సమాజంలో మార్పు కోసం... | Prabhanjanam release on 18 April | Sakshi
Sakshi News home page

సమాజంలో మార్పు కోసం...

Published Mon, Apr 14 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM

సమాజంలో మార్పు కోసం...

సమాజంలో మార్పు కోసం...

 సమసమాజ స్థాపనే ధ్యేయంగా ముందుకు సాగిన నలుగురు యువకుల కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ప్రభంజనం’. ‘రంగం’ఫేం అజ్మల్, సందేశ్, ఆరుషి, పంచిబోర ఇందులో ప్రధాన పాత్రధారులు. భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రచార చిత్రాలను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. భాస్కరరావు మాట్లాడుతూ -‘‘ఇరవై ఏళ్ల నా ఆలోచనలకు రూపమే ఈ ‘ప్రభంజనం’. 67 ఏళ్ల స్వతంత్ర భారతంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వచ్చి మార్పులేంటి? ఆ మార్పుకు కారణమేంటి? అనే అంశాలపై నలుగురు యువకులు చేసిన పరిశోధన ఎలాంటి ఫలితాలిచ్చింది.
 
  సమాజంలో మార్పుకై వాళ్లు ఏ విధంగా ముందుకెళ్లారు అనేదే మా సినిమా కథాంశం. ఆ రోజు అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల ప్రభావం దేశంపై ఎలా ఉందో ఈ చిత్రంలో చర్చించాం. నోటుకు అమ్ముడు పోయి ఓటు వేస్తే పర్యవసానం ఎలా ఉంటుందో ఇందులో వివరించాం. అయితే ఎవర్నీ ఇందులో కించపరచలేదు’’ అని తెలిపారు. ఈ సినిమా కోసం నేను స్వరపరిచిన ‘ప్రభంజనం..’ టైటిల్‌సాంగ్‌ని నేను అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారం కోసం ఉపయోగించుకోవడం గర్వంగా ఉందని, అయితే... ఈ సినిమాకానీ, ఆ పాటగానీ ఏ పార్టీకి సంబంధించింది కాదని ఆర్పీ పట్నాయక్ చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు టి.ప్రసన్నకుమార్, నాగార్జున రెడ్డి కూడా మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement