Sandesh
-
సందేశ్‌ఖాలిలో మళ్లీ హింస
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తవగానే పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలిలో ఆదివారం మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. పోలింగ్ సమయంలో పోలీసులపై దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేసేందుకు అగర్హటి గ్రామానికి వెళ్లిన బలగాలపై మహిళలు దాడికి దిగారు. మహిళా సిబ్బంది గాయపడ్డారు. నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తిని విడిపించుకునేందుకు నిరసనకారులు చేసిన ప్రయత్నాలను బలగాలు అడ్డుకున్నాయి. జనవరి 5వ తేదీన రేషన్ కుంభకోణం కేసులో తనిఖీల కోసం సందేశ్‌ఖాలీకి వెళ్లిన ఈడీ బృందంపై దాడి, అనంతరం టీఎంసీ నేత షాజహాన్ షేక్ అరెస్టయినప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. -
‘సందేశ్‌ఖాలీ’ కేసు.. ఎన్నికల వేళ ‘తృణమూల్’కు షాక్
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో రాజకీయ దుమారం రేపిన సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, భూ కబ్జాల కేసు దర్యాప్తును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. కేసు దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపింది. సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నేతలు అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడడమే కాకుండా వారి భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అక్కడి మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. తాజాగా సందేశ్‌ఖాలీ అకృత్యాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సందేశ్‌ఖాలీ అకృత్యాల కేసు చాలా సంక్లిష్టమైనది. ఇందులో నిష్పాక్షిక విచారణ జరగాలి. ఈ కేసును ఎవరు విచారించినా రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని మా అభిప్రాయం. కేసు దర్యాప్తులో భాగంగా సామాన్యుల, ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోలు ఎవరినైనా విచారించే అధికారం సీబీఐకి ఉంది. కేసు విచారించి సమగ్ర దర్యాప్తు నివేదిక మాకు అందించాలి’అని హై కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. సందేశ్‌ఖాలీలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నతృణమూల్ నేత షేక్షాజహాన్ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. ఇదే కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేయడానికి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులపై దాడి కేసులో సీబీఐ ఆయను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. ఈడీ అధికారులపై దాడి కేసును సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. కాగా, సందేశ్‌ఖాలీ ఆందోళనలకు నేతృత్వం వహించిన రేఖాపత్రా అనే మహిళకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది. సందేశ్‌ఖాలీ అంశం ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ ఓట్ల శాతానికి భారీగా గండి కొట్టి బీజేపీకి మేలు చేసే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఇదీ చదవండి.. ప్రచారంలో యువతికి ముద్దు -
సిగ్గు... సిగ్గు...
వ్యవసాయభూముల కాపాడేందుకు ఉద్యమాలు చేసి, అప్పటి ప్రభుత్వాన్ని గద్దె దింపి అధికారంలోకి వచ్చిన పార్టీ చివరకు అందులోనే విఫలమైతే? సదరు పార్టీ వ్యక్తులే సారవంతమైన భూముల్ని కబ్జా చేసి, స్థానికులను జీతం బత్తెం లేని బానిస కూలీలుగా మార్చి, స్త్రీలపై యథేచ్ఛగా లైంగిక అత్యాచారాలు సాగిస్తుంటే? పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ళ దీర్ఘకాల వామపక్ష సర్కార్‌పై అలుపెరుగని పోరాటాలు చేసి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై ఇప్పుడు సందేశ్‌ఖలీ వ్యవహారంలో వస్తున్న విమర్శలు ఇవే. కోల్‌కతాకు 70 కి.మీ.ల దూరంలో, ఉత్తర 24 పరగణాల జిల్లాలో సారవంతమైన భూములతో కూడిన ఈ కుగ్రామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికి 53 రోజులైనా, అక్కడి అకృత్యాలకు మూలమని ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికార పార్టీ నేత షేక్ షాజహాన్‌ను అరెస్ట్ చేయకపోవడంపై కలకత్తా హైకోర్ట్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి రావడం పరాకాష్ఠ. సందేశ్‌ఖలీలో చాలాకాలంగా అకృత్యాలు సాగుతున్నా, అది ఇప్పుడు చర్చకు వచ్చింది. రేషన్ కుంభకోణంలో నిందితుడైన స్థానిక రాజకీయ బాహుబలి షేక్ షాజహాన్‌ను అరెస్ట్ చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జనవరి 5న వెళ్ళింది. వారిపై దాదాపు 2 వేల మంది దాకా షాజహాన్ అనుచరులు తీవ్రమైన దాడికి తెగబడ్డారు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉండగా, పెద్దయెత్తున స్థానిక మహిళలు బయటకొచ్చి, ధైర్యం కూడగట్టుకొన్నారు. అనేక సంవత్సరాలుగా అక్కడ షాజహాన్, ఆయన అనుచరులు సాగిస్తున్న భూకబ్జాలనూ, లైంగిక అత్యాచారాలనూ బయటపెట్టారు. ఈ ఆరోపణలతో గ్రామంలో నిరసనలు తలెత్తాయి. గ్రామస్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొని, షాజహాన్ ప్రధాన అనుచరులైన ఉత్తమ్ సర్దార్, శివప్రసాద్ హజ్రాల ఆస్తులపై దాడికి దిగేలా చేసింది. షాజహాన్నూ, అతని అనుచరులనూ అరెస్టు చేయాలని కోరుతూ ఆడవాళ్ళు పెద్ద సంఖ్యలో వీధులకెక్కారు. అధికార తృణమూల్ అసలు నిందితుడి విషయంలో మీనమేషాలు లెక్కిస్తుంటే, ఈ వ్యవహారాన్ని ఎన్నికల ప్రయోజనాలకు ఎలా వాడుకోవాలా అని బీజేపీ చూస్తోంది. అధికార పార్టీ సైతం ఆచితూచి వ్యవహరిస్తున్న నిందితుడు షేక్ షాజహాన్‌ది పెద్ద కథ. ‘సుందర్బన్స్ అసలు పులి’ అంటూ స్థానిక గ్రామీణులు పిలుచుకొనే అతను 2013 నుంచి తృణ మూల్‌కూ, అంతకు ముందు సీపీఐ (ఎం)కూ ఓటింగ్ మిషన్. అతను∙ఎవరికి మద్దతిస్తే వారిదే గెలుపు. 2023 జూలై పంచాయతీ ఎన్నికల్లో సందేశ్‌ఖాలీలోని రెండు బ్లాకుల్లో 333 సీట్లుంటే, 310 సీట్లు పోటీ లేకుండా తృణమూల్ ఖాతాలో పడ్డాయి. మిగతా 23 సీట్లలోనూ చివరకు తృణమూల్ జెండాయే ఎగిరింది. అలాంటి బలవంతుణ్ణి వదులుకోవడం ఎంత మమతకైనా కష్టమే. అందులోనూ మైనార్టీ అయిన షాజహాన్‌ను పరారీలో ఉన్నాడంటూ వదిలేసి, అతని∙హిందూ సహచరు లిద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడంతో బీజేపీ – ఆరెస్సెస్‌లకు అస్త్రం అందివచ్చినట్టయింది. మమత మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని నిందిస్తూ ఎస్సీ, ఎస్టీలను తమ వైపు తిప్పుకోవాలని కమలదళం యత్నిస్తోంది. నాలుగేళ్ళ క్రితమే పోలీసులకు ఫిర్యాదులందినా, 42 కేసులు దాఖలైనా షాజహాన్‌ను కదిలించినవారు లేదు. అతణ్ణి అరెస్ట్ చేస్తే మైనార్టీలు దూరమవుతారనేది మమత భయం. ఏమైనా, మోదీ పర్యటనకు వచ్చే లోపల మమత ఆ పని చేయక తప్పకపోవచ్చు. గతంలో వామపక్ష ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా మమత ఎలాంటి ధర్నాలు చేసిందీ తెలుసు. 2007లో నందిగ్రామ్‌లో ప్రత్యేక ఆర్థిక జోన్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమించి అక్కడకు చేరడానికి ఆమె స్కూటర్ వెనుక కూర్చొని ప్రయాణించడం, సింగూర్‌లో టాటా నానో కర్మాగారం ఎదుట ధర్నాలు చేయడం అందరికీ గుర్తే. తీరా మమత పాలనలో ప్రతిపక్షాలు ఆ తరహా పోరాటాలు సాగించలేకపోతున్నాయి. బీజేపీలో సైతం నేతల మధ్య సమన్వయం కొరవడింది. దాంతో, ప్రధానమంత్రే రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మరికొద్ది రోజులే ఉన్నందున అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు మార్చి తొలివారంలో ఒకటికి మూడుసార్లు బెంగాల్లో పర్య టించనున్నారు. రాజకీయాలు, హింసాకాండ జంటపదాలైన బెంగాల్ దేశంలోని అతి సున్నితమైన ప్రాంతాల్లో ఒకటని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చివరకు కాశ్మీర్ కన్నా ఎక్కువగా 920 కంపెనీల కేంద్ర బలగాలను బెంగాల్లో దింపనున్నట్టు ప్రకటించింది. సభ్యసమాజం సిగ్గుపడేలా సాగుతున్న లైంగిక అత్యాచారాలపై పార్టీలకు అతీతంగా నేతలందరూ గళం విప్పాల్సింది. తృణమూల్ మొదట అసలు అలాంటిదేమీ లేనే లేదని కొట్టిపారేసింది. ఆనక ఇదంతా తమను అప్రతిష్ఠ పాల్జేసేందుకు కాషాయదళ స్కెచ్ అనీ, ఇప్పుడేమో నిందితుల్ని శిక్షిస్తామనీ పిల్లిమొగ్గలు వేసింది. ప్రతిపక్షాలేమో స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఈ వివాదాన్ని ఎలా వాడుకోగలమనే ప్రయత్నంలోనే ఉన్నాయి. ఇంత సాగుతున్నా, సందేశ్‌ఖలీ ఘటనల్ని సీఎం మమత గట్టిగా ఖండించిన పాపాన పోలేదు. కనీసం పోలీసులు అసలు నిందితుణ్ణి అరెస్ట్ చేసిందీ లేదు. ఇది శోచనీయం. ఓ మహిళ పాలిస్తున్న రాష్ట్రంలో, శాంతిభద్రతల పరిరక్షించాల్సిన హోమ్ శాఖ ఆమె చేతిలో ఉండగా ఇదీ స్త్రీల పరిస్థితి కావడం మరింత సిగ్గుచేటు. రాజకీయాలు పక్కనపెట్టి ప్రభుత్వం తక్షణం దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బలవంతుడిదే రాజ్యంగా మారిన పరిస్థితుల్ని మార్చి, కబ్జాకు గురైన భూముల్ని అసలు యజమానులకు అప్పగించాలి. అప్పుడే న్యాయం గెలుస్తుంది. ప్రభుత్వంపై, ప్రజాస్వామ్యంపై జనంలో నమ్మకం నిలుస్తుంది. -
నోరూరించే రుచులు.. కిస్మిస్–అంజీరా బర్ఫీ, సందేష్ తయారీ ఇలా..
స్వీట్స్ అంటే నాలుక కోసుకునేవారు ఈ కొత్త రుచులను కూడా ప్రయత్నించండి. కిస్మిస్–అంజీరా బర్ఫీ సందేష్ కావల్సిన పదార్ధాలు అంజీరా – 4 (నానబెట్టి, ముక్కలు కట్ చేసుకుని, గుజ్జులా మిక్సీ పట్టుకోవాలి) కిస్మిస్ – పావు కప్పు (నానబెట్టి, మిక్సీ పట్టుకుని, గుజ్జు చేసుకోవాలి) కొబ్బరి పాలు – 4 టేబుల్ స్పూన్లు తేనె – 2 టేబుల్ స్పూన్లు నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు కొబ్బరి కోరు – అర కప్పు నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు తయారీ విధానం ముందుగా నేతిలో నువ్వులు, కొబ్బరి కోరు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో కిస్మిస్ గుజ్జు, అంజీరా గుజ్జు, కొబ్బరి పాలు, తేనె వేసుకుని తిప్పుతూ ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఉండలు లేదా బిట్స్లా నచ్చిన షేప్‌లో తయారు చేసుకుని సర్వ్ చేసుకోవాలి. సందేష్ కావల్సిన పదార్ధాలు క్రీమ్ మిల్క్ – రెండు లీటర్లు నిమ్మరసం – మూడు టేబుల్ స్పూన్లు పంచదార పొడి – అరకప్పు యాలకుల పొడి – పావు టీస్పూను ట్యూటీ ఫ్రూటీ – మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►ముందుగా మందపాటి గిన్నెలో పాలుపోసి మరిగించాలి. ►పాలు కాగాక నిమ్మరసం వేసి కలపాలి. ►ఇప్పుడు పాలు విరిగినట్లు అవుతాయి. వీటిని బట్టలో వడగట్టి, చల్లటి నీరుపోసి మరోసారి వడకట్టుకోవాలి. ►నీళ్లు తీసేసిన పాల మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుని పంచదార పొడి వేసి మెత్తగా కలపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని బాణలిలో వేసి తేమ పోయేంతరకు వేయించాలి. దించే ముందు యాలకులపొడి వేసి తిప్పాలి ►ఐదునిమిషాలు ఆరాక చిన్నచిన్న ఉండలుగా చేసి మధ్యలో గుంటలా వత్తుకుని ట్యూటీప్రూటీలతో గార్నిష్ చేస్తే తియ్యటి సందేష్ రెడీ. -
కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్‌ను వీడిన సందేశ్ జింగాన్
భారత ఫుట్‌బాల్ జట్టు డిఫెండర్ సందేశ్ జింగాన్ కేరళ బ్లాస్టర్స్ క్లబ్‌ను వీడాడు. ఆరేళ్లుగా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కేరళ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన అతను పరస్పర ఒప్పందం మేరకే తమ జట్టును వీడుతున్నట్లు బ్లాస్టర్స్ అధికారి ఒకరు తెలిపారు. చండీగఢ్‌కు చెందిన 26 ఏళ్ల సందేశ్ డిఫెన్స్‌లో దిట్ట. ఐఎస్ఎల్లో రెండుసార్లు (2014, 2016) కేరళను ఫైనల్‌కు చేర్చడంతో కీలకపాత్ర పోషించాడు. గాయంతో గత 2019–20 సీజన్‌కు పూర్తిగా దూరం కావడంతో కేరళ బ్లాస్టర్స్ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలమైంది. 10 జట్లు తలపడిన ఐఎస్ఎల్లో కేరళ పేలవమైన ఆటతీరుతో ఏడో స్థానంలో నిలిచింది. -
‘అర్జున’ రేసులో సందేశ్, బాలాదేవి
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా భారత ఫుట్‌బాల్ జట్టు తరఫున నిలకడగా రాణిస్తోన్న పురుషుల జట్టు డిఫెండర్ సందేశ్ జింగాన్... మహిళల జట్టు స్ట్రయికర్ బాలాదేవిలను జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున’కు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) నామినేట్ చేసింది. 2015లో జట్టులోకి వచ్చిన 25 ఏళ్ల చండీగఢ్ ప్లేయర్ సందేశ్ 36 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మణిపూర్‌కు చెందిన 30 ఏళ్ల బాలాదేవి ఇటీవల స్కాట్లాండ్కు చెందిన రేంజర్స్ ఫుట్‌బాల్ క్లబ్‌తో 18 నెలల ఒప్పందాన్ని చేసుకుంది. తద్వారా విదేశీ ప్రొఫెషనల్ లీగ్‌లో ఆడిన తొలి మహిళా భారత ఫుట్‌బాలర్‌గా గుర్తింపు పొందింది. -
సందేశ్ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
నోయిడా: తెలుగు విద్యార్థి సందేశ్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సహచర విద్యార్థులు అమన్ విర్పల్, మోంతీ రాజ్ పుట్లను శనివారం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్యాంసుందర్‌రావు, రూపల చిన్న కుమారుడు సందేశ్ ఉత్తరప్రదేశ్‌లోని అమిటి విశ్వవిద్యాలయంలో బీఎస్సీ(మెరైన్ సైన్స్) 2వ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో వివాదాల నేపథ్యంలో సందేశ్‌ను సహచర విద్యార్థులు తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. -
తుపాకీతో కాల్చి.. గొడ్డలితో నరికి..
నోయిడాలో నల్లగొండ విద్యార్థి సందేశ్ దారుణ హత్య హరియాణాకు చెందిన ఇద్దరు స్నేహితులే హంతకులు హైదరాబాద్‌కు మృతదేహం తరలింపు సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో నల్లగొండ విద్యార్థి సందేశ్ శనివారం సాయంత్రం హత్యకు గురయ్యాడు. ఇద్దరు స్నేహితులు అతన్ని పిస్టల్‌తో కాల్చి ఆపై గొడ్డలితో నరికి కిరాతకంగా హతమార్చారు. హత్యకు ప్రత్యక్ష సాక్షి, సందేశ్ రూమ్మేట్ నదీమ్ తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే సహకార బ్యాంకు ఉద్యోగి రామరాజు శ్యాంసుందర్‌రావు, రూప దంపతుల రెండో కుమారుడైన సందేశ్ (19) నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (మెరైన్ సైన్స్) రెండో సంవత్సరం చదువుతున్నాడు. మొదటి సంవత్సరం హాస్టల్లో ఉన్న సందేశ్... ద్వితీయ సంవత్సరం ఓ అపార్ట్మెంట్లో గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. పర్యాటక నిర్వహణ కోర్సు చదువుతున్న అమన్, అతని స్నేహితుడు మౌంటీలు శనివారం సాయంత్రం సందేష్ ఉంటున్న 1804 నంబర్ గదికి వెళ్లి కాలింగ్‌బెల్ కొట్టారు. సందేష్ తలుపు తెరవగానే అమన్ పిస్టల్‌తో కాల్చగా మౌంటీ గొడ్డలితో నరికాడు. అనంతరం వారు తనపైనా దాడికి యత్నించగా తప్పించుకుని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నట్లు నదీమ్ చెప్పాడు. కాల్చొద్దని సందేష్ బతిమిలాడినా అమన్ వినలేదన్నాడు. స్టేషన్ హౌస్ అధికారి జహీర్‌ఖాన్ మాట్లాడుతూ పరారీలో ఉన్న అమన్, మౌంటీలు హర్యానాలోని పానిపట్‌కు చెందినవారని చెప్పారు. సందేష్‌కు అమన్‌కు మధ్య రెండు నెలల కిందట గొడవ జరిగిందని, ఆ తర్వాత నుంచి వారిద్దరూ స్నేహితులుగానే ఉంటున్నారని... ఈలోగా హత్య జరగడం మిస్టరీగా ఉందన్నారు. సందేష్, అమన్‌ల ఫోన్‌కాల్స్ వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. కాగా, కుమారుడి హత్య విషయం తెలుసుకున్న సందేష్ తండ్రి శ్యాంసుందర్‌రావు శనివారం రాత్రి నోయిడా చేరుకున్నారు. సందేష్ మృతదేహానికి ఆదివారం మధ్యాహ్నం పోస్టుమార్టం జరిగింది. హైదరాబాద్‌లోని చాణక్యపురి కాలనీలో నివాసం ఉంటున్న శ్యాంసుందర్‌రావు సోదరుడి ఇంటికి సందేష్ మృతదేహాన్ని ఆదివారం రాత్రి తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోనే సందేష్ అంత్యక్రియలు జరపనున్నారు. -
18న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న 'ప్రభంజనం'
-
సమాజంలో మార్పు కోసం...
సమసమాజ స్థాపనే ధ్యేయంగా ముందుకు సాగిన నలుగురు యువకుల కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ప్రభంజనం’. ‘రంగం’ఫేం అజ్మల్, సందేశ్, ఆరుషి, పంచిబోర ఇందులో ప్రధాన పాత్రధారులు. భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రచార చిత్రాలను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. భాస్కరరావు మాట్లాడుతూ -‘‘ఇరవై ఏళ్ల నా ఆలోచనలకు రూపమే ఈ ‘ప్రభంజనం’. 67 ఏళ్ల స్వతంత్ర భారతంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వచ్చి మార్పులేంటి? ఆ మార్పుకు కారణమేంటి? అనే అంశాలపై నలుగురు యువకులు చేసిన పరిశోధన ఎలాంటి ఫలితాలిచ్చింది. సమాజంలో మార్పుకై వాళ్లు ఏ విధంగా ముందుకెళ్లారు అనేదే మా సినిమా కథాంశం. ఆ రోజు అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల ప్రభావం దేశంపై ఎలా ఉందో ఈ చిత్రంలో చర్చించాం. నోటుకు అమ్ముడు పోయి ఓటు వేస్తే పర్యవసానం ఎలా ఉంటుందో ఇందులో వివరించాం. అయితే ఎవర్నీ ఇందులో కించపరచలేదు’’ అని తెలిపారు. ఈ సినిమా కోసం నేను స్వరపరిచిన ‘ప్రభంజనం..’ టైటిల్‌సాంగ్‌ని నేను అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారం కోసం ఉపయోగించుకోవడం గర్వంగా ఉందని, అయితే... ఈ సినిమాకానీ, ఆ పాటగానీ ఏ పార్టీకి సంబంధించింది కాదని ఆర్పీ పట్నాయక్ చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు టి.ప్రసన్నకుమార్, నాగార్జున రెడ్డి కూడా మాట్లాడారు. -
ప్రభంజనం మూవీ ప్రెస్‌మీట్
-
ఆలోచింపజేసే సినిమా
ఓటర్లలో అవగాహన పెంచి, వారిలో ఉద్యమస్ఫూర్తిని రగిలించి, సన్మార్గంలో నడిపించడానికి కృషి చేసిన నలుగురు యువకుల కథతో తెరకెక్కిన చిత్రం ‘ప్రభంజనం’. భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అజ్మల్, సందేశ్, అరుషి, పంచిబోర ముఖ్య తారలు. సెన్సార్ కార్యక్రమాలు ముగించుకున్న ఈ చిత్రం నెల 12న లేదా 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాస్కరరావు మాట్లాడుతూ -‘‘జనం కోసం తీసిన సినిమా ఇది. 67 ఏళ్ల స్వతంత్ర భారతంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి. పజలపై వాటి ప్రభావం ఎంత బలీయంగా ఉందో తెలిపే సినిమా ఇది. అలాగని డాక్యుమెంటరీలా ఈ సినిమా ఉండదు. కమర్షియల్ హంగులన్నీ ఇందులో ఉంటాయి. నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల అద్భుతమైన ప్రతిభ ఈ సినిమాకు ప్రధాన బలాలు. ఓ వైపు ఆనందింపజేస్తూ, మరో వైపు ఆలోచింపజేసే సినిమా ఇది’’ అన్నారు. లంచగొండితనంపై ఇప్పటివరకూ చాలా సినిమాలొచ్చాయని, కానీ వాటిలో చూపించని ఎన్నో అంశాలను ఇందులో చూపించారని, ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుంది? దేశ పౌరులుగా మన బాధ్యత ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా అని ఆర్పీ పట్నాయక్ చెప్పారు. మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని అజ్మల్, సందేశ్, అరుషి ఆనందం వెలిబుచ్చారు. -
ప్రభంజనం ఆడియో ఆవిష్కరణ
-
'ప్రభంజనం' సినిమా స్టిల్స్