పెడుతోంది అమ్మలా అని అనుకునేదాన్ని. ఢోలక్.. గీత్ సబ్ బంద్ పధ్నాలుగు, పదిహేనేళ్ల వయసులో హఫీజాకు పెళ్లయింది కర్నూల్‌కు చెందిన మహ్మద్ అయాజ్ పాషాతో. పెళ్లయిన మర్నాడే హఫీజాతో చెప్పాడు అతను ‘ఢోలక్.. గీత్ సబ్ బంద్ ఈ ఇంట్లో’ అని. కష్టంగానే భర్త ఆజ్ఞను అమలు చేసింది ఆమె. ముగ్గురు పిల్లలు పుట్టారు. కర్నూలు కన్నా హైదరాబాదులోనే బతుకుదెరువు ఎక్కువని హఫీజా మళ్లీ తను పుట్టిన ఊరుకే చేరింది తన కుటుంబంతో. హైదరాబాద్‌లో ఏ మూల ఢోలక్ కే గీత్ వినిపించినా ప్రాణం కొట్టుకునేది. బలవంతంగా మనసును వేరే పనుల మీదకు మళ్లించుకునేది. అలా దాదాపు పదిహేనేళ్లు ఆ సంగీతానికి దూరంగా ఉంది హఫీజా. ఆ క్రమంలోనే అనారోగ్యంతో భర్త చనిపోవడంతో ఇల్లు నడపాల్సిన బాధ్యత ఆమె మీదే పడింది. కుటుంబ పోషణకు పనులు చేసుకుంటూనే మళ్లీ ఢోలక్‌ను పట్టుకుంది హఫీజా. అప్పటికే డీజేలు, ఆధునిక సంగీతహోరులో ఢోలక్ సవ్వడి సన్నబడుతూ వస్తోంది. కాని అరవైఏళ్ల కిందటి పాటలు, బాణీలతో హైదరాబాద్ ముంగిళ్లను మారుమోగిస్తూ పూర్వపు కళను తీసుకురావడం మొదలుపెట్టింది హఫీజా. ఇంతలోకే ఆమె జీవితంలో మరో రెండు విషాదాలు. తన ఇద్దరు కొడుకులూ చనిపోయారు. ఆ దుఃఖాన్నీ ఢోలక్ కే గీత్తోనే మరిపించుకునే ప్రయత్నం చేసింది. సైరాబాను, సుల్తానా అనే తనకు తెలిసిన ఇద్దరు మహిళలకు ఈ పాటలు నేర్పి ముగ్గురూ ఓ బృందంగా డోలక్ కే గీత్‌ను పాపులర్ చేసింది. హైదరాబాద్‌లోనే కాదు.. నిశ్చితార్థం, మెహందీ, పెళ్లి, పురుడు, బారసాల, బర్త్డేలతోపాటు ఈ ఢోలక్ కే గీత్‌కు సినిమా ఆడియో ఫంక్షన్స్ కూడా వేదిక అవుతున్నాయంటే ఆ దక్కనీ కళకున్న డిమాండ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి వింటే ఇట్టే పట్టేసే ఆమె అరవై ఏళ్ల కిందటి పాటలను అక్షరం పొల్లుపోకుండా పాడుతుంది. పెళ్లిళ్లలో వధూవరుల గుణగణాలను బట్టి అప్పటికప్పుడే ఆశువుగా పాటలను పాడేస్తుంది. ఇలా ఏ ఫంక్షన్ అయినా దానికి తగినట్టుగా ఆమె పాటలు కట్టి ఢోలక్‌ను బజాయించిన సందర్భాలెన్నో! ‘ఢోలక్ కే గీత్ మాతోనే ఆగిపోవద్దన్నదే నా ఆశ’ అంటుంది హఫీజా. ‘మా చిన్నప్పుడైతే బాగా ధనవంతులే ఈ గానా బజానా పెట్టేవారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా మమ్మల్ని పిలుస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు విదేశాల్లో ఉన్న హైదరాబాదీయులూ అక్కడ మా కచేరీలు పెట్టిస్తున్నారు. సంతోషమే కాని ఈ పాటలను నేర్చుకోవడానికి కొత్త తరం ఎవరూ ముందుకు రావట్లేదు. అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మాతో ఉన్న వాళ్లు కూడా ఏదో గొంతు కలుపుతారు కాని ఢోలక్ వాయించరు. నేర్చుకోలేదు. సమస్య ఎక్కడంటే దీన్ని డబ్బు సంపాదన మార్గంగా చూస్తున్నారు కాని కళగా చూడట్లేదు. ఇది నేర్చుకుంటే ఫాయిదా ఏంటీ అనుకుంటారు. కళ ఆత్మానందాన్నిస్తుంది. దానికి మించిన ఫాయిదా ఏం ఉంటది? ఈ విషయమే చెప్పి నేర్పించాలని చూస్తున్నాను కాని ఎవరూ ఇంట్రెస్ట్ చూపట్లేదు’ అని నిరాశపడుతోంది హఫీజా. -
హత్య.. ఆత్మహత్య..మధ్యలో మద్యం
మద్యం.. వారి విచక్షణను కోల్పోయేలా చేసింది.. మత్తులో ఉన్న వారు తామేం చేస్తున్నామో తెలుసుకోలేని స్థితికి వెళ్లిపోయారు.. ముందు..వెనుకా ఆలోచించలేదు.. కుటుంబం గురించి పట్టించుకోలేదు.. ఆవేశం కట్టలు తెంచుకుంది.. వారి చర్యలతో ప్రాణం గాలిలో కలిసిపోయింది. మద్యం మత్తులో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే.. మరొకరు హత్యచేశారు. నగరంలోని వేర్వేరు చోట్ల ఈ రెండు సంఘటనలు జరిగాయి. జగద్గిరిగుట్ట: పాత కక్షల నేపథ్యంలో హఫీజ్ (21) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. జగద్గిరిగుట్ట సీఐ గంగరెడ్డి తెలిపిన మేరకు.. గాజులరామారం డివిజన్ శ్రీరాంనగర్‌కు చెందిన అక్బర్(31) అటో డ్రైవర్. రంజాన్ పండగ అనంతరం విందు చేసుకోవాలని అదే ప్రాంతానికి చెందిన జావీద్(19) అన్నులు కలిసి మద్యం తాగుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన హఫీజ్ కారు మెకానిక్ వీరి వద్దకు వచ్చి నా సోదరుడు జావీద్తో ఎందుకు మద్యం తాగుతున్నావని అక్బర్‌తో గొడవకు దిగాడు. అనంతరం నలుగురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం అక్బర్ మరోసారి మద్యం కొనుగోలు చేసి తాగేందుకు వెళ్తున్నాడు. ఇది గమనించిన హఫీజ్ అక్బర్‌తో మరోమారు గొడవ పడటం ప్రారంభించాడు. గతంలో అక్బర్‌ను చంపుతానంటూ హఫీజ్ బెదిరించాడు. దీంతో తనను అంతమొందించెందుకే గొడవ పడుతున్నాడని భావించిన అక్బర్ హఫీజ్‌ను కిందపడేసి పక్కనే ఉన్న సిమెంటో ఇటుకతో తలపై మోదాడు. దీంతో తలకు తీవ్ర గాయమైన హాఫీజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతంరం అక్బర్ జగద్గిరిగుట్ట ఠాణాలో లొంగిపోయాడు. వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.(ఉద్యోగం పేరుతో వ్యభిచార రొంపిలోకి.. ) బ్లేడుతో చేయికోసుకొని ప్రాణం వదిలాడు దూద్‌బౌలి: మద్యం మత్తులో భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రమేశ్ కొత్వాల్ తెలిపిన మేరకు.. కాకినాడకు చెందిన సలీం (38) నగరంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నాడు.కొద్ది రోజులుగా భార్య కాకినాడ నుంచి ఫోన్ చేసి డబ్బు కోసం అడుగుతూ ఉండేది. లాక్డౌన్ నేపథ్యంలో సలీం వద్ద డబ్బులు లేకపోవడంతో భార్యతో తరచుగా గొడవ పడుతుండేవాడు. మద్యానికి బానిసైన సలీం.. ఇక డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్లో భార్యకు బెదిరించేవాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో విపరీతంగా మద్యం తాగిన సలీం ఫోన్లో భార్యతో గొడవ పడి అక్కడే ఉన్న బ్లేడ్‌తో ఎడమచేయిపై తీవ్రంగా గాయాలు చేసుకున్నాడు. రక్తస్రావం జరగడంతో అపస్మారకస్థితిలో చేరుకున్నాడు. బుధవారం ఉదయం 11 గంటల వరకు సలీం తలుపులు తెరవకపోవడంతో స్థానికులు తలుపులు తెరిచి చూడగా మృతి చెంది ఉన్నాడు. చార్మినార్ ఏసీపీ అంజయ్య, హుస్సేనీఆలం ఇన్స్పెక్టర్ రమేశ్ కొత్వాల్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు కాకినాడలో ఉండే భార్యకు సమాచారం అందించారు. -
అభినందించకుండా.. అసత్య ప్రచారమా?
కర్నూలు(సెంట్రల్): అసత్యాలు ప్రచారం చేయడంలో టీడీపీ నాయకులు ముందు వరుసలో ఉన్నారని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ధ్వజమెత్తారు. కరోనా వైరస్ కంటే ‘ఎల్లో’ బ్యాచ్ ప్రచారం చాలా ప్రమాదకారిగా మారిందన్నారు. కలెక్టరేట్లోని సమాచార భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదలు కొని గ్రామ/వార్డు వలంటీర్ వరకు కరోనా నివారణ కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తుంటే..ఎల్లో మీడియా సహకారంతో టీడీపీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. డయాబెటీస్ ఉన్న 80 ఏళ్ల వృద్ధుడిని రాయలసీమ క్వారంటైన్‌కు తీసుకెళితే.. గేటు దాటే సమయంలో కాలికి దెబ్బతగిలిందని, అక్కడ పనిచేసే నర్సు ప్రైమరీ చికిత్స చేస్తే అభినందించాల్సి పోయి..ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఎదుటే నర్సుతో ముస్లిం కాళ్లు పట్టించారని ప్రచారం చేసే టీడీపీ నాయకులకు బుద్ధి, జ్ఞానం లేదన్నారు. రాజస్థానీయులకు బియ్యం వేయిస్తా.. వ్యాపారం కోసం కర్నూలు వచ్చిన రాజస్థానీయులకు చౌకదుకాణాల ద్వారా రేషన్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ చెప్పారు. శుక్రవారం పలువురు రాజస్తానీయులు కలెక్టరేట్‌కు వచ్చిన ఎమ్మెల్యేను కలసి తమకు బియ్యం వేయడంలేదని ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు స్పందించారు. -
‘సీఎం జగన్ మా ఆశలను చిగురింపజేశారు’
సాక్షి, కర్నూలు: ‘ఏ సీఎం అయినా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు హామీలు ఇచ్చి మరిచిపోతారు. కానీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చి.. న్యాయ రాజధానిగా ప్రకటించిన తరువాత కర్నూలుకు వచ్చారు’ అని కర్నూలు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత హఫీజ్‌ఖాన్ పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో దశను సీఎం వైఎస్ జగన్ మంగళవారం కర్నూలులో లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. మూడో దశ వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని కర్నూలు నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉన్నారు. ఈ పథకం మూడో దశలో భాగంగా దాదాపు 56.88 లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించి తమ జిల్లా ప్రజల ఆశలను చిగురింపజేశారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని హఫీజ్ ఖాన్ స్పష్టంచేశారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన తర్వాత తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌కు జిల్లా ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. కాగా, రాష్ట్రంలో ఇదివరకెన్నడూ జరగని విధంగా తొలిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది అవ్వాతాతలకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో విడత కింద కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. చదవండి: అవ్వాతాతలకు వైఎస్సార్ కంటి వెలుగు నైపుణ్య కేంద్రాలతో పారిశ్రామిక ప్రగతి ఆయన పత్తిగింజని నమ్మించడానికి ఏ స్థాయికైనా..! -
వినూత్నం గా ‘థ్యాంక్యూ సీఎం జగన్ సర్’
సాక్షి, కర్నూలు: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో కర్నూలులో "థ్యాంక్యూ సీఎం జగన్ సర్" కార్యక్రమం నిర్వహించారు. ఏపీలోనే మొదటిసారిగా కర్నూలులో వినూత్నరీతిలో సచివాలయ ఉద్యోగులు, వార్డు వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. జగనన్న ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని ప్రమాణం చేశారు. ప్రభుత్వ పథకాలను అంతఃకరణ శుద్ధితో ప్రజలకు అందేలా పాటు పడతామని ప్రతిజ్ఞ బూనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. అవినీతి రహిత పాలన అందించడమే సీఎం వైఎస్ జగన్ ఆశయమని పేర్కొన్నారు. వార్డు వాలంటీర్లు, వార్డు సెక్రటరీలు జగనన్నకు రెండు కళ్లు లాంటివారని చెప్పారు. ప్రతి వార్డు పరిధిలో పార్టీలకు అతీతంగా బాధ్యతగా ప్రజలకు సేవలందించాలని హఫీజ్‌ఖాన్ సూచించారు. -
వైఎస్ జగన్ ప్రకటనపై ఎమ్మెల్యే హాఫీజ్‌ఖాన్ హర్షం
-
‘బాబుకు చెప్పినా పట్టించుకోలేదు’
-
‘బాబుకు చెప్పినా పట్టించుకోలేదు’
సాక్షి, తాడేపల్లి : ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలును అప్పట్లో తెలుగు ప్రజల కోసం వదులుకున్నామని వైఎస్సార్సీపీ కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ బుధవారం వెల్లడించారు. రాష్ట్ర విభజనానంతరం శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత ముఖ్యమంత్రి చంద్రబాబును ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు జ్యుడీషియల్ క్యాపిటల్ ప్రకటనతో రాయలసీమ ప్రజల కోరికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారన్నారు. కర్నూలును స్మార్ట్సిటీలాంటి ఎన్నో హామీలిచ్చి చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు రాయలసీమ వాళ్లను రౌడీలతో పోల్చుతూ అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి తక్కువ ధరల వద్ద టీడీపీ నేతలు నాలుగువేల ఎకరాలను కొన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులు రావచ్చు అని చెప్పారని, అలా రావాలని నేను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఎన్నో రాష్ట్రాల్లో రాజధాని ఒక దగ్గర, హైకోర్టు ఒక దగ్గర ఉన్నాయని గుర్తుచేశారు. -
మైనార్టీలకు అండగా ఉంటాం: అంజాద్ బాషా
సాక్షి, కర్నూలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షాన నిలుస్తుందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా భరోసా ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం, మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. బుధవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనార్టీలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముస్లింను డిప్యూటీ సీఎం చేశారన్నారు. గత ఎన్నికల్లో అయిదుగురు ముస్లింలకు టికెట్ ఇచ్చారని, హిందూపురంలో ఇక్బాల్ ఒడినా.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, హమారా సమావేశాల్లో మైనార్టీలపై దేశ ద్రోహం కేసు పెడితే సీఎం జగన్ వాటిని ఎత్తివేశారని గుర్తుచేశారు. అలాగే హజ్ యాత్రకు వెళ్లే హాజీలకు రూ.60 వేల రూపాయలు అందించేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. మౌజమ్‌లకు మార్చి 1 నుంచి రూ. 15 వేల గౌరవ వేతనం ఇ్వబోతున్నామని, వక్ఫ్ భూములు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఎన్నార్సీపై ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ముస్లింలకు అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఏ అన్యాయం జరిగినా తాము వ్యతిరేకిస్తామని, పోరాటంలో ముందుంటామని పేర్కొన్నారు. దీనిపై రాజ్యసభ, లోక్‌సభలోనూ పోరాడుతామన్నారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఆంధ్రరాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కోరుకుంటారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు. ముస్లిం సోదరుల ఆందోళనలు సీఎం దృష్టికి తీసుకెళ్లామని, ఏ ఒక్క ముస్లిం, మైనార్టీలకు ఇబ్బంది కలిగినా తాము ముందుంటామన్నారు. గతంలో వైఎస్సార్ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా గుర్తు చేశారు. ఈ బిల్లు ఏపీ రాష్ట్రానికి వర్తించదని, వైఎస్సార్ సీపీ మైనార్టీలకు అండగా ఉంటుందని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలిపారు. -
40 ఇయర్స్ ఇండస్ట్రీ కదా... నేర్చుకుందామంటే..
