కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ మంగళవారం చేపట్టిన 'నాబన్నా చలో(చలో సెక్రెటేరియేట్)' ర్యాలీలో తీవ్ర హింస చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం మమతా బెనర్జీ బుధవారం స్పందించారు. బీజేపీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో హింస సృష్టించేందుకు కమలం పార్టీ ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను తుపాకులు, బాంబులతో రాష్ట్రంలోకి తీసుకొచ్చిందని ఆరోపించారు.
కోల్‌కతా హౌరాలో పోలీసులపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన విషయంపైనా మమత స్పందించారు. ఆందోళకారులు దారుణంగా దాడులు చేసినా పోలీసులు వారిపై లాఠీఛార్జ్ గానీ, ఫైరింగ్ గానీ చేయలేదని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన వివిధ ఘటనల్లో చాలా మంది పోలీసులు గాయపడ్డారని వెల్లడించారు. రాజకీయాలు, సంఘ విద్రోహ శక్తులు ఒకే చోట ఇమడలేవని మమత అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
శాంతియుతంగా నిరసనలు చేపడితే తమకెలాంటి ఇబ్బంది లేదని, కానీ ఆందోళనల పేరుతో హింసాత్మక ఘటనలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని మమత తేల్చిచెప్పారు.
చదవండి:బీజేపీ మహిళా నేతకు లైంగిక వేధింపులు.. సొంత పార్టీ నాయకుడే
Comments
Please login to add a commentAdd a comment