womens attacks
-
సందేశ్‌ఖాలిలో మళ్లీ హింస
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తవగానే పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలిలో ఆదివారం మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. పోలింగ్ సమయంలో పోలీసులపై దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేసేందుకు అగర్హటి గ్రామానికి వెళ్లిన బలగాలపై మహిళలు దాడికి దిగారు. మహిళా సిబ్బంది గాయపడ్డారు. నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తిని విడిపించుకునేందుకు నిరసనకారులు చేసిన ప్రయత్నాలను బలగాలు అడ్డుకున్నాయి. జనవరి 5వ తేదీన రేషన్ కుంభకోణం కేసులో తనిఖీల కోసం సందేశ్‌ఖాలీకి వెళ్లిన ఈడీ బృందంపై దాడి, అనంతరం టీఎంసీ నేత షాజహాన్ షేక్ అరెస్టయినప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. -
సైన్యాన్ని చుట్టుముట్టిన మహిళలు
ఇంఫాల్: మణిపూర్‌లో శాంతి నెలకొల్పేందుకు యత్నిస్తున్న సైన్యానికి స్థానికంగా ఓ వర్గం మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మిలిటెంట్లను విడిపించుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు ఆర్మీని దిగ్బంధించారు. దీంతో రోజంతా ఉద్రిక్తత కొనసాగింది. చివరికి, ఆర్మీ తమ అదుపులో ఉన్న మెయిటీ వర్గం మిలిటెంట్లను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈ ఘటన తూర్పు ఇంఫాల్ జిల్లా ఇథమ్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. భద్రతా బలగాలు శనివారం ఉదయం గ్రామంలో సోదాలు జరిపి 12 మంది మిలిటెంట్లను అదుపులోకితీసుకున్నాయి. విషయం తెల్సుకున్న సుమారు 1,200 మంది మెయిటీ వర్గం మహిళలు సైనికులను చుట్టుముట్టారు. మిలిటెంట్లను వదిలేయాలని భీష్మించారు. సాయంత్రం వరకు ఇదే ప్రతిష్టంభన కొనసాగింది. చివరికి బలగాలు మిలిటెంట్లను వదిలేశాయి. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను, మందుగుండును మాత్రం తీసుకెళ్లామని ఆర్మీ తెలిపింది. రాష్ట్రంలో నెలకొన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా, బలప్రయోగంతో కలిగే నష్టాన్ని, గ్రామస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మానవతా దృక్పథంతో మిలిటెంట్లను స్థానిక నేతకు అప్పగించినట్లు ఆర్మీ తెలిపింది. ఆర్మీ విడిచిపెట్టిన వారిలో మెయిటీ వర్గం కేవైకేఎల్ గ్రూపునకు చెందిన స్వయం ప్రకటిత లెఫ్టినెంట్ కల్నల్ మొయిరంగ్థెమ్ తంటా అలియాస్ ఉత్తమ్ ఉన్నాడు. ఇతడికి పలు హింసాత్మక ఘటనలతో సహా 2015లో ‘6 డోగ్రా యూనిట్’పై దాడితో సంబంధముంది. ఈ గ్రూప్ మయన్మార్ నుంచి మణిపూర్‌లోకి చొరబడినట్లు ఆర్మీ తెలిపింది. గ్రామంలోకి అదనపు బలగాల ప్రవేశాన్ని ఆలస్యం చేసేందుకు ఆ మార్గంలోని కొన్ని వంతెనల వద్ద అడ్డంకులు కల్పించారంది. కాగా, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఆదివారం ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను వివరించారు. -
కన్నెర్రజేసిన మహిళలు
ఓర్వకల్లు: నన్నూరు గ్రామస్తులు కన్నెర్రజేశారు. బండ్లవాగు వారధి వద్ద కల్లంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం తొలగించకపోవడంతో మూకుమ్మడిగా దాడి చేశారు. షాపులో ఉన్న ఫర్నీచర్, ఫ్రీజ్‌లు, మద్యం సీసాలను ధ్వంసం చేశారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలోని మోక్షిత్ వైన్ షాపు ప్రజాజీవనానికి ఇబ్బందికరంగా మారింది. బస్టాండ్‌కు లేదా పాఠశాలకు వెళ్లాలంటే మద్యం షాపు ముందు నుంచే వెళ్లాలి. ఆ దుకాణం వద్ద కొందరు నిలబడి మద్య తాగడం.. దారిలో వెళ్లే మహిళలు, విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం చేస్తున్నారు. తమకు ఇబ్బంది కలిగిస్తున్న మద్యంషాపును తొలగించాలని మహిళలు సీపీఎం ఆధ్వర్యంలో పలుమార్లు అధికారులు, పోలీసులకు కలిసి వినతిపత్రాలిచ్చారు. అయినా, ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 24 వ తేదీన జాతీయ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తహసీల్దార్ రజనీకుమారి స్పందించి ఈ నెల 29 వ తేదీలోగా షాపు తొగించేందుకు చర్యలు తీసుకుంటామని హామీచ్చారు. గడువు తీరినా షాపు తీయించకపోవడంతో ఆగ్రహించిన మహిళలు, సీపీఎం నాయకులు మంగళవారం మద్యం దుకాణంపై దాడి చేసి షాపులో ఉన్న ఫర్నీచర్, ఫ్రీజ్లతో పాటు మద్యం సీసాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న కర్నూలు తాలూకా రూరల్ సీఐ నాగరాజుయాదవ్, ఓర్వకల్లు ఎస్ఐ చంద్రబాబు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళన కారులు, పోలీసుల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. దుకాణంపై దాడిలో సుమారు రు.3 లక్షల ఆస్తినష్టం సంభవించడంతో పాటు, కౌంటర్లోని రూ.10 వేల నగదు అదృశ్యమైనట్లు షాపు నిర్వాహకుడు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 15 మందిపై కేసు నమోదు: మద్యం షాపుపై దాడికి పాల్పడిన సీపీఎం నాయకులు రామకృష్ణ, నాగన్న, షాజాహాన్, వడ్ల మాసూంబాషా, వడ్ల మహబూబ్‌బాషా, ప్రమీలమ్మతో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రబాబు తెలిపారు. పరిస్థితులు చక్కబడే వరకు గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మద్యం దుకాణాదారుడికి ఓ రాజకీయ నాయకుడి అండదండలున్నాయని..అందుకే అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని గ్రామ మహిళలు ఆరోపిస్తున్నారు. మద్యం షాపు తొలగించాల్సిందే కర్నూలు(కొండారెడ్డిఫోర్ట్): నన్నూరులో మద్యం షాపు తొలగించాల్సిందేనని సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎక్సైజ్æ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా ఉపాధ్యక్షురాలు నిర్మలమ్మ మాట్లాడుతూ తాము ఇబ్బంది పడుతున్నామని మహిళలు ఆందోళనలు చేస్తున్నా మద్యం షాపు నడపడం దారుణమన్నారు. నన్నూరులో మహిళల పట్ల ఎస్ఐ చంద్రబాబు దారుణంగా వ్యవహరించారని డీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మహిళలను దూషించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నన్నూరు గ్రామస్తులు పాల్గొన్నారు. -
మహిళలకు ప్రత్యేకం 181
ఈ హెల్ప్‌లైన్ మహిళలకు ప్రత్యేకం 181 ⇒ ఫిర్యాదులు, సలహాల స్వీకరణకు ప్రత్యేక నంబర్ ⇒ వారం రోజుల్లో అందుబాటులోకి.. ⇒ ఏర్పాట్లు పూర్తి చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ ⇒ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం సాక్షి, హైదరాబాద్: మహిళలపై దాడులు, లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం త్వరలో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయనుంది. ఫిర్యాదులను స్వీకరించేందుకు ‘181’అనే నంబర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉమెన్ హెల్ప్‌లైన్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం అత్యవసర సేవల (డయల్ 100) కింద సేవలందిస్తున్న సంస్థతో ఒప్పందం చేసుకుంది. వచ్చే వారంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఈ హెల్ప్‌లైన్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేయనుంది. ఫిర్యాదులపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపి తక్షణ చర్యలు తీసుకోనుంది. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచనుంది.ఫిర్యాదుల స్వీకరణ.. పథకాల విశదీకరణ.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తీసుకొస్తున్న ఉమెన్ హెల్ప్‌లైన్ కేవలం మహిళా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకే పరిమితం కాదు. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా అవగాహన కల్పిస్తుంది. ఆ పథకానికి సంబంధించి లబ్ధి జరిగే తీరును విశదీకరిస్తుంది. హెల్ప్‌లైన్‌కు వచ్చే ఫిర్యాదులన్నీ రికార్డ్ చేయడంతోపాటు వాటిని సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరించే వరకు నిరంతరంగా పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. హెల్ప్‌లైన్ నిరంతరం (24/7) పనిచేస్తుంది. సమస్య లు, సలహాలతోపాటు మహిళల రక్షణకు హెల్ప్‌లైన్ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. అనుకోని సంఘటనలు జరి గితే మహిళలకు అత్యవసర విడిది ఏర్పాటు చేస్తుంది. మహిళల అక్రమ రవాణా తదితర సమాచారాన్ని సేకరించి రక్షణ చర్యల్లో కీలక భూమిక పోషిస్తుంది.