
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తవగానే పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలిలో ఆదివారం మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. పోలింగ్ సమయంలో పోలీసులపై దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేసేందుకు అగర్హటి గ్రామానికి వెళ్లిన బలగాలపై మహిళలు దాడికి దిగారు. మహిళా సిబ్బంది గాయపడ్డారు.
నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తిని విడిపించుకునేందుకు నిరసనకారులు చేసిన ప్రయత్నాలను బలగాలు అడ్డుకున్నాయి. జనవరి 5వ తేదీన రేషన్ కుంభకోణం కేసులో తనిఖీల కోసం సందేశ్‌ఖాలీకి వెళ్లిన ఈడీ బృందంపై దాడి, అనంతరం టీఎంసీ నేత షాజహాన్ షేక్ అరెస్టయినప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.