Ajmal
-
జ్యోతిక శ్రీ బృందానికి స్వర్ణం..!
బ్యాంకాక్: ఆసియా రిలే అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో అజ్మల్, దండి జ్యోతిక శ్రీ, అమోజ్ జేకబ్, శుభాలతో కూడిన భారత బృందం మిక్స్డ్ రిలే 4్ఠ400 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం గెలిచింది. భారత బృందం 3 నిమిషాల 14.12 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది.ఈ క్రమంలో గత ఏడాది ఆసియా క్రీడల్లో 3 నిమిషాల 14.34 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డు తెరమరుగైంది. భారత్‌కు బంగారు పతకం దక్కడంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతిక శ్రీ కీలకపాత్ర పోషించింది. ఈ ప్రదర్శనతో భారత బృందం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 21వ స్థానానికి చేరుకుంది. జూన్ 30వ తేదీలోపు భారత బృందం టాప్–16లోకి చేరితే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది.ఇవి చదవండి: World Para Championships: శభాష్ దీప్తి.. -
వ్యూహం ఫిక్స్
‘వ్యూహం’ సినిమా విడుదలకు రూట్ క్లియర్ అయింది. ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానుంది. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తొలి భాగం గత ఏడాది నవంబరు 10న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చని సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వడంతో ఈ నెల 23న రిలీజ్ చేస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తర్వాత రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యూహాలు పన్నాయి? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వంటి కథాంశంతో ‘వ్యూహం’ రూపొందింది. ఈ చిత్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ నటించారు. -
స్నేహానికి వ్యాపారాన్ని ముడిపెట్టలేను
పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమర్ ప్రధాన పాత్రధారులుగా, నందితా శ్వేత, దివ్యా పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మంగళవారం’. అజయ్ భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్‌పై స్వాతీరెడ్డి గునుపాటి (వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె), ఎం. సురేష్ వర్మ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్రనిర్మాతలు మాట్లాడారు. స్వాతీరెడ్డి గునుపాటి మాట్లాడుతూ – ‘‘అజయ్ భూపతిగారు చెప్పిన ‘మంగళవారం’ కథ విని, ఈ సినిమా చేస్తే బాగుంటుందనిపించి చేశాను. ఓ సెన్సిటివ్ ఇష్యూని ఆయన సందేశాత్మకంగా చెప్పిన విధానం నాకు నచ్చింది. పాయల్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడింది. అజనీష్ మ్యూజిక్ బాగుంటుంది. ఇండస్ట్రీలో నాకు అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా అగ్రతారలతో పరిచయం ఉంది. నేను అడిగితే వారు నాతో సినిమాలు చేస్తారు. కానీ నిర్మాతగా ముందు నన్ను నేను నిరూపించుకోవాలి. వాళ్ల స్థాయికి తగ్గ సినిమాలను నిర్మించే అవకాశం ఉన్నప్పుడు వారితో నేను సినిమాలు చేస్తాను. ఎందుకంటే స్నేహాన్ని, వ్యాపారాన్ని ముడిపెట్టడం ఇష్టం లేదు’’ అన్నారు. మరో నిర్మాత సురేష్ వర్మ మాట్లాడుతూ– ‘‘మంగళవారం’ సినిమాలో లవ్, కామెడీ, యాక్షన్.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయి. ఈ సినిమా తొలి రోజు నుంచే అల్లు అర్జున్‌గారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక చిన్నతనం నుంచి చిరంజీవిగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన మా ట్రైలర్‌ను విడుదల చేయడం మర్చిపోలేని అనుభూతి’’ అన్నారు. -
నేను ఎవ్వరికి భయపడనని నీకు మట్టుకే తెలుసు: ఆర్జీవీ ట్వీట్ వైరల్!
అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం వ్యూహం. ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వ్యూహం చూసిన సెన్సార్ సభ్యులు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారని డైరెక్టర్ ఆర్జీవీ తెలిపారు. అయితే ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదని వెల్లడించారు. (ఇది చదవండి: నాకున్న జబ్బు ఇదే, ఎక్కువ రోజులు బతకనని చెప్పారు: నటి) ఇప్పటికే ఆర్జీవీ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 'అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఎన్ని వ్యూహాలు పన్నినా మా ‘వ్యూహం’ను ఆపలేరు అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప సినిమాలోని ఓ డైలాగ్‌తో ఆర్జీవీ ట్వీట్ చేశారు. అందులో అల్లు అర్జున్, సునీల్ మధ్య జరిగిన సీన్ మీమ్‌ను షేర్ చేశారు. అందులో పుష్ప క్యారెక్టర్లో ఆర్జీవీని చూపించారు. ఆర్జీవీ షేర్ చేసిన ట్వీట్లో.. 'శీనప్ప.. నేను ఎవ్వడికి భయపడనని నీకు మట్టుకే తెలుసు. కానీ మార్కెట్ మొత్తం తెలియాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా? అన్నో.. ఇది ఒకటి తలలో పెట్టుకో ఎప్పటికీ.. నేను నా వ్యూహంతో నీ కెరీర్‌ను గెలకడానికి రాలే. నా వ్యూహంతో నీ వ్యూహం బయటపెట్టడానికి వచ్చినా.. తగ్గేదేలే' అన్న డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. త్వరలోనే వ్యూహం మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ వెల్లడించారు. (ఇది చదవండి: దయా వెబ్ సిరీస్ నటి.. మరి ఇంత బోల్డ్‌గా ఉందేంటి బ్రో!) pic.twitter.com/RehuN6PGPk — Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2023 -
వ్యూహం..
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్న చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ నటిస్తున్నారు. ‘‘అహంకారానికి, ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో ‘వ్యూహం’ రూపొందుతోంది. ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్‌లో అబద్ధాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
ఆగని బతుకు చక్రం
జీవితం ఎప్పుడూ పచ్చగా ఉండాలి. జీవితాన్ని మోడువార్చే వైపరీత్యాలు ఎన్ని ఎదురైనా వాటిని ఎదుర్కొని కొత్త దారులు వేసుకుంటూ ఎప్పటికప్పుడు జీవితాన్ని కొత్తగా చిగురింప చేసుకుంటూ ఉండాలి. కోవిడ్ 19 జీవితాలను అతలాకుతలం చేసింది. జీవికలనే ప్రశ్నార్థకం చేసింది. ఎన్ని ప్రశ్నార్థకాలు ఎదురైనా వెనుకడుగు వేయాల్సిన పని లేదని నిరూపిస్తున్నారు కేరళవాసులు. పనిని గౌరవించే సంస్కృతే వారిని నిలబెడుతోంది. ముందుంది మంచికాలం అజ్మల్‌కి 28 ఏళ్లు. అతడిది కేరళలోని కొట్టాయం. కోస్టా క్రూయిజ్‌లో షెఫ్‌గా ఉద్యోగం చేయాలనేది అతడి కల. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరినప్పటి నుంచి కన్న కల అది. అతడి ఫ్రెండ్స్‌కి అందులో ఉద్యోగం వచ్చింది. అజ్మల్‌కి రాలేదు. దాంతో కొట్టాయంలోనే ఒక స్టార్ హోటల్లో ఉద్యోగం చేస్తూ మళ్లీ ప్రయత్నించాడు. గత ఏడాది చివరిలో సెలెక్ట్ అయ్యాడు. కొట్టాయంలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ ఏడాది మార్చిలో విదేశాల బాట పట్టాల్సిన వాడు. ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కానీ కోవిడ్ మహమ్మారి అతడి రెక్కలను కట్టేసింది. కోస్టా కంపెనీ నుంచి ఈ మెయిల్ వచ్చింది. కోవిడ్ కారణంగా తలెత్తిన పరిస్థితిని వివరిస్తూ తమ నిస్సహాయతను వ్యక్తం చేసింది. కనీసం ఏడాదిపాటు ఎదురు చూడాలని సూచించింది కోస్టా క్రూయిజ్ కంపెనీ. ఖాళీగా ఉండడంతో పిచ్చిపట్టినట్లయిందతడికి. దాంతో కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాడు. తోపుడు బండి మీద కూరగాయలమ్ముతున్నాడు. ‘‘పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం ఉంది. అప్పటి వరకు ఊరికే ఉండకూడదు. ఏదో ఒక పని చేయాలి’’ అని ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నాడు అజ్మల్. హాస్టల్‌కి లాక్డౌన్ కోళికోద్‌కు చెందిన ప్రీతి సంతోష్‌కి ఇది తొలి కష్టం కాదు. ఆమె భర్త ఐదేళ్ల కిందట యాక్సిడెంట్లో పోయాడు. అప్పటి నుంచి నలుగురున్న ఆ కుటుంబ భారం ఆమెదే. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పెట్టింది. తొంభై మందితో హాస్టల్ సజావుగానే నడుస్తోంది. జీవిత నావ కూడా ఒడిదొడుకులు లేకుండా నడుస్తుందనే నమ్మకం ఏర్పడింది ఆమెకి. ఇంతలో 2020 వచ్చింది, కోవిడ్ ఇండియాకి వచ్చి విస్తరించింది. లాక్‌డౌన్‌తో హాస్టల్‌కు లాక్ పడింది. ఏదో ఒకటి చేసి బతుకును కొనసాగించాలనుకున్నాడు. అప్పటికే రైతులు పండించిన కూరగాయలు పెద్ద మార్కెట్లకు తరలించడానికి వీలు లేకుండా రవాణా స్తంభించి పోయి ఉంది. అప్పుడు ప్రీతి తన ఇంటి ముందు కూరగాయల దుకాణం పెట్టింది. సమీపంలో ఉన్న రైతులు కూరగాయలను స్వయంగా తెచ్చి ఇస్తారు. ఆ తాజా కూరగాయలే ఆమె జీవితాన్ని చిగురింపచేస్తున్నాయి. ఏసీ షోరూమ్‌ల ధరలతో పోలిస్తే ప్రీతి దగ్గర కూరగాయల ధర బాగా తక్కువగా ఉండడంతో ఆమె వ్యాపారం బాగా సాగుతోంది. చేదెక్కిన దుబాయ్ కాఫీ కరీమ్ తన స్నేహితుడితో కలిసి 2019 మొదట్లో దుబాయ్‌లో చిన్న కాఫీ షాప్ పెట్టాడు. కొద్ది నెలల్లోనే కాఫీ వ్యాపారం గాడిన పడింది. ఒకసారి ఇండియాకి వచ్చి వెళ్దామనుకున్నాడు. గత ఏడాది చివర్లో ఇండియాకి వచ్చాడు. ఈ ఏడాది జనవరిలో తిరిగి వెళ్లాలనుకున్నాడు. కానీ అమ్మ అనారోగ్యం వల్ల మరికొన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. ఇంతలో కోవిడ్ వచ్చింది. ఇక దుబాయ్‌కి వెళ్లేదెప్పుడో చెప్పగలిగిన వాళ్లెవరూ లేరిప్పుడు. కరీమ్ ఇప్పుడు చేపల వ్యాపారం చేస్తున్నాడు. బైక్ మీద చేపల ట్యాంక్ పెట్టుకుని వీథి వీథి తిరిగి తాజా చేపలను అమ్ముతున్నాడు. ఆదుకుంటున్న అప్పడాలు కృష్ణదాస్ ఎనిమిదేళ్లుగా కోళికోద్లో ఆటో నడిపేవాడు. లాక్‌డౌన్‌తో ఆటో ఆగిపోయింది. అతడు వెంటనే అప్పడాల తయారీ చేపట్టాడు. ఇప్పుడు రోజుకు ఐదు వందల అప్పడాలు అమ్ముతున్నాడు. లాక్డౌన్ సడలించిన తర్వాత తిరిగి ఆటో బయటకు తీశాడు. కానీ ఆటో ఎక్కేవాళ్లు లేక రోజుకు వంద రూపాయలు రావడమే గగనమైంది. దాంతో తిరిగి ఆటోను పక్కన పెట్టేశాడు. ఆటో చక్రం ఆగినా సరే బతుకు చక్రం ఆగకూడదు. ఒకదారి మూసుకుపోతే మరోదారిని వెతుక్కోవాలి. ఇప్పుడతడికి అప్పడాలే అన్నం పెడుతున్నాయి. దాంతో అప్పడాల తయారీని మరింతగా విస్తరించే ఆలోచనలో ఉన్నాడు కృష్ణదాస్. -
ఆర్మీ చీఫ్‌వి రాజకీయ వ్యాఖ్యలు
-
ఆర్మీ చీఫ్‌వి రాజకీయ వ్యాఖ్యలు
గువాహటి : ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ రాజ్యాంగానికి విరుద్ధంగా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ గురువారం ఆరోపించారు. ‘రావత్ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య, లౌకిక విలువలపై ఏర్పాటైన మా పార్టీ బీజేపీకంటే వేగంగా ఎదిగితే ఆయనకెందుకు బాధ?’ అని అజ్మల్ ఓ ట్వీట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ముస్లింల జనాభా పెరుగుతుండటంపై రావత్ బుధవారం మాట్లాడుతూ అస్సాంలో 1980ల్లో బీజేపీ ఎదిగిన దానికంటే వేగంగా ప్రస్తుతం అక్కడ ఏఐయూడీఎఫ్ ఎదుగుతోందని అన్నారు. రావత్ మాట్లాడిన దాంట్లో రాజకీయ, మతపరమైన అంశాలేవీ లేవని ఆర్మీ గురువారం పేర్కొంది. మరోవైపు రావత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సీపీఎం నాయకురాలు బృందా కారత్ మాట్లాడుతూ రావత్ వ్యాఖ్యలను ఆర్మీ సమర్థిస్తోందంటే వాటికి రక్షణ మంత్రి ఆమోదం ఉన్నట్లేనన్నారు. రావత్ రాజకీయాల గురించి కాకుండా సైన్యం గురించి ఆలోచించాలని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కాగా, రావత్‌ను బీజేపీ వెనకేసుకొచ్చింది. అస్సాం మంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ రావత్ కొత్తగా మాట్లాడిందేమీ లేదన్నారు. -
'కింగ్ మేకర్' అవుతానని..!
అసోం ఎన్నికల్లో కింగ్ మేకర్ రోల్ ప్లే చేస్తానన్న సెంటు దిగ్గజం మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ భారతీయ జనతా పార్టీ జోరుకు నిలబడలేక పోయారు. అసోంలో పోలింగ్ పూర్తయిన తర్వాత ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫండ్ (ఏఐయూడీఎఫ్) సాయం లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాదని ఆయన అన్నారు. పార్టీని నిలబెట్టడం మాట అటుంచి తానే గెలవలేక చతికిలపడ్డారు. ఎన్నికల ఫలితాల్లో పార్టీ కేవలం 13 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో ఏఐయూడీఎఫ్ ఆశలు అడియాసలయ్యాయి. 2005లో పార్టీని స్థాపించిన నాటి నుంచి ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభావం చూపింది. అప్పటినుంచి ప్రతి ఎన్నికలో విజయం సాధిస్తూ వస్తోన్న అజ్మల్ ఈ ఎన్నికల్లో తొలి ఓటమి రుచి చూశారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి వాజెద్ అలీ చౌదరి చేతిలో 16,723 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడిన అజ్మల్ ప్రజల తీర్పును పాటిస్తామని.. ప్రతిపక్ష పాత్రలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని అన్నారు. ఏఐయూడీఎఫ్ ఓటమికి కాంగ్రెస్ పార్టీయే ముఖ్యకారణమని ఆయన ఆరోపించారు. ఏఐయూడీఎఫ్ సూచించినట్లు మహాకూటమిగా ఏర్పడి ఉంటే గెలిచి తీరేవాళ్లమని అన్నారు. -
ముచ్చటగా మూడో పేరు..!
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వంశీ ఈ మధ్య కాలంలో అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. సినిమాలో ఏ ఒక్క ఫ్రేమ్ చూసిన ఇది వంశీ సినిమా అనే స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ డైరెక్టర్ ఇటీవల తన మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోతున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన వంశీ 'ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు', 'గోపి గోపిక గోదావరి' లాంటి డీసెంట్ హిట్స్ అందించినా.. పూర్తి ఫాంలోకి మాత్రం రాలేకపోయాడు. చాలా రోజులు క్రితం వంశీ 'తను మొన్నే వెళ్లిపోయింది' పేరుతో ఓ సినిమాను ఎనౌన్స్ చేశాడు. అంతే వేగంగా ఆ సినిమాను పూర్తి చేశాడు. అయితే సినిమా పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు రిలీజ్‌కు మాత్రం నోచుకోలేదు. సినిమా విడుదల జాప్యం కావటంతో ఆ సినిమా టైటిల్‌ను 'మెల్లగా తట్టింది మనసు తలుపు' అంటూ మార్చాడు. టైటిల్ మార్చినా పరిస్థితి మారలేదు. సినిమా రిలీజ్‌కు మార్గం సుగమం కాలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వంశీ తన సినిమా టైటిల్ ను మార్చాడు. 'తను మొన్నే వెళ్లిపోయింది', 'మెల్లగా తట్టింది మనసు తలుపు' తరువాత ప్రస్తుతం అదే సినిమాను 'వెన్నెల్లో హాయ్ హాయ్' పేరుతో ప్రమోట్ చేస్తున్నాడు వంశీ. అజ్మల్, నిఖితా నారాయన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను డివి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. మరి టైటిల్ ఛేంజ్ తో అయినా వంశీ సినిమా రిలీజ్ వస్తుందేమో చూడాలి. -
నిదురపుచ్చే కలాచి!
‘‘ఏంటి డియర్... పనుండి వెళ్తున్నా. హడావుడిలో నీకు చెప్పలేకపోయాను. చీకటి పడేలోపు నీ ముందు ఉంటాను కదా... టెన్షన్ ఎందుకు?’’... కారు నడుపుతూనే భార్య జరీనాకు సర్ది చెప్తున్నాడు అజ్మల్. ‘‘నువ్వు ఇలాగే అంటావ్ అజ్మల్. కచ్చితంగా త్వరగా రావు. రుబినా వాళ్లు మనకెంతో కావలసినవాళ్లు. వాళ్ల ఇంట్లో ఫంక్షన్‌కి కూడా ఆలస్యంగా వెళ్తే ఏం బాగుంటుంది?’... కినుకగా అంది జరీనా.అజ్మల్ నవ్వాడు. ‘‘నీ బుంగమూతి నాకు కనబడుతుందోయ్. అలిగినప్పుడు భలే ఉంటావ్‌లే’’... అల్లరి పెట్టాడు.‘‘చాలు చాలు. దీనికేం తక్కువ లేదు’’... ఉడుక్కుంది జరీనా. ‘‘సరే. ఐదున్నరకల్లా ఇంట్లో ఉంటాను. ఇక అలక వదిలెయ్. నేను వచ్చేసరికి రెడీగా ఉండు. నేను రాగానే...’’ అజ్మల్ మాట మధ్యలో ఆగి పోయింది. ‘‘హలో... హలో...’’... అరి చింది జరీనా. కానీ అవతలి నుంచి అతడి స్వరం వినిపించడం లేదు. అలాగని లైన్ కట్ కాలేదు కూడా. కారు బ్రేక్ వేసిన శబ్దం వినిపించింది. ఇంకా చుట్టుపక్కల నుంచి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. కానీ అజ్మల్ మాట మాత్రం వినిపించడం లేదు. జరీనా గుండె ఝల్లుమంది. కొంపదీసి ఏదైనా ప్రమాదం జరగలేదు కదా! ఫోన్ కట్ చేసి మళ్లీ డయల్ చేసింది జరీనా. ఈసారి అజ్మల్ ఫోన్ ఎత్తలేదు. దాంతో జరీనా కంగారు మరీ ఎక్కువై పోయింది. మళ్లీ మళ్లీ చేసింది. నో రెస్పాన్స్. ఆమె గుండె దడదడా కొట్టుకుం టోంది. ఏం చేయాలో పాలుపోలేదు. అక్షత్ గుర్తొచ్చాడు. తను అజ్మల్ తమ్ముడు. ఆ ఊళ్లోనే కాస్తంత దూరంలో ఉంటున్నాడు. అతనికి ఫోన్ చేసి జరిగింది చెప్పింది. ఎందుకో అక్షత్ మనసు కూడా కీడు శంకించింది. అరగంట తిరిగేసరికల్లా వదినగారి ముందు ఉన్నాడు. ఇద్దరూ కలిసి అజ్మల్ కోసం ‘కలాచి’ గ్రామానికి బయలుదేరారు. కలాచిలో ప్రవేశించి కొన్ని మైళ్లు వెళ్ల గానే రోడ్డు పక్కన కనిపించింది అజ్మల్ కారు. కంగారుగా దాని దగ్గరకు పరు గెత్తారు అక్షత్, జరీనా. డ్రైవింగ్ సీట్లో వెనక్కి ఒరిగి ఉన్నాడు అజ్మల్. ఒంటిమీద దెబ్బలేవీ లేవు. కానీ మనిషి మాత్రం స్పృహలో లేడు. ఎంత లేపినా లేవట్లేదు. ఊపిరి మాత్రం ఆడుతోంది. వెంటనే అతణ్ని తీసుకుని తిరుగు ప్రయాణ మయ్యారు. తమ సిటీకి వెళ్తూనే నేరుగా ఓ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లారు. అజ్మల్‌ని పరీక్షించిన డాక్టర్ చెప్పాడు... ‘‘ఎందుకంత కంగారు? ఇతను నిద్రపోతున్నాడంతే.’’ఉలిక్కిపడ్డారు అక్షత్, జరీనా. ‘‘ఏంటీ... నిద్రపోతున్నాడా?’’ అన్నారు ముక్తకంఠంతో. అవునన్నట్టు తలూపాడు డాక్టర్. ‘‘ఇతను వెళ్లింది కలాచికి కదా! అందుకే ఈ నిద్ర’’ అన్నాడు కూల్‌గా. మళ్లీ అయోమయానికి లోనయ్యారు ఇద్దరూ. కలాచికి వెళ్లడమేంటి? నిద్రపో వడమేంటి? నిజానికి ఈ ఇద్దరికే కాదు. ఇలాంటి షాక్ గత రెండేళ్లలో చాలా మందికి తగిలింది. కలాచి వెనుక ఉన్న మిస్టరీ ప్రపంచం ముందుకు వచ్చింది. కలాచి... కజకిస్తాన్‌లోని ఓ గ్రామం. ఐదు వందల కుటుంబాలకు మించి జనాభా ఉండరు. రెండేళ్ల క్రితం ఆ ఊరికి ఓ విపత్తు ముంచుకొచ్చింది. అక్కడి వారు ఉన్నవాళ్లు ఉన్నట్టే నిద్రపోసాగారు. ఒక్క సారి నిద్రలోకి జారుకున్న వారు రోజుల తరబడి నిద్రపోతూనే ఉండేవారు. తీరా మెలకువ వచ్చాక కొందరికి గతం గుర్తుం డేది కాదు. తమ ఇల్లు, తమ వాళ్లు, చివరికి తమ పేరు కూడా మర్చి పోయిన వాళ్లు ఉన్నారు. మెలకువే రాకుండా కోమాలోకి వెళ్లి ప్రాణాలు వదిలినవాళ్లూ ఉన్నారు. ఈ పరిస్థితి అందరినీ హడలెత్తిం చింది. వైద్యులు రంగంలోకి దిగారు. పరిశోధనలు చేశారు. కానీ ఆ పరిస్థితికి కారణమేంటో బోధపడలేదు. కలాచిని ఆనుకుని ఒక యురేనియం గని ఉంది. దాన్ని ఎప్పుడో మూసేశారు. కానీ దాని మీద నుంచి వచ్చిన కలుషిత గాలిని పీల్చడం వల్ల కానీ, నేలలో ఉన్న యురేనియం నిల్వల వల్ల పెరిగిన రేడి యేషన్ కారణంగా గానీ తమకీ పరిస్థితి వస్తుందేమోనన్నది కలాచి ప్రజల సందేహం. వైద్యులు, అధికారులు మాత్రం అది నిజం కాదంటున్నారు. గాలిలో కార్బన్ మోనాక్సైడ్ నిల్వలు పెరగడం వల్ల ఇలా జరిగిందేమోనంటూ థియరీలు చెబు తున్నారు. తమ వాదనను నిరూపించే ఆధారాలు మాత్రం చూపించలేక పోతున్నారు. దాంతో చేసేదేమీ లేక ప్రభుత్వం ఆ గ్రామస్తులందరినీ వేరే ప్రాంతాలకు తరలించింది. దాంతో కలాచి ఖాళీ అయిపోయింది. అక్కడ వచ్చిన సమస్య ఓ మిస్టరీగా మిగిలిపోయింది. -
మనసు తలుపు తడితే...
వంశీ సినిమా అంటేనే వైవిధ్యానికి చిరునామా. ‘సితార’, ‘అన్వేషణ’ లాంటి చిత్రాలు ఆయన ప్రతిభకు కొన్ని తార్కాణాలు. ఇప్పటికీ ఆయన సినిమాల గురించి ఎదురుచూసే అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన దర్శకత్వంలో ‘మెల్లగా తట్టింది మనసు తలుపు’ చిత్రం రానుంది. అజ్మల్, నికితా నారాయణ్ జంటగా డీవీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రచార చిత్ర ఆవిష్కరణలో వంశీ మాట్లాడుతూ -‘‘మధ్యలో ఆగిపోయిన ‘తను మొన్నే వెళ్లిపోయింది’ చిత్రాన్ని మళ్లీ ప్రారంభించినందుకు నిర్మాత వెంకటేశ్‌గారికి నా థ్యాంక్స్. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు. రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ -‘‘వంశీ గారి 25వ సినిమా ఇది. తెలుగు సంప్రదాయాలను, సంస్కృతిని ప్రేమించే దర్శకుడాయన’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అజ్మల్, నికితా నారాయణన్, డి.వెంకటేశ్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: యం.వి.రఘు. -
చీకటి కోణాలు
బాలకృష్ణతో కలిసి తాజా ‘లయన్’లో నటించిన రాధికా ఆప్టే మరో సినిమాతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. రుద్రన్ దర్శకత్వంలో అజ్మల్, రాధికా ఆప్టే జంటగా తమిళంలో నటించిన చిత్రం ‘వెట్రి సెల్వన్’. శ్రీనివాస దామర ఈ చిత్రాన్ని ‘టుడే’గా తెలుగులో అందించనున్నారు. వైద్య రంగంలో ఉన్న సమస్యలు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో జరుగుతున్న అన్యాయాలను విశ్లేషిస్తూ, అక్కడి చీకటి కోణాలను వెలుగులోకి తీసుకొచ్చే చిత్రం ఇదని నిర్మాత చెప్పారు. -
25న చెన్నైకి హఫీజ్, అజ్మల్
కరాచీ: పాకిస్తాన్ ఆల్‌రౌండర్ హఫీజ్, స్పిన్నర్ అజ్మల్ తమ సందేహాస్పద బౌలింగ్ శైలిని పరీక్షించుకునేందుకు ఈనెల 25న చెన్నైకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది అధికారిక పరీక్షా లేక అనధికారికమా తేలాల్సి ఉందని పాక్ క్రికెట్ బోర్డు పాలకమండలి సభ్యుడు షకీల్ షేక్ చెప్పారు. ‘ఒకవేళ హఫీజ్ ఐసీసీ అధికారిక టెస్టు కోసం హాజరై విఫలమైతే మరో ఏడాది పాటు అంతర్జాతీయ బౌలింగ్ నుంచి నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో అతను ప్రపంచకప్‌లోనూ బౌలింగ్ వేయలేడు’ అని షకీల్ తెలిపారు. ఇటీవల కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో హఫీజ్ బౌలింగ్ శైలిపై అంపైర్లు ఫిర్యాదు చేయడంతో ఐసీసీ అతడిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
కమల్‌హాసన్‌లా పేరు తెచ్చుకోవాలని ఉంది!
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని కొంతమంది తారలు చెబుతుంటారు. అజ్మల్ ఆ కోవకు చెందినవారే. తండ్రి లాయర్. కొడుకుని డాక్టర్ చేయాలన్నది ఆయన కల. కానీ, అజ్మల్‌కి మాత్రం సినిమాలంటే ప్రాణం. తండ్రి కోరిక మేరకు ఎంబీబీఎస్ చదివి, ఆ తర్వాత సినిమాల్లోకొచ్చేశారు. తమిళ, మలయాళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అజ్మల్ ‘రంగం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ‘రచ్చ’లో కీలక పాత్ర చేసిన అజ్మల్ తెలుగులో సోలోగా చేసిన ‘ప్రభంజనం’ రేపు విడుదల కానుంది. సోలో హీరోగా తెలుగులో బ్రేక్ తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఈ సినిమా చేయలేదని, కథ నచ్చడం వల్లే చేశానని అజ్మల్ చెబుతూ -‘‘ఇలాంటి కథలు ఏ పది, పదిహేనేళ్లకో మాత్రమే వస్తాయి. ఇది సాదాసీదా కథ కాదు. అందుకే చేశాను. సమాజానికి మంచి చేయాలనుకొనే ఓ సామాన్యుడి పోరాటమే ఈ సినిమా. అల్లరి చిల్లరిగా తిరిగే హీరో ఆ తర్వాత ఓ మంచి పౌరుడిగా ఎలా మారాడు? సమాజానికి ఏ విధంగా మంచి చేశాడు? అనేది కథాంశం. తాత, తండ్రి, కొడుకు.. ఇలా మూడు తరాలకు సంబంధించిన కథ. అందుకని మూడు తరాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది. నాది రెండు కోణాలున్న పాత్ర కావడంతో నటుడిగా నాకు సవాల్ అనిపించింది. రాజకీయాల నేపథ్యంలో సాగే సినిమా అయినా, ఏ పార్టీపైనో, ప్రధానంగా ఏ రాజకీయ నాయకుడిపైనో వ్యంగ్యాస్త్రాలు ఉండవు. అలాగే ఎవర్నీ సపోర్ట్ చేసే సినిమా కాదు. దర్శకుడు వేండ్రాతి భాస్కరరావు ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు’’ అని చెప్పారు. వంశీ దర్శకత్వంలో చేసిన ‘తను మొన్నే వెళ్లిపోయింది’ విడుదలకు సిద్ధమైందని, ఆయన దర్శకత్వంలో నటించడం తన అదృష్టమని అజ్మల్ అన్నారు. భవిష్యత్తులో ఓ ఆస్పత్రి కట్టించాలనుకుంటున్నానని చెప్పారు. దక్షిణాది భాషల్లో సినిమాలు చేసి, కమల్‌హాసన్‌లా బహుభాషా నటుణ్ణి అనిపించుకోవాలన్నదే తన లక్ష్యమని అజ్మల్ తెలియజేశారు. -
సమాజంలో మార్పు కోసం...
సమసమాజ స్థాపనే ధ్యేయంగా ముందుకు సాగిన నలుగురు యువకుల కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ప్రభంజనం’. ‘రంగం’ఫేం అజ్మల్, సందేశ్, ఆరుషి, పంచిబోర ఇందులో ప్రధాన పాత్రధారులు. భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రచార చిత్రాలను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. భాస్కరరావు మాట్లాడుతూ -‘‘ఇరవై ఏళ్ల నా ఆలోచనలకు రూపమే ఈ ‘ప్రభంజనం’. 67 ఏళ్ల స్వతంత్ర భారతంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వచ్చి మార్పులేంటి? ఆ మార్పుకు కారణమేంటి? అనే అంశాలపై నలుగురు యువకులు చేసిన పరిశోధన ఎలాంటి ఫలితాలిచ్చింది. సమాజంలో మార్పుకై వాళ్లు ఏ విధంగా ముందుకెళ్లారు అనేదే మా సినిమా కథాంశం. ఆ రోజు అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల ప్రభావం దేశంపై ఎలా ఉందో ఈ చిత్రంలో చర్చించాం. నోటుకు అమ్ముడు పోయి ఓటు వేస్తే పర్యవసానం ఎలా ఉంటుందో ఇందులో వివరించాం. అయితే ఎవర్నీ ఇందులో కించపరచలేదు’’ అని తెలిపారు. ఈ సినిమా కోసం నేను స్వరపరిచిన ‘ప్రభంజనం..’ టైటిల్‌సాంగ్‌ని నేను అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారం కోసం ఉపయోగించుకోవడం గర్వంగా ఉందని, అయితే... ఈ సినిమాకానీ, ఆ పాటగానీ ఏ పార్టీకి సంబంధించింది కాదని ఆర్పీ పట్నాయక్ చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు టి.ప్రసన్నకుమార్, నాగార్జున రెడ్డి కూడా మాట్లాడారు. -
ప్రభంజనం మూవీ ప్రెస్‌మీట్
-
ఆలోచింపజేసే సినిమా
ఓటర్లలో అవగాహన పెంచి, వారిలో ఉద్యమస్ఫూర్తిని రగిలించి, సన్మార్గంలో నడిపించడానికి కృషి చేసిన నలుగురు యువకుల కథతో తెరకెక్కిన చిత్రం ‘ప్రభంజనం’. భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అజ్మల్, సందేశ్, అరుషి, పంచిబోర ముఖ్య తారలు. సెన్సార్ కార్యక్రమాలు ముగించుకున్న ఈ చిత్రం నెల 12న లేదా 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాస్కరరావు మాట్లాడుతూ -‘‘జనం కోసం తీసిన సినిమా ఇది. 67 ఏళ్ల స్వతంత్ర భారతంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి. పజలపై వాటి ప్రభావం ఎంత బలీయంగా ఉందో తెలిపే సినిమా ఇది. అలాగని డాక్యుమెంటరీలా ఈ సినిమా ఉండదు. కమర్షియల్ హంగులన్నీ ఇందులో ఉంటాయి. నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల అద్భుతమైన ప్రతిభ ఈ సినిమాకు ప్రధాన బలాలు. ఓ వైపు ఆనందింపజేస్తూ, మరో వైపు ఆలోచింపజేసే సినిమా ఇది’’ అన్నారు. లంచగొండితనంపై ఇప్పటివరకూ చాలా సినిమాలొచ్చాయని, కానీ వాటిలో చూపించని ఎన్నో అంశాలను ఇందులో చూపించారని, ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుంది? దేశ పౌరులుగా మన బాధ్యత ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా అని ఆర్పీ పట్నాయక్ చెప్పారు. మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని అజ్మల్, సందేశ్, అరుషి ఆనందం వెలిబుచ్చారు. -
వ్యవస్థలో మార్పు కోసం...
వ్యక్తుల్లో మార్పు.. వ్యవస్థలో మార్పుకు దోహదపడుతుందని చెప్పే సందేశాత్మక కథాంశంతో రూపొందిన చిత్రం ‘ప్రభంజనం’. ‘పే బ్యాక్ టు సొసైటీ’ ఉపశీర్షిక. ‘రంగం’ ఫేం అజ్మల్, సందేశ్, ఆరుషి, పంచిబోర ప్రధాన పాత్రధారులు. భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ - ‘‘న్యాయాన్నీ చట్టాన్నీ పరిరక్షించే అధికారులు ఎంతమంది ఉన్నా, సమాజంలోని లంచగొండితనాన్ని మాత్రం నిర్మూలించలేకపోతున్నారు. కారణమేంటి? ఇదే సందేహం ఓ నలుగురు ఇంజినీర్లకు వస్తుంది. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి ఆ నలుగురు ఓ సర్వే నిర్వహిస్తారు. కారణాలేంటో తెలుసుకుని, వాటిని అంతం చేయడానికి నిర్ణయించుకున్న ఆ ఇంజినీర్లు ఏ విధంగా అడుగులేశారు? గమ్యాన్ని ఏ విధంగా చేరుకున్నారు? అనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించాం. ఒక ఆశయం కోసం తీసిన ఈ చిత్రానికి సిరివెన్నెల సాహిత్యం, ఆర్పీ పట్నాయక్ సంగీతం ఆభరణాలుగా నిలిచాయి. తొలి కాపీ సిద్ధమైంది. ఏప్రిల్ తొలివారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. గొల్లపూడి మారుతీరావు, కోట శ్రీనివాసరావు, నాజర్, నాగబాబు, ఆహుతి ప్రసాద్, బెనర్జీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సురేందర్‌రెడ్డి, కూర్పు: మోహన్-రామారావు. -
ప్రభంజనం ఆడియో వేడుక
-
ప్రభంజనం ఆడియో ఆవిష్కరణ
-
సమసమాజం కోసం...
అవినీతి లేని సమాజాన్ని చూడాలనేది ఆ యువకుడి ఆశయం. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు అవినీతిని అంతమొందిస్తారన్నది అతని ఆశ. కానీ, అతని ఆశ నెరవేరే పరిస్థితి కనిపించదు. చివరకు తనే నడుం బిగిస్తాడు. తను అనుకున్నట్లుగానే అవినీతిని సమూలంగా అంతమొందించడానికి ఏం చేసాడు? అనే శక్తిమంతమైన కథాంశంతో చైతన్య ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘ప్రభంజనం’. ‘రంగం’ ఫేమ్ అజ్మల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ వచ్చే నెల 2న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మాట్లాడుతూ -‘‘నేను మెటలర్జికల్ ఇంజినీరింగ్ చదివాను. సమాజంలో ఒకడిగా సమాజాన్ని చదివి సమసమాజం కోసం ప్రయోగాత్మకంగా ఈ సినిమా చేస్తున్నాను. ఐఏయస్, ఐపీయస్, ఐఆర్‌యస్ శాఖల్లో ఉన్నవారే అవినీతిని నియంత్రించలేకపోవడంతో, సోషల్ అర్కిటెక్గా మారిన ఓ సివిల్ ఇంజనీర్ రాజకీయ వ్యవస్థపై ఎలా పోరాటం చేస్తాడు? అనేది ఈ చిత్రకథ’’ అన్నారు. సందేశ్, ఆరుషి, పంచిబొర, గొల్లపూడి మారుతీరావు, కోట శ్రీనివాసరావు, నాజర్, నాగేంద్రబాబు, ఆహుతిప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల, సంగీతం: ఆర్.పి.పట్నాయక్, కెమెరా: సురేందర్‌రెడ్డి, కథ-కథనం-మాటలు-నిర్మాత-దర్శకత్వం: భాస్కరరావు వేండ్రాతి. -
రాజకీయ ప్రభంజనం
ఓ అల్లరి కుర్రాడు అటు కళాశాలలోనూ, ఇటు కుటుంబంలోనూ అనుకోని దుర్ఘటనలను ఎదుర్కొంటాడు. ఈ ఘటనలు.. స్వాతంత్య్రానంతర చరిత్రను తాను అధ్యయనం చేయడానికి పురిగొల్పుతాయి. తన అధ్యయనం ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలు, దోపిడీ రాజకీయ వ్యవస్థ, దానికి తోడైన అధికార వ్యవస్థలపై పూర్తిగా అవగాహన చేసుకొని ఓటర్లలో చైతన్యం తేవడానికి ప్రయత్నిస్తాడు. తదనంతరం తాను ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ప్రభం జనం’. ‘రంగం’ ఫేమ్ అజ్మల్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని భాస్కరరావు వేండ్రాతి స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో రెండో షెడ్యూలు మొదలైంది. ఈ సందర్భంగా భాస్కరరావు వేండ్రాతి మాట్లాడుతూ -‘‘నలుగురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కథ ఇది. సందేశంతో పాటు కావాల్సినంత వినోదం కూడా ఈ కథలో ఉంటుంది. ఇందులో మొత్తం 5 పాటలుంటాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. చాలా రోజుల విరామం తర్వాత ఆర్పీ పట్నాయక్ మా చిత్రానికి స్వరాలందించారు. డిసెంబర్ ద్వితీయార్ధంలో పాటలను, జనవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. సందేశ్, ఆరుషి,పంచి బొరా, నాజర్, నాగబాబు, కోట శ్రీనివాసరావు, గొల్లపూడి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, నిర్మాణం: చైతన్య ఆర్ట్ క్రియేషన్స్.