25న చెన్నైకి హఫీజ్, అజ్మల్ | Pakistan spinners Ajmal and Hafeez to have bowling actions tested in India | Sakshi
Sakshi News home page

25న చెన్నైకి హఫీజ్, అజ్మల్

Published Wed, Dec 24 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

Pakistan spinners Ajmal and Hafeez to have bowling actions tested in India

కరాచీ: పాకిస్తాన్ ఆల్‌రౌండర్ హఫీజ్, స్పిన్నర్ అజ్మల్ తమ సందేహాస్పద బౌలింగ్ శైలిని పరీక్షించుకునేందుకు ఈనెల 25న చెన్నైకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది అధికారిక పరీక్షా లేక అనధికారికమా తేలాల్సి ఉందని పాక్ క్రికెట్ బోర్డు పాలకమండలి సభ్యుడు షకీల్ షేక్  చెప్పారు.
 
  ‘ఒకవేళ హఫీజ్ ఐసీసీ అధికారిక టెస్టు కోసం హాజరై విఫలమైతే మరో ఏడాది పాటు అంతర్జాతీయ బౌలింగ్ నుంచి నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో అతను ప్రపంచకప్‌లోనూ బౌలింగ్ వేయలేడు’ అని షకీల్ తెలిపారు. ఇటీవల కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో హఫీజ్ బౌలింగ్ శైలిపై అంపైర్లు ఫిర్యాదు చేయడంతో ఐసీసీ అతడిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement