Katrina Kaif: cooks Sweet for her in-laws after her wedding with actor Vicky Kaushal - Sakshi
Sakshi News home page

Katrina Kaif: పంజాబీ కోడలిగా కత్రినా.. తొలిసారి ఏం వండిందో తెలుసా?

Published Fri, Dec 17 2021 2:09 PM | Last Updated on Fri, Dec 17 2021 3:23 PM

Katrina Kaif Makes Her First Halwa After Wedding With Vicky Kaushal - Sakshi

Katrina Kaif Makes Her First Halwa After Wedding With Vicky Kaushal: కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలిన కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. డిసెంబర్‌9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇక వివాహం అనంతరం అత్తగారింట్లో వధువు తొలిసారిగా తన చేత్తో ఏదైనా తీపి వంటకం  చేసే సాంప్రదాయం గురించి తెలిసిందే. ఈ ఆచారాన్ని కత్రానా కూడా పాటించింది.

చదవండి: మిస్‌ యూనివర్స్‌-2021 ఈవెంట్‌లో బాలీవుడ్‌ నటికి అరుదైన గుర్తింపు

పంజాబీ కోడలిగా అడుగుపెట్టిన అనంతరం తొలిసారిగా కత్రినా హల్వా వండింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ..మైనే బనాయా(నేను చేశాను)అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. స్టార్‌ హీరోయిన్‌ అయినా చక్కగా ఆచారాలను పాటిస్తుంది అంటూ క​త్రినాపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

చదవండి: ‘పుష్ప’మూవీ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement