కర్నూలు(సెంట్రల్): అసత్యాలు ప్రచారం చేయడంలో టీడీపీ నాయకులు ముందు వరుసలో ఉన్నారని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ధ్వజమెత్తారు. కరోనా వైరస్ కంటే ‘ఎల్లో’ బ్యాచ్ ప్రచారం చాలా ప్రమాదకారిగా మారిందన్నారు. కలెక్టరేట్‌లోని సమాచార భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదలు కొని గ్రామ/వార్డు వలంటీర్ వరకు కరోనా నివారణ కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తుంటే..ఎల్లో మీడియా సహకారంతో టీడీపీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. డయాబెటీస్ ఉన్న 80 ఏళ్ల వృద్ధుడిని రాయలసీమ క్వారంటైన్‌కు తీసుకెళితే.. గేటు దాటే సమయంలో కాలికి దెబ్బతగిలిందని, అక్కడ పనిచేసే నర్సు ప్రైమరీ చికిత్స చేస్తే అభినందించాల్సి పోయి..ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఎదుటే నర్సుతో ముస్లిం కాళ్లు పట్టించారని ప్రచారం చేసే టీడీపీ నాయకులకు బుద్ధి, జ్ఞానం లేదన్నారు.
రాజస్థానీయులకు బియ్యం వేయిస్తా..
వ్యాపారం కోసం కర్నూలు వచ్చిన రాజస్థానీయులకు చౌకదుకాణాల ద్వారా రేషన్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ చెప్పారు. శుక్రవారం పలువురు రాజస్తానీయులు కలెక్టరేట్‌కు వచ్చిన ఎమ్మెల్యేను కలసి తమకు బియ్యం వేయడంలేదని ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment