
తమలపాకులు, కొబ్బరి తురుము, నెయ్యి.. లతో స్వీట్ పాన్ లడ్డు ఏవిధంగా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు:
►తమలపాకులు – 15 సుమారుగా
►కస్టర్డ్ మిల్క్ – పావు కప్పు
►గ్రీన్ ఫుడ్ కలర్ – కొద్దిగా
►నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
►కొబ్బరి కోరు – అర కప్పు+3 టేబుల్ స్పూన్లు
►కొబ్బరి లౌజు – పావు కప్పు (ముందుగా సిద్ధం చేసి పక్కనపెట్టుకోవాలి)
తయారీ విధానం:
ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని అందులో తమలపాకులు, కస్టర్డ్ మిల్క్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అందులో గ్రీన్ ఫుడ్ కలర్ చేసి బాగా కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని పాన్‌లో నెయ్యి వేసుకుని.. అర కప్పు కొబ్బరికోరు దోరగా వేయించుకోవాలి. అందులో తమలపాకు జ్యూస్ వేసుకుని తిప్పుతూ బాగా కలపాలి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. చల్లారనివ్వాలి. ఆపైన గ్రీన్ కలర్ కొబ్బరి–తమలపాకుల మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని.. మధ్యలో కొద్దికొద్దిగా కొబ్బరి లౌజు ఉంచి, ఉండల్లా చేసుకోవాలి. మిగిలిన 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి కోరు బాల్స్‌కి పట్టించి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
చదవండి: భలే రుచిగా బీట్‌రూట్ రొయ్యల కబాబ్స్.. ఎలా చేయాలంటే..
Comments
Please login to add a commentAdd a comment