సాక్షి, అమరావతి : ఆధునిక సమాజంలో ఆంగ్ల విద్య ఎంతో అవసరమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం శుభపరిణామం అని ఆయన పేర్కొన్నారు. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ-2019 బిల్లుపై గురువారం సభలో చర్చ సందర్భంగా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రజలకు ఏది కావాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదే చేస్తున్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్ మీద పట్టు ఉంటే కాన్ఫిడెంట్ లెవల్ పెరుగుతుంది. వాళ్లు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా రాణించగలుగుతారు. ఇంగ్లీష్ మీడియంపై మాట్లాడేందుకు చంద్రబాబుకు పాయింటే లేదు. ఆయన అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం సరైన నిర్ణయం. తెలుగు, ఉర్ధూకు సముచిత స్థానం ఇస్తూ ఇంగ్లీష్ మీడియంను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏ మంచి పని చేసినా దాన్ని ప్రతిపక్ష సభ్యులు వక్రీకరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ కదా...నేర్చుకుందామంటే.. చంద్రబాబుకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది కాబట్టి, ఆయన సభలో ఏం మాట్లాడతారో అని ఎంతో ఎదురు చూశాం. చంద్రబాబు మాట్లాడుతూంటే ఏదైనా మాలాంటి కొత్త ఎమ్మెల్యేలు నేర్చుకోవాలనుకుంటాం. ఆయన కన్నా మేమే బెటర్ అనుకుంటున్నాను. కానీ జిలేబీ మాదిరి అక్కడక్కడే చుట్టి ఏమీ చెప్పరు. పాయింట్ మీద మాట్లాడరు. సూటిగా రెండు నిమిషాలు మాట్లాడ ముగిస్తారమే అనుకుంటే చాలా సమయాన్ని తీసుకుంటున్నారు. పాయింట్ మాత్రం చెప్పరు. మేము కూడా సభలో మాట్లాడాలి కదా. అయితే చంద్రబాబు మాట్లాడేందుకు పాయింటే లేదు. ప్రతి బాల్‌కు జగన్ సిక్సర్ కొడుతూంటే బాబుకు దిక్కుతెలియడం లేదు. గల్ఫ్ దేశాల్లో ఇంగ్లీష్ రాకపోవడం వల్ల చాలా అవమానాలు ఎదురవుతున్నాయి. అదే ఆంగ్ల మాధ్యమంలో చదివితే వాళ్లిచ్చే మర్యాదే వేరు. సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన స్కూళ్లలో వాటర్ బెల్ కాన్సెప్ట్ చూసి నా నియోజకవర్గంలో అమలు చేశాం. మంచి స్పందన వచ్చింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకు వెళితే రాష్ట్రవ్యాప్తంగా అమలు అవుతుందా అనేది నాకు కొద్దిగా అనుమానం కలిగింది. అయితే సీఎం జగన్‌తో పాటు విద్యాశాఖ మంత్రికి దృష్టికి తీసుకువెళ్లడం... వెంటనే అన్ని పాఠశాలల్లో వాటర్ బెల్‌ను అమలు చేస్తూ జీవో జారీ చేశారు. దీన్ని బట్టి చూస్తే మంచి అనేది ఎక్కడ నుంచి అయినా తీసుకుని అమలు చేస్తారనేదానికి ఇది ఉదాహరణ. ఇలాంటివన్నీ చూస్తుంటే టార్చ్ బేరర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పడానికి గర్వపడుతున్నా. ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా పని చేయడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. -
సుంకేశుల డ్యాంను పరిశీలించిన ఎమ్మెల్యే
-
సుదీర్ఘ రాజకీయ చరిత్ర.. విజేత ఒక్కరే!
సాక్షి,కర్నూలు (ఓల్డ్‌సిటీ): నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఆ వంశంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి శాసనసభ్యుడిగా గెలుపొందిన వ్యక్తి హఫీజ్ ఖాన్ ఒక్కరే. కొడుకు పుట్టినప్పుడు కాకుండా, తండ్రికి మంచి పేరు తెచ్చినప్పుడే నిజమైన పుత్రోత్సాహం కలుగుతుందనే నానుడి వాస్తవ రూపం దాల్చింది. శాసన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం అమరావతిలో జరిగింది. ఇందులో భాగంగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో తండ్రి అబ్దుల్ మోయీజ్ ఖాన్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆయన కుమారున్ని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. హఫీజ్ ఖాన్ వంశానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. మేనమామ బి.షంషీర్‌ఖాన్ 1967లో కేఈ మాదన్నపై ఇండిపెండెంట్‌గా పోటీచేసి కేవలం రెండువేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అలాగే 1978లో జనతా పార్టీ తరఫున బలమైన అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో కాంగ్రెస్ హవా కొనసాగడం వల్ల ఆ పార్టీ తరఫున ఓ సాధారణ అభ్యర్థి అయిన ఇబ్రహీంఖాన్ గెలుపొందారు. హఫీజ్‌ఖాన్ తండ్రి మోయీజ్ ఖాన్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వీరి వంశానికి ఇంతటి రాజకీయ చరిత్ర ఉన్నా, గతంలో ఏ ఒక్కరూ ప్రత్యక్ష రాజకీయాల్లో విజయం సాధించలేదు. మొట్టమొదటి సారిగా హఫీజ్‌ఖాన్ గెలిచి రికార్డు సృష్టించారు. -
ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
-
బాబు మోసాలను ప్రజలకు తెలియజేయండి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని వైఎస్సార్సీపీ నందికొట్కూరు, కర్నూలు ఇన్చార్జులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, హఫీజ్‌ఖాన్, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు సూచించారు. ఎస్ఎఫ్ఐ నందికొట్కూరు డివిజన్ అధ్యక్షుడు దిలీప్‌తో పాటు నందికొట్కూరు, కర్నూలు నియోజకవర్గాలకు చెందిన 200 మంది విద్యార్థులు శనివారం వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. ఈసందర్భంగా సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు విద్యార్థి, యువతను మోసం చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారంటే యువతకు ఇస్తున్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ విజయం కోసం పనిచేయాలన్నారు. అందులోభాగంగా చంద్రబాబు మోసాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలన్నారు. హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి యువత అండగా నిలవాలన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టే నవరత్నాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. సలాంబాబు మాట్లాడుతూ.. నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రత్యేక హోదా డిమాండ్‌ను సజీవంగా ఉంచిన జగన్మోహన్రెడ్డి వెంట యువత నడిచేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ అదనపు రాష్ట్ర కార్యదర్శులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, చెరకుచెర్ల రఘురామయ్య, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, కర్నూలు, నంద్యాల విద్యార్థి విభాగాల జిల్లా అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు, సాయిరామ్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి అనుమంతరెడ్డి, రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు ప్రశాంత్, నాయకులు నవీన్, వై.రాజశేఖరరెడ్డి, యశశ్వని పాల్గొన్నారు. -
ఎదురులేని పాక్
దుబాయ్: అంతర్జాతీయ టి20ల్లో పాకిస్తాన్ తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడు టి20ల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. ఈ ఫార్మాట్లో పాక్‌కు ఇది వరుసగా 11 సిరీస్ విజయం. మున్రో (28 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అండర్సన్ (25 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో... తొలుత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షాహిన్ ఆఫ్రిదికి 3 వికెట్లు దక్కాయి. అనంతరం బాబర్ ఆజమ్ (40; 4 ఫోర్లు), ఆసిఫ్ అలీ (38; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మొహమ్మద్ హఫీజ్ (34 నాటౌట్; 1 ఫోర్ 2 సిక్స్‌లు) ఆకట్టుకోవడంతో పాకిస్తాన్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. -
హఫీజ్ శతకం: పాక్ 255/3
దుబాయ్: ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్ (106; 16 ఫోర్లు) శతకం బాదడంతో ఆస్ట్రేలియాతో ఆదివారం ప్రారంభమైన తొలి టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది. మరో ఓపెనర్ ఇమాముల్ హక్ (188 బంతుల్లో 76; 7 ఫోర్లు, 2 సిక్స్) అర్ధశతకంతో రాణించడంతో ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 3 వికెట్లకు 255 పరుగులు చేసింది. రెండు సెషన్ల పైగా క్రీజులో నిలిచిన హఫీజ్, ఇమాముల్ తొలి వికెట్‌కు 205 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో పాటు రెండు ఓవర్లలో ఆట పూర్తవుతుందనగా ప్రధాన బ్యాట్స్‌మన్ అజహర్ అలీ (18) అవుటయ్యాడు. దీంతో ఆసీస్‌కు కొంత ఊరట దక్కింది. హరిస్ సొహైల్ (15 బ్యాటింగ్), అబ్బాస్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సిడిల్, నాథన్ లయన్, హోలాండ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. -
హఫీజ్‌కు మళ్లీ ఐసీసీ క్లియరెన్స్
దుబాయ్: పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌కు మరోసారి ఐసీసీ ఆమోదం లభించింది. గత అక్టోబరులో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో అంపైర్లు అతని బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉందని నివేదిక ఇవ్వడంతో ఐసీసీ నిషేధం విధించింది. అనంతరం తన యాక్షన్‌ను సరిదిద్దుకొని రెండు వారాల అతను పరీక్షకు హాజరయ్యాడు. తాజా యాక్షన్‌ను సరైనదిగా గుర్తించి అతను ఆఫ్‌స్పిన్ బౌలింగ్ వేసేం దుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. హఫీజ్ కెరీర్లో ఇలా జరగడం ఇది మూడోసారి. -
చిన్నారిపై వేడినీళ్లు పోసిన మహిళ
ఖమ్మం క్రైం: ఖమ్మం నగరంలో ఓ చిన్నారిపై పొరుగింటి మహిళ వేడినీళ్లు పోసిన దారుణ సంఘటన చోటు చేసుకుంది. తుమ్మలగడ్డ ప్రాంతానికి చెందిన ఆసిఫ్ చికెన్ దుకాణంలో పనిచేస్తూ భార్య షమీమ్, కుమారుడు హఫీజ్ (5)తో కలసి జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి హఫీజ్ తమ ఇంటి పక్కనే ఉన్న బంధువు అయిన నసీమా అనే మహిళ ఇంట్లో ఆమె కూతురితో కలసి ఆడుకోవడానికి వెళ్లాడు. గంట తర్వాత నసీమా వచ్చి ‘మీ అబ్బాయి ఆడుకుంటుండగా..స్టౌ మీద ఉన్న వేడినీటి గిన్నె మీద పడింది..’అని చెప్పింది. బాలుడి తల్లి షమీమ్ వెళ్లిచూడగా అప్పటికే హఫీజ్ వీపు కాలి, స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. సోమవారం రాత్రి స్పృహలోకి వచ్చిన బాలుడు తన మీద నసీమా వేడినీళ్లు పోసిందని, వద్దని ఏడుస్తున్నా బలవంతగా పట్టుకొని పోసిందని చెప్పగా బాలుడి తల్లిదండ్రులు దీనిపై నసీమాను నిలదీశారు. ఆమె వాగ్వాదానికి దిగడంతో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కువచ్చి సీఐ రమేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై సురేశ్‌కుమార్ కేసు దర్యాప్తు చేపట్టారు. -
యూట్యూబ్‌లో పాఠాలు..లక్షల్లో ఆదాయం
పెద్దపల్లి(యైటింక్లయిన్‌కాలనీ): సోషల్‌మీడియాలో గంటలకొద్దీ సమయం వెచ్చిస్తూ యువత కాలాన్ని వృథా చేస్తుంటే..హఫీజ్ మాత్రం అదే సోషల్‌మీడియా వేదికగా ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కంప్యూటర్ కోర్సులు, మొబైల్ ప్రాబ్లమ్స్‌పై వీడియోలు రూపొందించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ ప్రతి నెల రూ.1.50లక్షల ఆదాయం పొందుతున్నాడు. యూట్యూబ్‌లో హఫీజ్ నిర్వహిస్తున్న తెలుగు టెక్ ట్యూట్స్కు 4కోట్ల వ్యూస్..4.30లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2006లో ప్రారంభం రామగుండం మండలం యైటింక్లయిన్‌కాలనీలో కం ప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్ నిర్వహిస్తున్న ఎస్డీ హఫీజ్ 2006లో యూట్యూబ్‌లో తన తొలి పాఠాన్ని అప్లోడ్ చేశారు. టెక్నాలజీతో జరుగుతున్న మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు పాఠాలను వీడియోలుగా రూపొందించి అప్లోడ్ చేయడం ప్రారంభించారు. 10వేలమంది వ్యూస్‌తో ప్రారంభమైన ‘తెలుగు టెక్ ట్యూబ్స్’ 4కోట్ల వ్యూస్‌కు చేరుకుంది. కంప్యూటర్ సెంటర్ నిర్వహిస్తూనే ఎంఎస్ ఆఫీస్, సీలాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలో యూట్యూబ్‌లో వివరించారు. ఆ సమయంలో ఇంటర్నెట్ వినియోగం పెద్దగా లేకపోవడంతో స్పందన కూడా అంతంతే ఉండేది. కాలక్రమంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో హఫీజ్ అప్లోడ్ చేస్తున్న వీడియోలకు ప్రేక్షకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2014 తర్వాత స్మార్ట్ఫోన్ల వినియో గం పెరగడంతో వ్యూస్, ఫాలోవర్స్ పెరిగారు. ఎస్ఈవో, ఆటోకాడ్, టాలీ, జావా, వెబ్‌డిజైనింగ్ కోర్సులను తెలుగువారి కోసం యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. మొబైల్ సీక్రెట్స్కు స్పందన స్మార్ట్ఫోన్లు ఎలా వినియోగించాలి, సీక్రెట్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి..అనే అంశాలపై తెలుగులో అర్థమయ్యేలా వీడియోలు రూపొందించి తెలుగు టెక్ ట్యూట్స్ ద్వారా అందిస్తున్నారు. ఇటీవల హఫీజ్ టెక్నికల్ వివరణకు మంచి స్పందన లభిస్తోంది. ఇలా ఒక్క సీక్రెట్ సెట్టింగ్స్ వీడియో అప్‌లోడ్‌కు 12లక్షల వ్యూస్ వచ్చాయి. హఫీజ్ అడ్రస్ తెలుసుకుని విజయవాడ, వైజాగ్ ప్రాంతాల నుంచి చాలా మంది యువకులు టెక్నాలజీ నేర్పించాలని యైటింక్లయిన్‌కాలనీకి వస్తున్నారు. హఫీజ్ తయారు చేసిన మొబైల్ సీక్రెట్స్ సిల్వర్ ప్లే బటన్ అవార్డు యూట్యూబ్‌లో హఫీజ్ వీడియోలకు లక్షకుపైగా వ్యూస్ పెరగడంతో ఆ సంస్థ సిల్వర్ ప్లేబటన్ అవార్డును ప్రకటించింది. ఈమేరకు పోస్టు ద్వారా అవార్డు, ప్రశంసాపత్రంను సైతం పంపించింది. గోల్డెన్ ప్లేబటన్ సాధించడమే తన లక్ష్యమంటున్నారు హఫీజ్. ప్రతినెల రూ.1.50లక్షలు ఆదాయం యూట్యూబ్ ద్వారా తెలుగుటెక్ ట్యూట్ పేరుతో అప్లోడ్ చేస్తున్న వీడియోలకు ఆదరణ పెరగడంతో ఆసంస్థ ప్రతినెలా రూ.1.50లక్షలను హఫీజ్ ఖాతాల్లో వేస్తోంది. అయితే హఫీజ్ వీడియోలను ఇతరులు కాపీ చేసి తమ సైట్లలో అప్లోడ్ చేస్తుండడంతో వ్యూస్ తగ్గి ఆదాయం కూడా రూ.లక్షకు తగ్గిందని తెలిపారు. ఇటీవల విజయవాడలో జరిగిన సదస్సులో రెండు రాష్ట్రాల్లో అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తిగా నిలిచారు. చైతన్య పర్చడమే లక్ష్యం మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలు సైతం మొబైల్ ద్వారా చేస్తున్నారు. అదనుగా చూస్తున్న హ్యాకర్స్ ఖాతాలను హ్యాక్ చేస్తూ రూ.కోట్ల కొద్ది సొమ్ము దోచుకుంటున్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నదే నా ఉద్దేశ్యం. అందుకే టెక్‌ట్యూట్స్ పేరిట సైట్ ప్రారంభించాను. అన్ని కోర్సులు యూట్యూబ్‌లో అప్లోడ్ చేయాలన్నది లక్ష్యం. నిరుపేదలు యూట్యూబ్ ద్వారా సంపాదించేలా వారిని చైతన్యవంతం చేసేందుకు ఉచితంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తా. – ఎస్డీ హఫీజ్, ఎంఏ ఇంగ్లిష్ -
హఫీజ్‌పై మళ్లీ నిషేధం
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్ అనుమానాస్పద బౌలింగ్ శైలితో మరోసారి బౌలింగ్‌కు దూరమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయడానికి అతడిని ఐసీసీ అనర్హుడిగా ప్రకటించింది. ఇటీవల అబుదాబి వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు సందేహం వ్యక్తం చేశారు. హఫీజ్ ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌పై నిషేధం విధించడం ఇది మూడోసారి . 2014 డిసెంబర్లో తొలిసారి ఐదు నెలల నిషేధం ఎదుర్కొన్న హఫీజ్ తర్వాత 2015 జూన్‌లో వివాదాస్పద బౌలింగ్ యాక్షన్‌తో నిషేధం కారణంగా 12 నెలల పాటు బౌలింగ్ చేయలేదు. -
12 ఏళ్ల అనంతరం..
మెల్బోర్న్: సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. హఫీజ్ (72; 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో... ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఆసీస్‌పై పాక్ జట్టు ఆరు వికెట్ల తేడాతో పాక్ నెగ్గింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. 2005 అనంతరం ఆస్ట్రేలియాలో ఏ ఫార్మాట్లోనైనా పాక్ గెలవడం ఇదే తొలిసారి. ముందుగా ఆసీస్ 48.2 ఓవర్లలో 220 పరుగులు చేసింది. స్మిత్ (60; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆమిర్‌కు మూడు, జునైద్.. ఇమాద్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం పాక్ 47.4 ఓవర్లలో 221 పరుగులు చేసి గెలిచింది. షోయబ్ మాలిక్ (52 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. స్టార్క్, ఫాల్క్‌నర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. -
‘ప్రాక్టీస్’లో నెగ్గిన పాకిస్తాన్
రాణించిన హఫీజ్ కోల్‌కతా: బౌలింగ్‌లో రాణించిన పాకిస్తాన్... టి20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో విజయం సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. హఫీజ్ (49 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు. సర్ఫరాజ్ అహ్మద్ (13)తో మూడో వికెట్‌కు 39; ఉమర్ అక్మల్‌తో నాలుగో వికెట్‌కు 53 పరుగులు జత చేశాడు. కెప్టెన్ ఆఫ్రిది (0) తొలి బంతికే డకౌటయ్యాడు. తిసారా పెరీరా 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన లంకను లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇమద్ వసీమ్ (4/25) వణికించాడు. దీంతో లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్‌కు మరో విజయం ముంబై: టి20 ప్రపంచకప్ సన్నాహల్లో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్‌లను ఇంగ్లండ్ విజయాలతో ముగించింది. తొలి వార్మప్‌లో పటిష్ట న్యూజిలాండ్‌ను దెబ్బతీయగా... తాజాగా సోమవారం స్థానిక బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై క్రికెట్ సంఘం ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ 14 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 177 పరుగులు చేసింది. జో రూట్ (34 బంతుల్లో 48; 3 ఫోర్లు; 2 సిక్సర్లు), అలెక్స్ హేల్స్ (23 బంతుల్లో 37; 7 ఫోర్లు) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన ఎంసీఏ ఎలెవన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 136 పరుగులు చేసింది. ఓపెనర్ జే బిస్టా (37 బంతుల్లో 51; 5 ఫోర్లు; 2 సిక్సర్లు), జేమ్స్ విన్స్ (38 బంతుల్లో 45; 4 ఫోర్లు; 1 సిక్స్) ఆకట్టుకున్నారు. -
చూపున్న వేళ్లు
కంటిచూపు పోతే సర్వం పోయినట్లే అనుకుంటాం. కానీ చూపే సర్వస్వం కాదని హఫీజ్‌ని చూస్తే అర్థమౌతుంది! తన స్కిల్‌ని, విల్ పవర్‌ని కలిపి... వేళ్లను ఒత్తులుగా చేసుకుని జీవితాన్ని వెలిగించుకుంటున్న ఈ మెకానిక్... ఆ వెలుగులోనే పదేళ్లుగా తన బతుకుబండిని లాక్కొస్తున్నాడు. ఒక్క మాటలో... హఫీజ్ తన వేళ్లపై తను నిలబడ్డాడు. హఫీజ్ స్వస్థలం వరంగల్ జిల్లా కాశీబుగ్గ. ఇంటికి పెద్ద కుమారుడు. ఇద్దరు తమ్ముళ్లు. తండ్రి అఫ్జల్ వాచ్‌మన్‌గా పనిచేసేవారు. హఫీజ్ పదోతరగతి వరకు స్థానిక పాఠశాలలోనే చదువుకున్నాడు. ఆ తర్వాత కుటుంబ పరిస్థితి అతడిని పై చదువులు చదవనివ్వలేదు. తండ్రికి ఆసరాగా ఉండవచ్చని దగ్గర్లోని ఆటోనగర్‌లో వాహనాల మెకానిక్‌గా చేరాడు. లారీ మెకానిక్‌గా మంచి పేరు సంపాదించాడు. అప్పుడే నజీమాతో పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు. అఫ్సానా, ముజామిల్. వచ్చిన సంపాదనతోనే భార్య బిడ్డలను, తల్లిదండ్రులను పోషించుకునేవాడు. అలా సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలో ఒక్కసారిగా ఊహించని మలుపు! దాన్నెప్పటికీ మరిచిపోలేడు హఫీస్. ‘‘2003లో ఆటోనగర్ నుంచి విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడితో అయిపోలేదు. ఆసుపత్రిలో చికిత్స వికటించి ఒక కన్ను చూపు కోల్పోయింది. అయితే, ఈ సంగతి చుట్టుపక్కల వారికే కాదు మా ఇంట్లో వారికీ తెలియనివ్వలేదు. బాధపడతారనేది ఒక కారణమైతే, ఒంటి కన్నుతో డ్రైవింగ్ ఎలా చేస్తున్నావ్ అని అడుగుతారనీ, మెకానిక్ పనులు తగ్గిపోతాయేమోననీ చెప్పలేదు. అలాగే పనులు చేసుకుంటూ వస్తుంటే.. 2005లో మళ్లీ ఓ ప్రమాదం. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో బాణాసంచా పేలుస్తున్నాం. ఆ సమయంలో టపాసులు పేలి నేరుగా కళ్లలోకి దూసుకెళ్లాయి. ఆ ప్రమాదంలో... ఉన్న రెండో కన్నూ పొగొట్టుకున్నాను’’ అని నాటి సంఘటనల విషాదాన్ని వివరించారు హఫీజ్! దిక్కుతోచలేదు ‘‘చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులే కాదు, పట్నం ఆసుపత్రుల్లోనూ చూపించారు మా వాళ్లు. మెకానిక్ పనులు చేసి కూడబెట్టిన రూపాయి రూపాయి ఆసుపత్రులకు తిరగడానికే ఖర్చయ్యిందే తప్ప ప్రయోజనం లేకపోయింది. చూపు లేకపోవడంతో ఎవరి సాయమూ లేకుండా అడుగు కూడా వేయలేకపోయేవాడిని. ఇక పనులేం చేయగలను! రోజులు నెలల్లోకి మారుతున్నాయి. ఎవరో ఒకరి ఆసరా లేనిదే అడుగు బయట పెట్టలేని స్థితి. ఫీజులు కట్టలేక పిల్లల చదువులు ఆగిపోయాయి. ఆరునెలలు దిక్కు తోచని స్థితిలోనే ఉన్నాను. పూట గడవడమే కష్టంగా మారింది. నా భార్య బీడీలు చుట్టి, కుటుంబానికి ఆసరా అయ్యింది. ఇప్పటికీ బీడీలు చుడుతూనే ఉంది. వాచ్మెన్ పనిని వదిలేసిన నా తండ్రి తిరిగి వాచ్‌మన్‌గా కొనసాగాల్సి వచ్చింది. తెలిసినవారు, దయార్ద్రహృదయులు నా పరిస్థితికి జాలి పడి సాయమందించారు’’ అంటూ చూపు కోల్పోయిన తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాలను, చేయూతనందించిన వ్యక్తులను గుర్తుచేసుకున్నారు హఫీజ్! వేరే దారీ లేదు అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు కలలు లక్ష్యాలవైపుగా దూసుకెళుతుంటాయి. అవాంతరం ఎదురైనప్పుడు అవన్నీ కల్లలౌతాయి. కానీ హఫీజ్ తన కాళ్లపై తను నిలబడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.‘‘స్నేహితుల దగ్గర కొంత డబ్బు అప్పు తెచ్చి, ఒక ఆటో కొన్నాను. దాన్ని అద్దెకిచ్చి, వచ్చిన డబ్బుతో గడపవచ్చని ఆశ. అలా కొన్ని నెలలు గడిపాను. ఆటో రిపేర్‌కు వచ్చినప్పుడల్లా నాకు తెలిసిన మెకానిక్ పనితోనే దానిని బాగు చేసేవాడిని. నేను చేస్తున్న పని చూసినవాళ్లు, తెలిసినవారు తమ వాహనాలను తీసుకొచ్చి బాగుచేయమనేవారు. వేళ్లతోనూ, చేతులతోనూ తడిమి, ఆ వాహనానికి ఎక్కడ సమస్య ఉందో గుర్తించేవాడిని. అలా ఎవరు వాహనం తీసుకొచ్చినా బాగుచేయడం, అలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోవడం.. ఏదో తెలియని కొత్త శక్తి నాలో వచ్చి చేరినట్టు అనిపించింది. తెలిసిన విద్యే కదా. వేళ్లకు చూపు తెచ్చుకుంటే చాలు బతుకుబండి నడిచిపోతుంది అనిపించింది. అలా కాశీబుగ్గలో మా ఇంటి దగ్గరే మెకానిక్‌గా వాహనాలకు మరమ్మతు చేయడం మొదలుపెట్టాను. పదేళ్లుగా ఇదే పని. కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. పిల్లలను చదివించుకోగలుగుతున్నాను. ఇప్పుడు కొడుకు ఏడవ తరగతి, కూతురు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. నాలుగు ఆటోలు సమకూరితే, వాటిని అద్దెకిచ్చి, ఈ మెకానిక్ పనిచేస్తూ పిల్లల్ని బాగా చదివించుకోవాలని ఆశ, కల. స్థోమత లేక నాలాగే వారి చదువులూ ఆగిపోతాయేమో అనే భయం తప్ప మరో ఆలోచన లేదు’’ అని చెప్పారు హఫీజ్. కష్టాలు వస్తే కుంగిపోయి జీవితంలో వెనకంజ వేయడం సరికాదని చెప్పే హఫీజ్... భవిష్యత్తు కోసం కలలు కనాలంటే కంటిచూపు మీదే ఆధారపడనక్కర్లేదని కూడా నిరూపిస్తున్నారు. విధి పరీక్షలో నెగ్గి చూపున్నవారికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎవరి సాయమూ తీసుకోడు నేను ఆటో డ్రైవర్ని. ఐదేళ్లుగా హఫీజ్ నాకు తెలుసు. ఆటోలకు, ద్విచక్రవాహనాలకు ఏ సమస్య వచ్చినా మా కంటే బాగా వేళ్లతో చెక్ చేసి చెప్పేస్తాడు. వెంటనే మరమ్మతు చేస్తాడు. అందుకు ఎవరి సాయమూ తీసుకోడు. చూపు లేకపోయినా చూపున్నవారితో సమానంగా చేసే హఫీజ్ పని విధానం చూసి మేమంతా ఆశ్చర్యపోతుంటాం. - మోహన్, ఆటో డ్రైవర్ పాఠకులకు గమనిక పేరుకు ఇది ‘మిణుగురులు’ శీర్షికే అయినా, ఇందులో వచ్చే వ్యక్తుల ఆదర్శవంతమైన జీవితాలు సమాజానికి దివిటీల వంటివి. చీకటిని తిడుతూ కూర్చోక, హఫీజ్లా చిరుదివ్వెలు వెలిగించుకున్న వారెవరైనా మీకు తారసపడితే వారి వివరాలు మాకు తెలియజేయండి. అంధులలో స్ఫూర్తి నింపడానికి మీ వంతు కర్తవ్యంగా ముందుకు రండి. మా చిరునామా మిణుగురులు, ఫ్యామిలీ, సాక్షి దినపత్రిక, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34.