ఎదురులేని పాక్‌ | Pakistan vs New Zealand :2nd T20 Pakistan clinch 11th T20 series | Sakshi
Sakshi News home page

ఎదురులేని పాక్‌

Published Sun, Nov 4 2018 2:32 AM | Last Updated on Sun, Nov 4 2018 2:32 AM

Pakistan vs New Zealand :2nd T20 Pakistan clinch 11th T20 series - Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ టి20ల్లో పాకిస్తాన్‌ తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడు టి20ల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. ఈ ఫార్మాట్‌లో పాక్‌కు ఇది వరుసగా 11 సిరీస్‌ విజయం. మున్రో (28 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అండర్సన్‌ (25 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో... తొలుత న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షాహిన్‌ ఆఫ్రిదికి 3 వికెట్లు దక్కాయి. అనంతరం బాబర్‌ ఆజమ్‌ (40; 4 ఫోర్లు), ఆసిఫ్‌ అలీ (38; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మొహమ్మద్‌ హఫీజ్‌ (34 నాటౌట్‌; 1 ఫోర్‌ 2 సిక్స్‌లు) ఆకట్టుకోవడంతో పాకిస్తాన్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement