Sweet Dish
-
కత్రినా వంటపై కామెంట్ చేసిన భర్త విక్కీ కౌశల్
Vicky Kaushal Reaction On Katrina Kaifs First Halwa After Wedding: బీటౌన్ కొత్త జంట కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ భార్యభర్తలుగా కొత్త జీవితాన్ని ఆరంభించిన సంగతి తెలిసిందే. డిసెంబర్9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న ఈ క్యూట్ కపుల్ ఇటీవలె ముంబై చేరుకున్నారు. ఇక పెళ్లికి ముందు వరకు తమ రిలేషన్‌షిప్‌ను అత్యంత సీక్రెట్‌గా ఉంచిన విక్ట్రీనా జంట వివాహం అనంతరం ఎంతో సంతోషంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. కాగా పెళ్లి తర్వాత అత్తగారింట్లో కత్రినా తొలిసారి వంట వండిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన భర్త విక్కీ..ఇప్పటివరకు తిన్నవాటిలో బెస్ట్ హల్వా ఇదేనంటూ శ్రీమతిపై ప్రశంసలు కురిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. -
కొత్త పెళ్లికూతురు కత్రినా వండిన తొలి వంట ఏంటో తెలుసా?
Katrina Kaif Makes Her First Halwa After Wedding With Vicky Kaushal: కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలిన కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. డిసెంబర్9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇక వివాహం అనంతరం అత్తగారింట్లో వధువు తొలిసారిగా తన చేత్తో ఏదైనా తీపి వంటకం చేసే సాంప్రదాయం గురించి తెలిసిందే. ఈ ఆచారాన్ని కత్రానా కూడా పాటించింది. చదవండి: మిస్ యూనివర్స్-2021 ఈవెంట్లో బాలీవుడ్ నటికి అరుదైన గుర్తింపు పంజాబీ కోడలిగా అడుగుపెట్టిన అనంతరం తొలిసారిగా కత్రినా హల్వా వండింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..మైనే బనాయా(నేను చేశాను)అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. స్టార్ హీరోయిన్ అయినా చక్కగా ఆచారాలను పాటిస్తుంది అంటూ కత్రినాపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: ‘పుష్ప’మూవీ రివ్యూ -
నోరూరించే రుచులు.. కిస్మిస్–అంజీరా బర్ఫీ, సందేష్ తయారీ ఇలా..
స్వీట్స్ అంటే నాలుక కోసుకునేవారు ఈ కొత్త రుచులను కూడా ప్రయత్నించండి. కిస్మిస్–అంజీరా బర్ఫీ సందేష్ కావల్సిన పదార్ధాలు అంజీరా – 4 (నానబెట్టి, ముక్కలు కట్ చేసుకుని, గుజ్జులా మిక్సీ పట్టుకోవాలి) కిస్మిస్ – పావు కప్పు (నానబెట్టి, మిక్సీ పట్టుకుని, గుజ్జు చేసుకోవాలి) కొబ్బరి పాలు – 4 టేబుల్ స్పూన్లు తేనె – 2 టేబుల్ స్పూన్లు నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు కొబ్బరి కోరు – అర కప్పు నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు తయారీ విధానం ముందుగా నేతిలో నువ్వులు, కొబ్బరి కోరు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో కిస్మిస్ గుజ్జు, అంజీరా గుజ్జు, కొబ్బరి పాలు, తేనె వేసుకుని తిప్పుతూ ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఉండలు లేదా బిట్స్లా నచ్చిన షేప్‌లో తయారు చేసుకుని సర్వ్ చేసుకోవాలి. సందేష్ కావల్సిన పదార్ధాలు క్రీమ్ మిల్క్ – రెండు లీటర్లు నిమ్మరసం – మూడు టేబుల్ స్పూన్లు పంచదార పొడి – అరకప్పు యాలకుల పొడి – పావు టీస్పూను ట్యూటీ ఫ్రూటీ – మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►ముందుగా మందపాటి గిన్నెలో పాలుపోసి మరిగించాలి. ►పాలు కాగాక నిమ్మరసం వేసి కలపాలి. ►ఇప్పుడు పాలు విరిగినట్లు అవుతాయి. వీటిని బట్టలో వడగట్టి, చల్లటి నీరుపోసి మరోసారి వడకట్టుకోవాలి. ►నీళ్లు తీసేసిన పాల మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుని పంచదార పొడి వేసి మెత్తగా కలపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని బాణలిలో వేసి తేమ పోయేంతరకు వేయించాలి. దించే ముందు యాలకులపొడి వేసి తిప్పాలి ►ఐదునిమిషాలు ఆరాక చిన్నచిన్న ఉండలుగా చేసి మధ్యలో గుంటలా వత్తుకుని ట్యూటీప్రూటీలతో గార్నిష్ చేస్తే తియ్యటి సందేష్ రెడీ. -
Diwali Special 2021: ఘుమఘుమలాడే బనానా బటర్ బిట్స్, చాక్లెట్ పేడా తయారీ..
దీపాలవళి పండుగ వేళ ఈ వెరైటీ రుచులతో ఇంటి అతిధులను మరింత ఆనందపరచండి. బనానా బటర్ బిట్స్ కావలసిన పదార్ధాలు అరటిపండ్లు – 2 (గుండ్రంగా ముక్కలు కట్ చేసుకోవాలి) పీనట్ బటర్ – పావు కప్పు బాదం పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు నువ్వులు (వేయించినవి) – అర టేబుల్ స్పూన్ చాక్లెట్ చిప్స్ – పావు కప్పు, కొబ్బరి నూనె – 1 టీ స్పూన్ తయారీ విధానం ముందుగా పీనట్ బటర్, బాదం పౌడర్, నువ్వులు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చాక్లెట్ చిప్స్, కొబ్బరి నూనె ఒక బౌల్లో వేసుకుని ఓవెన్లో కొన్ని సెకన్స్ పాటు మెల్ట్ చేసుకోవాలి. మరోవైపు ప్రతి అరటిపండు ముక్కపైన అర టీ స్పూన్ బటర్ మిశ్రమాన్ని పెట్టి.. దానిపైన మరో అరటిపండు ముక్కను ఉంచి.. ఆ బిట్స్‌ని ఒకొక్కటిగా మెల్ట్ అయిన చాక్లెట్ మిశ్రమంలో సగానికి ముంచి పెట్టుకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత చాక్లెట్ మిశ్రమం గట్టిపడ్డాక సర్వ్ చేసుకోవాలి. చాక్లెట్ పేడా కావలసిన పదార్ధాలు మిల్క్ పౌడర్ – 1 కప్పు పంచదార చిక్కటి పాలు – పావు కప్పు చొప్పున నెయ్యి కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్ల చొప్పున డ్రై ఫ్రూట్స్ ముక్కలు – గార్నిష్‌కి సరిపడా తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, నాన్ స్టిక్ పాత్రలో మిల్క్ పౌడర్ వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. రెండు నిమిషాల తర్వాత పంచదార, చిక్కటి పాలు, కోకో పౌడర్ వేసుకుని గరిటెతో తిప్పుతూనే ఉండాలి. దగ్గర పడుతున్న సమయంలో నెయ్యి వేసుకుని.. గరిటెతో కలుపుతూనే ఉండాలి. దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్లోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని చల్లారనిచ్చి.. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నచ్చిన షేప్‌లో డిజైన్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ ముక్కలు పైన గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. -
నోరూరించే స్వీట్ పాన్ లడ్డూ.. ఇలా తయారు చేసుకోవాలి..
తమలపాకులు, కొబ్బరి తురుము, నెయ్యి.. లతో స్వీట్ పాన్ లడ్డు ఏవిధంగా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం.. కావలసిన పదార్థాలు: ►తమలపాకులు – 15 సుమారుగా ►కస్టర్డ్ మిల్క్ – పావు కప్పు ►గ్రీన్ ఫుడ్ కలర్ – కొద్దిగా ►నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు ►కొబ్బరి కోరు – అర కప్పు+3 టేబుల్ స్పూన్లు ►కొబ్బరి లౌజు – పావు కప్పు (ముందుగా సిద్ధం చేసి పక్కనపెట్టుకోవాలి) తయారీ విధానం: ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని అందులో తమలపాకులు, కస్టర్డ్ మిల్క్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అందులో గ్రీన్ ఫుడ్ కలర్ చేసి బాగా కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని పాన్‌లో నెయ్యి వేసుకుని.. అర కప్పు కొబ్బరికోరు దోరగా వేయించుకోవాలి. అందులో తమలపాకు జ్యూస్ వేసుకుని తిప్పుతూ బాగా కలపాలి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. చల్లారనివ్వాలి. ఆపైన గ్రీన్ కలర్ కొబ్బరి–తమలపాకుల మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని.. మధ్యలో కొద్దికొద్దిగా కొబ్బరి లౌజు ఉంచి, ఉండల్లా చేసుకోవాలి. మిగిలిన 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి కోరు బాల్స్‌కి పట్టించి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చదవండి: భలే రుచిగా బీట్రూట్ రొయ్యల కబాబ్స్.. ఎలా చేయాలంటే.. -
కస్టర్డ్ కలపండి.... టేస్ట్ పెంచండి..!
పాలు, పంచదార, గుడ్డు కలిపి చేసే సాస్... కస్టర్డ్. దీనిని స్వీట్ డిష్‌ల మీద రంగరించి, ఆరగించి చూడండి. అది మీకెంతో ‘ఇష్ట'మైన టేస్ట్ అయిపోతుంది! మళ్లెప్పుడైనా స్వీట్ ఫుడ్ మీదకు మనసు మళ్లితే కచ్చితంగా మీకు కస్టర్డ్ గుర్తుకొచ్చి తీరుతుంది. ప్రతి ఒక్కరూ ఆస్వాదించవలసిన మస్ట్ ఈట్... కస్టర్డ్ డిష్లే ఇవన్నీ. కస్టర్డ్ ఫ్రూట్ టార్ట్స్ కావలసినవి: మైదా - 400 గ్రా, బటర్ - 150 గ్రా, చక్కెర - 150 గ్రా, కోడిగుడ్లు - 2, పాలు - అర లీటరు, కస్టర్డ్ పౌడర్ - 2 చెంచాలు, వెనిల్లా ఎసెన్స్ - అర చెంచా, ఉప్పు - తగినంత, పచ్చద్రాక్షలు- నల్లద్రాక్షలు - స్ట్రాబెర్రీస్ - కావలసినన్ని తయారీ విధానం: మైదాపిండిలో బటర్, సగం చక్కెర, కోడిగుడ్ల సొన, చిటికెడు ఉప్పు వేసి కేక్ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని కప్‌కేక్ మౌల్డ్స్‌లో వేసి బేక్ చేస్తే ఫొటోలో చూపిన ఆకారంలో వస్తాయి. అవన్ లేకపోతే చిన్న చిన్న కప్స్‌లో పిండి వేసి, కేక్ గిన్నెలో నీళ్లు పోసి, అందులో కప్స్ పెట్టి ఉడికించుకోవచ్చు. తర్వాత నాలుగు చెంచాల చల్లని పాలలో కస్టర్డ్ పౌడర్ కలపాలి. మిగతా పాలలో మిగిలిన చక్కెర వేసి స్టౌమీద పెట్టాలి. మరిగాక కస్టర్డ్ కలిపిన పాలను వేయాలి. చిక్కగా అయ్యాక దించేసి చల్లార్చాలి. ఆపైన ఈ మిశ్రమాన్ని బేక్ చేసుకున్న మైదా టార్ట్స్‌లో వేసి, పైన ఫ్రూట్స్ పెట్టి సర్వ్ చేయాలి. కస్టర్డ్ క్రీమ్ బిస్కట్స్ కావలసినవి: మైదా - 100 గ్రా, బటర్ - 100 గ్రా, చక్కెర - 50 గ్రా, కస్టర్డ్ పౌడర్ - 50 గ్రా, వెనిల్లా ఎసెన్స్ - 1 చెంచా ఫిల్లింగ్ కోసం: ఐసింగ్ షుగర్ - 150 గ్రా, బటర్ 75 గ్రా తయారీ: చక్కెరను మెత్తని పొడిలా చేసుకోవాలి. ఓ బౌల్లో మైదా, చక్కెర పొడి, బటర్, కస్టర్డ్ పౌడర్, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. బటర్ వల్ల వచ్చే కన్సిస్టెన్సీ సరిపోతుంది. లేదంటే కొద్దిగా పాలు పోసి కలుపుకోవచ్చు. ఇప్పుడీ మిశ్రమాన్ని బిస్కట్ మౌల్డ్స్‌లో వేసి అవన్లో బేక్ చేసుకోవాలి. అవన్ లేనివాళ్లు గుండ్రంగా కట్ చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత ఐసింగ్ షుగర్‌లో బటర్ వేసి కలిపి, ఈ క్రీమ్‌ని రెండు బిస్కట్ల మధ్యలో పెట్టి ఒత్తాలి. మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ కావలసినవి: పాలు - 1 లీటరు, కస్టర్డ్ పౌడర్ - 4 చెంచాలు, చక్కెర - ఒక కప్పు, యాపిల్ - 1, మామిడిపండు - 1, తెల్లద్రాక్షలు - 10, నల్లద్రాక్షలు - 10, దానిమ్మ గింజలు - పావుకప్పు, సపోటాలు - 3, అరటిపండు - 1, డ్రైఫ్రూట్స్ - కావలసినన్ని తయారీ: పావుకప్పు చల్లని పాలలో కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. మిగతా పాలలో చక్కెర వేసి స్టౌ మీద పెట్టాలి. చక్కెర కరిగి, పాలు కూడా బాగా మరిగాక కస్టర్డ్ కలిపిన పాలు వేసి, చిక్కగా అయ్యేవరకూ సన్నని మంటమీద ఉడికించాలి. తర్వాత దించేసి చల్లార బెట్టాలి. ద్రాక్షపండ్లను తప్ప మిగతా అన్ని పండ్లనూ చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. చివరగా డ్రైఫ్రూట్స్‌తో పాటు మిగతా అన్ని పండ్లనూ పాలలో వేసి కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లగా అయ్యాక సర్వ్ చేయాలి. బేక్డ్ చాక్లెట్ కస్టర్డ్ కావలసినవి: కస్టర్డ్ పౌడర్ - పావుకప్పు, పాలు - 1 కప్పు, చక్కెర - అరకప్పు, కోకోపౌడర్ - అరకప్పు, దాల్చినచెక్క పొడి - 1 చెంచా, ఉప్పు - చిటికెడు, కోడిగుడ్లు - 2 తయారీ: పాలు చల్లగా ఉన్నప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. తర్వాత స్టౌమీద పెట్టి చిక్కగా అయ్యాక దించేసుకోవాలి. కోడిగుడ్డు సొనలో చక్కెర, కోకో పౌడర్, ఉప్పు, దాల్చినచెక్క పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కస్టర్డ్ మిశ్రమంలో వేసి మిక్స్ చేయాలి. తర్వాత అవన్లో బేక్ చేసుకోవాలి. పంప్కిన్ కస్టర్డ్ పై కావలసినవి: గుమ్మడి గుజ్జు - ఒకటిన్నర కప్పు, చక్కెర - ముప్పావు కప్పు, కోడిగుడ్లు - 2, క్రీమ్ - 1 కప్పు, పాలు - అరకప్పు, కస్టర్డ్ పౌడర్, పావుకప్పు, దాల్చినచెక్క పొడి - 1 చెంచా, శొంఠి అల్లం పొడి - అర చెంచా, ఉప్పు - అర చెంచా తయారీ: ఓ బౌల్లో కోడిగుడ్ల సొన, క్రీమ్, పాలు, కస్టర్డ్ పౌడర్ వేసి బాగా బీట్ చేయాలి. గుమ్మడి గుజ్జులో చక్కెర కలిపి స్టౌమీద పెట్టాలి. చక్కెర కరిగి పాకం లాగా అవుతున్నప్పుడు దించేసుకుని ఉప్పు, దాల్చినచెక్క పొడి, శొంఠి పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత కోడిగుడ్డు-పాల మిశ్రమంలో వేసి కలపాలి. తర్వాత ఈ మొత్తాన్నీ కేక్ గిన్నెలో వేసి బేక్ చేసుకోవాలి. లేదంటే కేక్ గిన్నెలో స్టౌమీద కూడా వండుకోవచ్చు.