వ్యవస్థలో మార్పు కోసం... | For a change in the society ... | Sakshi
Sakshi News home page

వ్యవస్థలో మార్పు కోసం...

Published Fri, Mar 28 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM

వ్యవస్థలో మార్పు కోసం...

వ్యవస్థలో మార్పు కోసం...

వ్యక్తుల్లో మార్పు.. వ్యవస్థలో మార్పుకు దోహదపడుతుందని చెప్పే సందేశాత్మక కథాంశంతో రూపొందిన చిత్రం ‘ప్రభంజనం’. ‘పే బ్యాక్ టు సొసైటీ’ ఉపశీర్షిక. ‘రంగం’ ఫేం అజ్మల్, సందేశ్, ఆరుషి, పంచిబోర ప్రధాన పాత్రధారులు. భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది.
 
 ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ - ‘‘న్యాయాన్నీ చట్టాన్నీ పరిరక్షించే అధికారులు ఎంతమంది ఉన్నా, సమాజంలోని లంచగొండితనాన్ని మాత్రం నిర్మూలించలేకపోతున్నారు. కారణమేంటి? ఇదే సందేహం ఓ నలుగురు ఇంజినీర్లకు వస్తుంది. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో  తెలుసుకోవడానికి ఆ నలుగురు ఓ సర్వే నిర్వహిస్తారు. కారణాలేంటో తెలుసుకుని, వాటిని అంతం చేయడానికి నిర్ణయించుకున్న ఆ ఇంజినీర్లు ఏ విధంగా అడుగులేశారు? గమ్యాన్ని ఏ విధంగా చేరుకున్నారు? అనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించాం.

 
 ఒక ఆశయం కోసం తీసిన ఈ చిత్రానికి సిరివెన్నెల సాహిత్యం, ఆర్పీ పట్నాయక్ సంగీతం ఆభరణాలుగా నిలిచాయి. తొలి కాపీ సిద్ధమైంది. ఏప్రిల్ తొలివారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. గొల్లపూడి మారుతీరావు, కోట శ్రీనివాసరావు, నాజర్, నాగబాబు, ఆహుతి ప్రసాద్, బెనర్జీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సురేందర్‌రెడ్డి, కూర్పు: మోహన్-రామారావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement