స్వీట్స్ అంటే నాలుక కోసుకునేవారు ఈ కొత్త రుచులను కూడా ప్రయత్నించండి.
కిస్మిస్–అంజీరా బర్ఫీ సందేష్
కావల్సిన పదార్ధాలు
అంజీరా – 4 (నానబెట్టి, ముక్కలు కట్ చేసుకుని, గుజ్జులా మిక్సీ పట్టుకోవాలి)
కిస్మిస్ – పావు కప్పు (నానబెట్టి, మిక్సీ పట్టుకుని, గుజ్జు చేసుకోవాలి)
కొబ్బరి పాలు – 4 టేబుల్ స్పూన్లు
తేనె – 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు
కొబ్బరి కోరు – అర కప్పు
నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
ముందుగా నేతిలో నువ్వులు, కొబ్బరి కోరు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో కిస్మిస్ గుజ్జు, అంజీరా గుజ్జు, కొబ్బరి పాలు, తేనె వేసుకుని తిప్పుతూ ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఉండలు లేదా బిట్స్‌లా నచ్చిన షేప్‌లో తయారు చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
సందేష్
కావల్సిన పదార్ధాలు
క్రీమ్ మిల్క్ – రెండు లీటర్లు
నిమ్మరసం – మూడు టేబుల్ స్పూన్లు
పంచదార పొడి – అరకప్పు
యాలకుల పొడి – పావు టీస్పూను
ట్యూటీ ఫ్రూటీ – మూడు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
►ముందుగా మందపాటి గిన్నెలో పాలుపోసి మరిగించాలి.
►పాలు కాగాక నిమ్మరసం వేసి కలపాలి.
►ఇప్పుడు పాలు విరిగినట్లు అవుతాయి. వీటిని బట్టలో వడగట్టి, చల్లటి నీరుపోసి మరోసారి వడకట్టుకోవాలి.
►నీళ్లు తీసేసిన పాల మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుని పంచదార పొడి వేసి మెత్తగా కలపుకోవాలి.
►ఈ మిశ్రమాన్ని బాణలిలో వేసి తేమ పోయేంతరకు వేయించాలి. దించే ముందు యాలకులపొడి వేసి తిప్పాలి
►ఐదునిమిషాలు ఆరాక చిన్నచిన్న ఉండలుగా చేసి మధ్యలో గుంటలా వత్తుకుని ట్యూటీప్రూటీలతో గార్నిష్ చేస్తే తియ్యటి సందేష్ రెడీ.
Comments
Please login to add a commentAdd a comment