దీపాలవళి పండుగ వేళ ఈ వెరైటీ రుచులతో ఇంటి అతిధులను మరింత ఆనందపరచండి.
బనానా బటర్ బిట్స్
కావలసిన పదార్ధాలు
అరటిపండ్లు – 2 (గుండ్రంగా ముక్కలు కట్ చేసుకోవాలి)
పీనట్ బటర్ – పావు కప్పు
బాదం పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు
నువ్వులు (వేయించినవి) – అర టేబుల్ స్పూన్
చాక్లెట్ చిప్స్ – పావు కప్పు, కొబ్బరి నూనె – 1 టీ స్పూన్
తయారీ విధానం
ముందుగా పీనట్ బటర్, బాదం పౌడర్, నువ్వులు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చాక్లెట్ చిప్స్, కొబ్బరి నూనె ఒక బౌల్‌లో వేసుకుని ఓవెన్‌లో కొన్ని సెకన్స్ పాటు మెల్ట్ చేసుకోవాలి. మరోవైపు ప్రతి అరటిపండు ముక్కపైన అర టీ స్పూన్ బటర్ మిశ్రమాన్ని పెట్టి.. దానిపైన మరో అరటిపండు ముక్కను ఉంచి.. ఆ బిట్స్‌ని ఒకొక్కటిగా మెల్ట్ అయిన చాక్లెట్ మిశ్రమంలో సగానికి ముంచి పెట్టుకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత చాక్లెట్ మిశ్రమం గట్టిపడ్డాక సర్వ్ చేసుకోవాలి.
చాక్లెట్ పేడా
కావలసిన పదార్ధాలు
మిల్క్ పౌడర్ – 1 కప్పు
పంచదార
చిక్కటి పాలు – పావు కప్పు చొప్పున
నెయ్యి
కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్ల చొప్పున
డ్రై ఫ్రూట్స్ ముక్కలు – గార్నిష్‌కి సరిపడా
తయారీ విధానం
ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, నాన్ స్టిక్ పాత్రలో మిల్క్ పౌడర్ వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. రెండు నిమిషాల తర్వాత పంచదార, చిక్కటి పాలు, కోకో పౌడర్ వేసుకుని గరిటెతో తిప్పుతూనే ఉండాలి. దగ్గర పడుతున్న సమయంలో నెయ్యి వేసుకుని.. గరిటెతో కలుపుతూనే ఉండాలి. దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్‌లోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని చల్లారనిచ్చి.. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నచ్చిన షేప్‌లో డిజైన్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ ముక్కలు పైన గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment