Ritual
-
‘నన్ను టార్గెట్ చేస్తున్నారు’.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: కాంగ్రెస్ ప్రభుత్వం, తనపై కొందరు తాంత్రిక పూజలు జరుపుతున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ కాంగ్రెస్ ప్రభుత్వం, నాపై కేరళలో తాంత్రిక పూజలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో, ఎప్పటి నుంచి ఆ పూజలు చేస్తున్నారలో నాకు తెలుస్తునే ఉంది. ఈ పూజలను కొందరు నాతో పాటు సీఎం సిద్ధరామయ్యపై కూడా చేయిస్తున్నారు. కేరళలోని రాజ రాజేశ్వరీ ఆలయంలో శత్రువులను తొలగించటం కోసం కొందరు ‘‘శత్రు భైరవీ యాగం’’ (అగ్నిబలి) పేరిట పూజలు చేస్తున్నారు. పంచబలి(ఐదు వస్తువులను బలి ఇవ్వటం) చేస్తున్నారు. దీని కోసం ఎర్రమేక, 21 బర్రెలు, మూడు నల్ల మేకలు, ఐదు పందులను బలి ఇచ్చారు. దీని ఫలితంగా అగ్ని బలి జరుగుతుంది. ఫలితంగా శత్రువులు తొలిగిపోతారని నమ్మకం ఉంది’’ అని డీకే శివ కుమార్ అన్నారు.ఈ పూజలు ఇంకా కొనసాగుతున్నాయని డీకే తెలిపారు. ఆ పూజలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందుతోందని అన్నారు. అయితే ఈ పూజలు ఎవరూ జరిపిస్తున్నారన్న విషయాన్నిమాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ, ఓ ప్రతిపక్ష నాయకుడి ఆదేశాల మేరకు ఈ తాంత్రిక పూజులు జరుగుతున్నాయని తెలిపారు.‘‘అలా చేయటం వారి నమ్మకం. దాన్ని వారికే వదిలేస్తున్నా. వారు ఏం చేయాలకుంటే అది చేసుకోవచ్చు. వాళ్ల పూజల నుంచి మమ్మల్ని రక్షించే శక్తి మా వెంటే ఉంది’’ అని డీకే శివకుమార్ అన్నారు. -
అయోధ్యలో తొలి శ్రీరామ నవమి వేడుకలు..ప్రత్యేకతలు ఏంటంటే..!
అయోధ్యలో ప్రారంభమైన కొత్త రామాలయం తొలి శ్రీరామ నవమి వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత జరగుతున్న తొలి శ్రీరామ నవమి వేడుకలు ఇవే కావడంతో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయి. అవేంటో సవివరంగా చూద్దామా..! శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు శ్రీరాముడిని దర్శించుకునేలా రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే దర్శనం, హారతి సమయానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. శ్రీరామనవమి సందర్భంగా భక్తుల కోసం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీరాముడిని దర్శించుకునేలా అనుమతించింది. సుమారు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలోని రామ మందిరంలో జరుగుతున్న తొలి శ్రీరామనవమి వేడుకలు ఇవి. అందువల్ల ఈ రోజున వీఐపీ ప్రత్యేక దర్శనాలు నిషేధించారు. మళ్లీ ఈ నెల ఏప్రిల్ 20వ తేదీ నుంచి వీఐపీ పాసులు అందుబాటులోకి రానున్నాయి. దర్శన వేళలు.. ఏప్రిల్ 17 శ్రీరామనవమి రోజున భక్తులకు శ్రీరాముడి దర్శనం కోసం 19 గంటల పాటు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతారు. నాలుగు భోగ్ నైవేద్యాల సమయంలో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే తెర మూసివేయనున్నారు. విశిష్ట అతిథులు ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే దర్శనం కోసం సందర్శించాలని అయోధ్య రామ మందిర ట్రస్ట్ వెల్లడించింది. బాల రాముడికి సూర్యుడి తిలకం.. శ్రీరామ నమమి రోజున అయోధ్యలో అద్భుతమైన దృశ్యం కనువిందు చేయనుంది. బాలరాముడి నుదిటి మీద శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడి కిరణాలు నుదిట మీద పడే విధంగా ఏర్పాటు చేశారు. పురాణల ప్రకారం..చైత్రమాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. అందువల్ల మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు బాల రాముడి నుదుటి మీద సూర్యకిరణాలతో తిలకం పడేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకను ఇంట్లో ఉండి తిలకించే విధంగా ప్రత్యక్ష ప్రసారమయ్యేలా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసింది. అంతేగాదు అయోధ్య నగరం అంతటా దాదాపు వంద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లపై శ్రీరామ జన్మోత్సవ వేడుకలు ప్రసారం కానున్నాయి. ట్రస్ట్ సోషల్ మీడియా ఖాతాలో ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఉంటాయి. ఏకంగా లక్ష కేజీల లడ్డూలు.. శ్రీరామనవమి రోజు రాముల వారి కోసం 1,11,111 కేజీల లడ్డూలను అయోధ్య రామ మందిరానికి పంపించననుంది దేవర్హ హన్స్ బాబా ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఈ లడ్డూలను ప్రసాదంగా రామ మందిరానికి పంపిస్తుంది. ఈ విషయాన్ని ట్రస్ట్ సభ్యుడు అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఈ లడ్డూలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. ఈ ట్రస్ట్ జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ట వేడుకకు 40 వేల కేజీల లడ్డూలు ఇచ్చింది. రామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి సుమారు 25 నుంచి 35 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. (చదవండి: నవమి రోజే సీతారాముల కళ్యాణం చేస్తారు ఎందుకు..?) -
కన్నడ కాంతార కాదు.. కేరళ కలియట్టం
-
షాకింగ్ ఘటన: మగ సంతానం కోసమని.. భార్యకు అందరి ముందు..
పుణే: మగ బిడ్డ కోసం, డబ్బుపై ఆశతో ఆ భర్త చేసిన పని దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. వ్యాపారంలో లాభాలు రావాలన్నా.. ఇంట్లో శాంతి నెలకొనాలన్నా.. అన్నింటికి మించి మగ సంతానం కలగాలన్నా తాను చెప్పినట్లు చేయాలని ఓ ఫేక్ బాబా సలహా ఇవ్వడంతో.. భార్యను అందరి ముందు దుస్తులు లేకుండా స్నానం చేయించాడు సదరు భర్త. మహారాష్ట్ర పుణేలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. పుణేకి చెందిన ఆమె భర్త కుటుంబం 2013 నుంచి అదనపు కట్నం, మగ బిడ్డ కోసం వేధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె చేత క్షుద్ర పూజలు కూడా చేయించింది. ఈ మధ్య మౌలానా బాబా జామదార్ అనే వ్యక్తి ఆమె భర్తతో జలపాతం కింద అంతా చూస్తుండగా ఒంటిపై బట్టలు లేకుండా స్నానం చేయిస్తే.. మగ సంతానం కలుగుతుందని, అప్పులు సైతం తీరతాయని సలహా ఇచ్చాడు. దీంతో ఆ మూర్ఖపు భర్త, అతని కుటుంబం బాధితురాలని రాయ్‌ఘడ్‌కి తీసుకెళ్లి.. అక్కడి జలపాతం కింద ఆమె చేత బలవంతంగా ఫేక్ బాబా చెప్పినట్టు స్నానం చేయించింది. అక్కడ చాలామందే ఉన్నా.. ఎవరూ అడ్డుకునే యత్నం చేయలేదు. చివరికి.. బాధితురాలే ధైర్యం చేసి భారతీ విద్యాపీఠ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్త, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి.. పరారీలో ఉన్న ఫేక్ బాబా కోసం గాలింపు చేపట్టారు. ఇదీ చదవండి: రూపాయి తెచ్చిన పంచాయితీ ! -
వింత ఆచారం: వరుడు వధువుగా.. వధువు వరుడిగా..
దొనకొండ(ప్రకాశం జిల్లా): పెళ్లి తంతులో వరుడు వధువుగా, వధువు వరుడిగా వేషాలు మార్చుకునే వింత ఆచారాన్ని ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఇండ్లచెరువు, దేశిరెడ్డిపల్లి గ్రామాల్లోని గుమ్మా కుటుంబం వారు పాటిస్తున్నారు. తమ ఇళ్లలో వివాహం జరిగితే.. తాము కొలిచే ఎల్లమ్మ దేవత ఆచారం ప్రకారం వివాహమైన మరుసటి రోజు వధువు వరుని వేషం, వరుడు వధువు వేషం వేసి నాగుల పుట్ట దగ్గరకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. బొల్లావు సంబరాలతో వధూవరులు గ్రామ పురవీధుల్లో తప్పెట్లు, కొమ్ము ఊదుకుంటూ ఊరేగింపుగా పుట్ట దగ్గరికి వెళతారు. ఇండ్లచెరువుకు చెందిన గుమ్మా వంశానికి చెందిన వారు వివాహ సందర్భంగా శనివారం ఇలా వేషాలు మార్చుకుని మొక్కులు తీర్చుకున్నారు. -
కొత్త పెళ్లికూతురు కత్రినా వండిన తొలి వంట ఏంటో తెలుసా?
Katrina Kaif Makes Her First Halwa After Wedding With Vicky Kaushal: కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలిన కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. డిసెంబర్9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇక వివాహం అనంతరం అత్తగారింట్లో వధువు తొలిసారిగా తన చేత్తో ఏదైనా తీపి వంటకం చేసే సాంప్రదాయం గురించి తెలిసిందే. ఈ ఆచారాన్ని కత్రానా కూడా పాటించింది. చదవండి: మిస్ యూనివర్స్-2021 ఈవెంట్లో బాలీవుడ్ నటికి అరుదైన గుర్తింపు పంజాబీ కోడలిగా అడుగుపెట్టిన అనంతరం తొలిసారిగా కత్రినా హల్వా వండింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..మైనే బనాయా(నేను చేశాను)అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. స్టార్ హీరోయిన్ అయినా చక్కగా ఆచారాలను పాటిస్తుంది అంటూ కత్రినాపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: ‘పుష్ప’మూవీ రివ్యూ -
కొరడా దెబ్బలు తిన్న సీఎం.. ఎందుకో తెలుసా?
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు. దీపావళి ఉత్సవాల్లో భాగంగా గోవర్థన పూజ సందర్భంగా కొరడా దెబ్బలు తింటే మంచిదని స్థానికుల నమ్మకం. ఇందులో భాగం గానే రాష్ట్ర సీఎం కూడా కొరడా దెబ్బలు తిని అక్కడి ఆలయ సంప్రదాయాన్ని పాటించారు. ఈ వీడియోను భూపేష్ స్వయంగా ట్విటర్లో షేర్ చేశారు. ఒక వ్యక్తి సీఎం చేతులపై కొరడాతో కొట్టడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. శుక్రవారం రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలోని ఒక గ్రామంలో గోవర్ధన్ పూజ పండుగ వేడుకలకు హాజరైన సీఎం సంప్రదాయం ప్రకారం 'సొంట' (గడ్డితో చేసిన కొరడా)తో కొరడాతో కొట్టించుకుని ఆ బాధను భరించడం విశేషం. ప్రజల సంక్షేమం కోసం ఇలా చేశానని, తద్వారా సకల శుభాలు కలుగుతాయని ఆయన చెప్పారు. గోవు ఎంత సుభిక్షంగా ఉంటే ప్రజలు అంత అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో గోవర్ధన్ పూజకు ఆదరణ ఉంటుందని సీఎం చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రతి ఏటా గోవర్ధన్ పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ పూజలో భాగంగా గోవుకు విశిష్టమైన పూజలు చేస్తారు. అందులో భాగంగా కొంతమంది కొరడాతో దెబ్బలు కొడుతుంటారు. ఇలా కొరడా దెబ్బలు తింటే తమ అభివృద్ధికి అడ్డంకులన్నీ తొలగిపోతాయని రాష్ట్ర ప్రజల నమ్మకం. ఈ క్రమంలోనే సీఎం భూపేష్ బఘేల్ కూడా కొరడా దెబ్బలు తిన్నారు. గ్రామ పెద్ద భరోసా ఠాకూర్ జంజ్గిరిలో ఈ సంప్రదాయాన్ని నిర్వహించి, ప్రజలను వారి కోరిక మేరకు కొరడాతో కొట్టేవారనీ, అతని మరణం తరువాత, అతని కుమారుడు బీరేంద్ర ఠాకూర్ అతని వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నాడని అధికారులు తెలిపారు. प्रदेश की मंगल कामना और शुभ हेतु आज जंजगिरी में सोटा प्रहार सहने की परंपरा निभाई। सभी विघ्नों का नाश हो। pic.twitter.com/bHQNFIFzGv — Bhupesh Baghel (@bhupeshbaghel) November 5, 2021 -
ఇదేం విడ్డూరం: మంచి భర్త రావాలంటే గుండు చేయించుకోవాల్సిందే
కేప్‌టౌన్: వివాహం అంటే ఇద్దరు వ్యక్తులను మాత్రమే కాదు.. రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తుంది. వివాహం అంటే ఓ ప్రమాణం. జీవితాంతం నీ చేతిని విడవను.. అన్ని వేళలా నీకు తోడుగా ఉంటానని హామీ ఇవ్వడం. ప్రపంచవ్యాప్తంగా పెళ్లి అంటే ఇదే భావన కనిపిస్తుంది. విశ్వవ్యాప్తంగా వివాహ బంధానికి ఒక్కటే అర్థం ఉన్నప్పటికి.. పెళ్లి తంతు మాత్రం ప్రాంతాలను బట్టి మారుతుంటుంది. వివిధ దేశాల్లో.. వేర్వేరు సమూహాల్లో వేర్వేరు ఆచారాలను పాటిస్తారు. వీటిలో కొన్ని చాలా వింతగా ఉంటాయి. పాటించడం కూడా చాలా కష్టం. అలాంటి ఓ వింత ఆచారం గురించి ఇప్పుడు మీరు చదవబోతున్నారు.ఆ వివరాలు.. మంచి భర్త రావాలంటే గుండు చేయించుకోవాలి పెళ్లి అనగానే ఎక్కువ ప్రాధాన్యత అలంకరణకే ఇస్తారు. మరీ ముఖ్యంగా కేశాలంకరణకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక జుట్టు అంటే ఆడవారికి కాస్త ఎక్కువ అభిమానం. ఎంతో జాగ్రత్తగా కేశాలను సంరక్షించుకుంటారు. అంత జాగ్రత్తగా చూసుకునే జుట్టును పెళ్లి కోసం కత్తిరించడం.. గుండు చేయించడం వంటివి చేయాలంటే.. వినడానికే చాలా బాధగా ఉంది కదా. కానీ దక్షిణాఫ్రికాకు చెందిన కొన్ని తెగల్లో ఆడవారు పెళ్లి తర్వత జుట్టు పెంచడానికి వీల్లేదు. వివాహానికి ముందే కత్తిరించడం, గుండు చేయించుకోవడం చేయాలి. (చదవండి: అరుదైన వ్యాధి: వృద్ధురాలిగా జన్మించిన చిన్నారి) బొరానా తెగ వాసుల వింత ఆచారం దక్షిణాఫ్రికాలోని ఇథోపియా, సోమాలియా దేశాల్లో స్థిరపడిన బొరానా తెగ ప్రజల్లో ఈ వింత ఆచారం ఉంది. ఈ తెగ ప్రజలు మొత్తం 500 మంది ఉంటారు. పితృస్వామ్య వ్యవస్థ. గ్రామం, జంతువులు, పరివారం బాధ్యతలన్నింటిని పురుషులే చూసుకుంటారు. ఆడవారు కేవలం ఇంటిని అలంకరించడం.. సంప్రదాయాలను పాటించడం మాత్రమే ఆడవారి బాధ్యత. (చదవండి: రివర్స్ జూ: బోనులో మనం.. స్వేచ్ఛగా సింహాలు) ఎంత ఎక్కువ జుట్టు కత్తిరిస్తే.. అంత మంచి భర్త ఇక ఈ తెగలో ఉన్న వింత ఆచారం ఏంటంటే.. పెళ్లికి ముందు వరకు మాత్రమే ఆడపిల్లలకు జుట్టు పెంచుకునే అవకాశం కల్పిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయంటే.. ఇకఅమ్మాయిలు వారి జుట్టును కత్తిరించుకోవాల్సిందే. ఇదేం విడ్డూరం అంటే.. మంచి భర్త కోసం ఇలా చేయక తప్పదంటారు ఇక్కడి ప్రజలు. ఎంత ఎక్కువ జుట్టు కత్తిరించుకుంటే అంత మంచి వరుడు దొరుకుతాడని.. ఏకంగా గుండు చేయించుకుంటే.. వారికి మంచి భర్త, అత్తింటి వారు లభిస్తారని బొరానా ప్రజల విశ్వాసం. అందుకే ఇక్కడ పెళ్లైన ఆడవారు గుండుతో.. లేదంటే పొట్టి జుట్టుతో దర్శనమిస్తారు. (చదవండి: కొన్ని క్షణాలపాటే నిల్చుంది.. క్లిక్‌మనిపించాడు!) ఎంత పొడవు జుట్టుంటే అంత అదృష్టవంతుడు ఇక్కడ మరో వింత ఆచారం ఏంటంటే.. ఫోటోలు దిగకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వారి శరీరం అంతా రక్తంతో తడిసిపోతుందని భావిస్తారు. ఇక్కడ మరో వింత ఆచారం ఏంటంటే.. మంచి భర్త కోసం ఆడవారు గుండు చేయించుకుంటే.. పొడవు జుట్టు ఉన్న వ్యక్తిని ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తారు ఇక్కడి జనాలు. చదవండి: 41 మంది మహిళలపై అత్యాచారాలు.. వెయ్యేండ్ల జైలు శిక్ష -
ఆదివాసీల ‘ఆఖరి మజిలీ’ ప్రత్యేకం
సాక్షి, మంచిర్యాల: మైదాన ప్రాంతవాసులతో పోలిస్తే ఆదివాసీల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. పుట్టుక, పెళ్లి, చావు.. ఇలా అన్నింటా వారికి ప్రత్యేక జీవనశైలి ఉంది. సాధారణంగా ఎవరైనా కాలం చేస్తే కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, తెలిసినవారితో కలసి అంతిమ వీడ్కోలు పలికి ఇల్లు చేరుతుంటారు. కానీ, ఈ వ్యవహారంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని గోండు తెగ సంప్రదాయం వేరు. మృతదేహం చితిలో పూర్తిగా కాలిపోయి.. బూడిదగా మారేవరకూ(నీర్పూజ) ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. అర్ధరాత్రి తర్వాత కాష్టం చుట్టూ తిరుగుతూ సంప్రదాయ వాయిద్యాలు, డప్పులు మోగిస్తూ, ప్రత్యేక గీతాలు పాడుతూ నృత్యాలు చేస్తారు. చనిపోయినవ్యక్తిని ఈ పాటల్లో కీర్తిస్తూ స్వర్గప్రాప్తి కలగాలని కోరుతారు. జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఓర్చి బతికి చనిపోయినవారి చివరి మజిలీలో ఇదే ఆఖరిఘట్టంగా భావించి ‘ఆత్మకు శాంతి’ చేకూరేలా ఆడి పాడి ఈ క్రతువు పూర్తిచేస్తారు. ఇలా చేస్తే చనిపోయినవారి ఆత్మ స్వర్గంలో శాంతిస్తుందని గిరిజనుల నమ్మకం. ఈ తంతులో మహిళలు తప్ప కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు. ఆడి పాడే సమయంలో అక్కడే మేకను బలి ఇస్తారు. వంట చేసుకుని సంప్రదాయ సంగీతం మధ్య ఆడుతూపాడుతూ అక్కడే భోజనం చేస్తారు. ఇదంతా సూర్యోదయం వరకు కొనసాగుతుంది. అనాదిగా ఆదివాసీల్లో ఈ ఆచారం కొనసాగుతోంది. తాజాగా... ఆదివారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయిలో ఆత్రం బొజ్జు పటేల్ మరణించారు. గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా ఆయనకు ఘనంగా అంతిమయాత్ర పూర్తి చేశారు. తర్వాత అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజాము వరకు సంప్రదాయ తంతు నిర్వహించారు. కాగా, దేహాన్ని కాల్చకుండా మట్టిలో పూడిస్తే మాత్రం ఈ తరహా కార్యక్రమాలు ఉండవు. అనాదిగా వస్తున్న ఆచారం చితిలో కాలిన తర్వాత చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కార్యక్రమం చేస్తాం. అనాదిగా ఈ ఆచారం పాటిస్తున్నాం. ఇలా చేస్తే చనిపోయిన వారికి స్వర్గప్రాప్తి లభిస్తుందని నమ్మకం. – మెస్రం షేకు, దబోలి, జైనూరు మండలం, ఆసిఫాబాద్ జిల్లా -
ఈ సర్వీస్‌కు బిల్లు ఎక్కడికి పంపాలి?
టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తన కూతుళ్ల కాళ్లు కడిగి.. వారి ఆశీర్వాదం తీసుకున్నారు. మాములుగా తండ్రి కూతురి పెళ్లి చేసేటప్పుడు అల్లుడి కాళ్లు కడుగుతాడు.. కానీ గంభీర్ ఎందుకు తన కూతుళ్ల కాళ్లు కడిగాడని అనుకుంటున్నారా. శరన్నవరాత్సోవాల సందర్భంగా జరుపుకునే అష్టమి కంజక్ ఆచారంలో భాగమే ఇది. ఈ ఆచారం ప్రకారం తండ్రి తన కూతుళ్ల కాళ్లు కడిగి.. వారి ఆశీర్వాదం తీసుకోవాలి. దీంతో గంభీర్ కూడా ఆ ఆచారాన్ని పాటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను గంభీర్‌ను ట్విటర్లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా తను చేసిన ఈ సర్వీస్‌కు బిల్లు ఎక్కడికి పంపాలని తన భార్య నటాషాను ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు. ప్రసుత్తం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రి ప్రేమ వెలకట్టలేనిదని పలువురు నెటిజన్లు ఈ ఫొటోపై కామెంట్ చేస్తున్నారు. కాగా, 2018లో క్రికెట్ అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన గంభీర్.. ఆ తర్వాత రాజకీయాల్లో చేరారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. As a dad of two young girls, I am gradually mastering my pedicure skills...besides seeking blessings on Ashtami Kanjak!!! @natashagambhir2 where should I send the bill for my services?💅🏽💅🏽🙋🏻♂️ pic.twitter.com/tjtP7yWBl6 — Gautam Gambhir (@GautamGambhir) October 8, 2019 -
రమ్యానే పిలిచినట్టు అనిపిస్తోంది..
తూర్పుగోదావరి,తాడితోట (రాజమహేంద్రవరం): డాడీ! అని ఎవరు పిలిచినా మా అమ్మాయే పిలిచినట్టు అనిపిస్తోందని బోటు ప్రమాదంలో గల్లంతైన మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీ తండ్రి సుదర్శన్ పేర్కొన్నారు. ఈనెల 15న దేవీపట్నం మండలం కుచ్చులూరులో జరిగిన బోటు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన విద్యుత్‌శాఖ ఏఈ కారుకూరి రమ్యశ్రీ గల్లంతైంది. పది రోజులుగా ఆమె ఆచూకీ కోసం ఎదురుచూసిన తల్లిదండ్రులు, ఎంతకీ లభ్యం కాపోవడంతో మృతదేహం దొరకకుండానే, మరణించిందని భావించి ఆమె ఆత్మశాంతి కోసం 11వ రోజైన బుధవారం రాజమహేంద్రవరం కోటిలింగాల రేవులో గోదానం చేసి, కర్మకాండలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమ్యశ్రీ తండ్రి సుదర్శన్ మాట్లాడుతూ 10 రోజులుగా మృతదేహం కోసం ఎదురుచూశామని, దొరికిన మృతదేహాలు గుర్తు పట్టడానికి వీలులేకుండా ఉన్నాయన్నారు. తన కుమార్తె మృతదేహం వస్తుందో! రాదో! తెలియని అయోమయ పరిస్థితుల్లో 11వ రోజు కర్మకాండ నిర్వహించకపోతే ఆమె ఆత్మకు శాంతి చేకూరదని పండితులు చెప్పడంతో ఆమె ఆత్మశాంతి కోసం కర్మకాండ నిర్వహించామని తెలిపారు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నామని, విద్యుత్ శాఖలో ఏఈగా పని చేస్తుండేదని తెలిపారు. బోటు దిగిన తరువాత ఫోన్ చేస్తానంటూ మెసేజ్ పెట్టిందని, కడసారి చూపు కూడా చూడకుండానే వెనుదిరిగి వెళ్లాల్సి వస్తోందని రమ్యశ్రీ తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. రమ్యశ్రీ తల్లి భూలక్ష్మి కర్మకాండలు ముగిసినా తన కుమార్తెను తలచుకుంటూ కోటిలింగాల రేవులోనే ఎక్కువ సమయం ఉండిపోయారు. మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు వాడపల్లి వద్ద మంగళవారం లభించిన పురుషుడి మృతదేహం తమదంటే తమదని ఇరుకుటుంబాల బంధువులు అంటున్నారు. కాకినాడకు చెందిన బోటు డ్రైవర్ పోతాబత్తుల సత్యనారాయణ(60) మృతదేహంగా అతడి కుమారుడు పొతాబత్తుల కుమార్ చెబుతుండగా, బోటులో సహాయకుడిగా పనిచేస్తున్న పాత పట్టిసీమకు కర్రి మణికంఠ మృతదేహంగా అతడి తండ్రి, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహానికి గురువారం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మృతదేహాల కోసం ఎదురుచూపులు.. తమ కుటుంబ సభ్యులు, బంధువుల మృతదేహాల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు ఎదురు చూపులు చూస్తున్నారు. రమ్యశ్రీ మృతదేహం కోసం ఆమె తల్లిదండ్రులు, బోటు డ్రైవర్లు పోతాబత్తుల సత్యనారాయణ, నూకరాజు మృతదేహాల కోసం వారి కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన అంకం పవన్‌కుమార్, అతడి భార్య వసుంధరా భవానీ మృతదేహాల కోసం అతడి మేనమామ మట్టా రాజేంద్ర ప్రసాద్ ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి చేరని మహిళ మృతదేహం బుధవారం రాత్రి సీతానగరం ఎస్సైకు మహిళ మృతదేహం అప్పగించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తారని మృతుల కుటుంబాల వారు ఎదురుచూసినా రాత్రి వరకు రాకపోవడంతో నిరాశ చెందారు. ఆ మృతదేహం బోటు ప్రమాదంలో మృతిచెందిన వారిది కాదేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఆచారం పేరిట ఇదేమి అనాచారం
సాక్షి, తిరువనంతపురం : మహిళల అయ్యప్ప ఆలయంగా ప్రసిద్ధి చెందిన కేరళ, తిరువనంతపురం జిల్లాలోని అట్టుకల్ భగవతీ దేవీ ఆలయంలో ఏటా వైభవోపేతంగా జరిగే పొంగల్ పండుగలో సకల సంప్రదాయ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈసారి కూడా నిరాటంకంగా అంతే వైభవంగా జరిగాయి. ఫిబ్రవరి 22వ తేదీన ప్రారంభమై మార్చి 3న ముగియనున్న ఈ పది రోజుల మహోత్సవంతో అత్యంత కీలకమైన తొమ్మిదవ రోజు శుక్రవారం ‘అట్టుకల్ పొంగల్’ కార్యక్రమంలో లక్షలాది మంది మహిళలు పాల్గొని బియ్యం, బెల్లం, కొబ్బరితో మట్టి కుండల్లో పొంగలి వండి అట్టుకల్ భగవతీ దేవీకి నైవేద్యంగా అర్పించారు. ఈసారి దాదాపు ఆరు లక్షల మంది మహిళలు పాల్గొన్న ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూసేందుకు ఏకంగా 4,200 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు. అయినప్పటికీ వారికి తెలియకుండా లేదా తెలిసి ఓ ఘోరం, ఓ అనాచారం యథావిధిగా జరిగిపోయింది. ఎనిమిదేళ్ల నుంచి 12 ఏళ్ల లోపు వయస్సున్న కొన్ని వందల మంది బాలుర శరీరాల్లోకి ఇనుప రింగులు రక్తాన్ని చిందిస్తూ దూసుకుపోయాయి. బాధను భరించలేక బయటకొచ్చిన వారి ఆక్రందనలు దైవ వాయిద్యాల ఘోషలో ఎవరికి వినిపించకుండా పోయాయి. ఈ ఘోర అపచారాన్ని అడ్డుకునేందుకు సాక్షాత్తు కేరళ డీజీపీ ఆర్ శ్రీలేఖ (మొట్టమొదటి మహిళా డీజీపీ), ఆమెకు తోడుగా డాక్టర్ పీ. మురళీధరన్, ‘అట్టుకుల్ అమ్మ’ పుస్తక రచయిత లక్ష్మీ రాజీవ్ చివరి వరకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దైవభీతికి దాసోహం అన్న ఆలయ పూజారులు ఎప్పటిలాగ, కాకపోతే ఈసారి కాస్త గుట్టుగా ‘కుతియొట్టం’ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కుతియొట్టం కార్యక్రమం పొంగల్ కార్యక్రమం ప్రారంభమైన రెండు రోజుల తర్వాత ప్రారంభమై ఒక రోజు ముందుగా ముగిసే ఓ సంప్రదాయ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ‘కుతియొట్టం’ అని పిలుస్తారు. ఈ కార్యక్రమంలో కేరళతోపాటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎనిమిదేళ్ల నుంచి 12 ఏళ్లలోపు వయస్సున్న బాలురు పాల్గొంటారు. వీరంతా ప్రతిరోజూ ఆలయ కోనేరులో మూడుసార్లు మునుగు స్నానాలు చేసి వస్తారు. మొలతాడు వరకు లుంగీలాగా తెల్లటి దుస్తులు ధరించి అణుక్షణం ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. పూటకు ఓ ముద్ద ప్రసాదం చొప్పు, అది రెండు పూటలు మాత్రమే వీరికి ఆహారంగా అందుతుంది. రాత్రిపూట ఆలయ ప్రాంగణంలో నేలమీద చాపలపై మాత్రమే పడుకోవాలి. వారం రోజుల ఈ కార్యక్రమం ముగిసేవరకు తల్లిదండ్రులను చూసేందుకు పిల్లలను అనుమతించరు. అలాగే తల్లిదండ్రులను కూడా పిల్లల వద్దకు అనుమతించారు. ఆకలికి తాళలేక, చలికి తట్టుకోలేక పిల్లలు ఏడ్చి పెడబొమ్మలు పెట్టినా అలయ అధికారులెవరూ పట్టించుకోరు. ఏడో రోజు అంటే, ఆలయ పొంగల్ ఉత్సవాలు ముగిసే ముందు రోజున ఈ పిల్లలను ఆభరణాలు, కిరీటాలు, పూల దండనలతో అలంకరిస్తారు. ఆ తర్వాత వారి పక్కటెముకల కింది భాగంలో వెండి ధారం దూర్చిన ఇనుప రింగులను శరీరంలోకి పంపిస్తారు. 24 గంటల తర్వాత వాటిని మళ్లీ తొలగిస్తారు. రింగులు పంపిన చోట ఇన్పెక్షన్లు వచ్చి పిల్లలకు పుండ్లు అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో కొన్ని వందల మంది పిల్లలు పాల్గొంటారు. గతేడాది 900 మంది పిల్లలు పాల్గొనగా, ఈ సారి అంతకన్నా ఎక్కువ మంది పాల్గొన్నట్లు తెల్సింది. ఒంటరి పోరాటం ఆచారం పేరుతో జరుగుతున్న ఈ అనాచారాన్ని ఎలాగైన ఆపాలని తొలి రాష్ట్ర మహిళా డీజీపీగా రికార్డుల్లోకి ఎక్కిన శ్రీలేఖ చివరకు కృషి చేశారు. ఆమె ఆలయ అధికారులను కలుసుకొని ఈ అనాచారాన్ని ఆపాలని కోరారు. అలా చేయడం అది అపచారం అవుతుందని, అమ్మోరికి కోపం వస్తుందని అధికారులు భయాందోళనలు వ్యక్తం చేశారు. తాను కూడా అమ్మవారి భక్తురాలినేనని, ఆమెకు కోపం రాదని నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేదు. బాలుర శరీరంలోకి ఇనుప రింగులను పంపించేటప్పుడు నొప్పి కలిగే మాట వాస్తవమేగానీ, ఆ తర్వాత వారికి ఎలాంటి గాయం కాదని, కొన్ని రోజుల్లోనే వారి శరీరాలపై మరక కూడా మాయం అవుతుందని, భవిష్యత్తులో ఆ పిల్లలకి అంతా మంచే జరుగుతుందిని ఆలయ అధికారులు వాదించారు. దేవుడిని నమ్మే శ్రీలేఖ తన పదవ ఏట నుంచి ప్రతి ఏటా ఈ పొంగల్ ఉత్సవాల్లో పాల్గొంటున్నారట. గత ఏడాది కూడా పాల్గొన్నారట. ఆ సందర్భంగా ఆమె బాడీగార్డ్ ఆచారం పేరిట పిల్లలను వేధిస్తున్న అనాచారం గురించి చెప్పారట. అందుకని ఈసారి ఈ కార్యక్రమాన్ని ఎలాగైన ఆపాలని చూశారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే మత సంబంధిత కార్యక్రమాల్లో తాము జోక్యం చేసుకోలేమని సమాధానం వచ్చిందట. మతం పేరిట హింసను కొనసాగిస్తుంటే హింస నుంచి పిల్లలను రక్షించేందుకున్న చట్టాలను ఉపయోగించడంలో తప్పులేదని కూడా ఆమె వాదించారట. ప్రతి ఏట పిల్లలకు చికిత్స కుతియొట్టం కార్యక్రమంలో గాయపడిన పిల్లల్లో తాను ప్రతి ఏటా ఐదారుగురికి వైద్య చికిత్సను అందజేస్తున్నట్లు ఆలయ ప్రాంతంలో 30 ఏళ్లుగా ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్ పీ. మురళీధరన్ మీడియాకు తెలియజేశారు. 24 గంటలకుపైగా ఇనుప రింగులు బాలుర చర్మంలో ఉండడం వల్ల అక్కడ వారికి నీరుతో ఉబ్బడం, ఇన్ఫెక్షన్లు, జ్వరాలు వస్తున్నాయని ఆయన తెలిపారు. తాను ఈ అనాచారాన్ని 2014లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దష్టికి తీసుకెళ్లానంటూ అప్పుడు జరిగిన విషయాలను వెల్లడించారు. హక్కుల కమిషన్ దర్యాప్తునకు ఆదేశించగా, పిల్లలకు స్టెరిలైజ్ చేసిన ఇనుప రింగులనే ఎక్కిస్తున్నారని, ఆ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు, వైద్య బందం సమక్షంలోనే ఈ కార్యక్రమం జరుగుతుందని పోలీసులు మానవ హక్కుల సంఘానికి నివేదిక సమర్పించారు. అన్ని కోణాల నుంచి ఈ అంశాన్ని పరిశీలించి తగిన నిర్ణయాన్ని తీసుకునే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగిస్తూ మానవ హక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆ అంశాన్ని పక్కన పడేసింది. ‘పిల్లలకు ఇనుప రింగులు గుచ్చతుంటే ‘అట్టుకల్ అమ్మ’కు కూడా నిజంగా నొప్పి కలుగుతుంటుంది’ అని ‘అట్టుకల్ అమ్మ: ది గాడెస్ ఆఫ్ మిలియన్స్’ అనే పుస్తకం రాసిన రచయిత లక్ష్మీ రాజీవ్ వ్యాఖ్యానించారు. ఈ అనాచారాన్ని వదిలేయాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. అనాచారానికి వ్యతిరేకంగా పోరాడిన రాష్ట్ర డీజీపీ దీనికి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా పొంగల్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే పొంగల్ వేడుకల సందర్భంగా మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు మొట్టమొదటి సారిగా మహిళా బెటాలియన్‌ను వేడుకల వద్దకు పంపించారు. అనాచారాన్ని ఆపాల్సిన బాధ్యతను ఇక సాక్షాత్తు అట్టుకల్ అమ్మకే అప్పగించారు. ప్రముఖ తమిళ పౌరాణిక సాహిత్యం ‘శిలప్పాధికారం (తెలుగులో అనువాదం: కళ్యాణ మంజీరాలు)లోని కన్నగీ క్యారెక్టరే అట్టుకల్ అమ్మగా అవతరించిందన్నది తమిళుల విశ్వాసం. -
'మా కూతురు చనిపోయింది.. కర్మకు రండి'
సాక్షి, వేలూరు : ప్రియుడితో వెళ్లిపోయిందన కోపంతో ఓ తండ్రి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన కుమార్తె చనిపోయిందంటూ పోస్టర్లు వేయించి మరీ అంత్యక్రియలు నిర్వహించడాడు. ఈ సంఘటన వానియంబాడి సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేలూరు జిల్లా వానియంబాడి సమీపంలోని ఒక గ్రామంలో ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో గత నెల 23 న ఆ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడిని వివాహం చేసుకుంది. దీంతో ఆగ్రహించిన యువతి తల్లిదండ్రులు ఇకపై తమ కుమార్తెతో తమకు ఎలాంటి సంబంధాలు లేదని, తమ కూతురు చచ్చినట్లేనని ప్రకటించారు. అయితే, చుట్టుపక్కల వారు వారి ప్రేమ వివాహాన్ని ఎక్కువగా చర్చించుకుంటుండటంతో ఏకంగా ఆమె చనిపోయిందని ఊరినిండా పోస్టర్లు వేయించాడు. ఆ పోస్టర్లో తన కుమార్తె జనవరి 23న మృతి చెందిందని, ఆరోజే దహన క్రియలు చేశామని ఫిబ్రవరి 21న తేదిన అంత్యక్రియలని పేర్కొన్నారు. పోస్టర్లో పేర్కొన్న ప్రకారమే గ్రామస్తులు, బందువులతో కలిసి కుటుంబ సభ్యులు కుమార్తెకు అంత్యక్రియలు జరిపారు. ఆన్లైన్, డిజిటల్ రంగం వచ్చిన నేటి రోజుల్లో వారి చర్యలు సంచలనంగా మారాయంటూ పలువురు చర్చించుకుంటున్నారు. -
వద్దని గ్రూప్‌కి ఎక్కినందుకు పెద్దలకు కోపం వచ్చింది!
ఆచారాలు ఉండాల్సిందే. కానీ అవి ‘అత్యాచారాలు’ కాకూడదు! కొన్ని ఆచారాలైతే అసలే ఉండకూడదు. కానీ ఉన్నాయి. ఇంకా ఉంటూనే ఉన్నాయి. ‘ఇంకా’ అంటే.. మనం నాగరికులం, నవనాగరికులం అనుకుంటున్నాం కదా! మహారాష్ట్రలో ఏం జరిగిందో చూడండి. పుణెకి దగ్గరల్లోని పింప్రీ అనే ప్రాంతంలో కంజర్భట్ అనే కమ్యూనిటీ ఉంది. వాళ్లకో ఆచారం ఉంది. వధువు కన్యా? కాదా? అని తెలుసుకునే ఆచారం! అయితే పెళ్లికి ముందు తెలుసుకోరు. పెళ్లయ్యాక మొదటి రాత్రి తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారు? తెలుసుకుని ఏం చేస్తారు అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మొన్న ఆదివారం ఏం జరిగిందో చూద్దాం. కమ్యూనిటిలో ఒక అమ్మాయికి పెళ్లయింది. మిగిలిన తంతు ఇక ఆమె కన్యత్వ పరీక్ష. తొలిరాత్రికి ముందు రోజు కమ్యూనిటీలోని కుర్రాళ్లు ఈ దురాచారానికి వ్యతిరేకంగా ఒక వాట్సాప్ గ్రూపు ప్రారంభించారు. ‘స్టాప్ ది వి రిచువల్’ (కన్యత్వ దురాచారాన్ని ఆపండి) అని ఆ గ్రూపుకు పేరు పెట్టుకున్నారు. ఒకే విధంగా ఆలోచించే వాళ్లంతా ఆ గ్రూపులో చేరారు. కన్యత్వ పరీక్షకు వ్యతిరేకంగా మిగతావాళ్లకు చైతన్యం కలిగించడం మొదలుపెట్టారు. ఆ విషయం కమ్యూనిటీలోని పెద్దవాళ్లకు తెలిసింది. గ్రూపులోని ఒక్కో ఫోన్ నెంబర్నీ పట్టుకుని, ఒక్కొక్కర్నీ కొట్టిపడేశారు. ఒక గుంపుగా వచ్చి కొట్టారు. దాడి చేసినవాళ్లలో నలభై మందిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు అయింది. వాళ్లలో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. మిగతావాళ్లు పింప్రీ వదిలి పారిపోయారు. పారిపోవలసింది కొట్టినవాళ్లు, కొట్టించుకున్నవాళ్లు కాదు. దురాచారం పారిపోవాలి. దాన్ని తరిమి తరిమి కొట్టాలి. పింప్రీలోని కంజర్భట్ కమ్యూనిటీలో ఈ దురాచారం ఎంత ఘోరంగా ఉంటుందంటే.. ఫస్ట్‌నైట్ వధూవరులకు ఏర్పాటు చేసిన పట్టెమంచంపై తెల్లటి దుప్పటిని పరుస్తారు. తెల్లారగానే వచ్చి ఆ దుప్పటిని చూస్తారు. దానిపై మరకలు ఉన్నాయా.. అమ్మాయి కన్య అయినట్లు! లేవా.. ఆమె బతుకు బట్టబయలు అయినట్లు! అమ్మాయిని అబ్బాయి వదిలేస్తాడు! లేదా.. ఎవరితో కలిసి ఆమె ‘తప్పు చేసిందో’ అతని పేరు కనుక్కుని అతని చేత, ఆమె చేత ఫైన్ కట్టించి అప్పుడు అమ్మాయిని వరుడు దగ్గరికి కాపురానికి పంపిస్తారు పెద్దలు. సైన్స్ ఎంత డెవలప్ అయినా, కామన్సెన్స్ డెవలప్ కాకపోతే ఇలాంటి దురాచారాలే జీవితాలను శాసిస్తుంటాయి. అసలు స్త్రీకొక న్యాయం, పురుషుడికొక న్యాయం ఉండడంలోనే మన ఆచారాల్లోని డొల్లతనమంతా ఉంది. ఆచారం అన్నది మానవ జీవితం మెరుగవ్వడానికి తోడ్పడాలి తప్ప, ఎవరి జీవితానికీ ప్రతిబంధకం కాకూడదు. -
ఇలా కూడా చేస్తారా.. వింత ఆచారం!
మరణాలపై ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన నమ్మకాలు, మత విశ్వాసాలు, ఆచారాలు, పద్దతులు ఉంటాయి. ఈజిఫ్టు పిరమిడ్లు కూడా ఇటువంటి ఆచారాలు, నమ్మకాల కోవలోకే వస్తాయి. మన దేశంలో కూడా వ్యక్తి మరణం తరువాత చేయాల్సిన కొన్ని పనులను కర్మలుగా నిర్వహిస్తాం. కాకపోతే కొందరి ఆచారాలు.. భీతిగొలిపేలా, ఇటువంటివి కూడా ఉంటాయా? అన్న ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి. ఇండోనేషియాలోని రిందిగాల్లో గ్రామ ప్రజలు నమ్మకాలు, విశ్వాసాలు ఇలాగే ఉంటాయి. రిందిగాల్లో గ్రామ ప్రజలు చనిపోయిన వారి మీద చూపే ప్రేమ, గౌరవం చాలా గొప్పగా ఉంటుంది. సాధారణంగా ఎక్కడైనా మృతి చెందిన వారికి ఏడాదికోసారి సంవత్సరీకం పేరుతో వారిని స్మరించుకోవడం సహజం. అయితే రిందిగాల్లో గ్రామ ప్రజలు మాత్రం.. వారిని పార్థివ దేహాలను సమాధుల నుంచి వెలికి తీసి కార్యక్రమాలను నిర్వహిస్తారు. మృత దేహాలను ఏడాదికోసారి సమాధుల నుంచి బయటకు తీస్తారు. వాటిని చాలా జాగ్రత్తగా రసాయనాలతో శుభ్రపరుస్తారు. వారు బతికున్నప్పుటి అలవాట్లను గుర్తు చేసుకుంటూ శవాలను ఆలా రూపొందిస్తారు. వారికి నచ్చే రంగులతో రూపొందించిన దుస్తులు, కళ్లజోడు, సిగరెట్లు, తినే పదార్థాలను ఏర్పాటు చేస్తారు. తరువాత శవాలను ఇంటికి తీసుకువచ్చి.. బతికున్నప్పుడు ఎక్కడైతో కూర్చునేందుకు ఇష్టపడేవారే.. ఆ స్థలంలో కూర్చోబెడతారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తారు. రోజంతా వారు పండుగలా గడిపేస్తారు. సాయంత్రం అయ్యేసరికి గ్రామస్థుల మొహాల్లో విషాదఛాయలు కనిపిస్తాయి. చీకటి పడ్డతరువాత గ్రామస్థులంగా శవాలను తిరిగి సమాధుల్లోకి భద్రంగా చేరుస్తారు. ఆ రాత్రంతా వారు జాగరణ చేస్తూ గడుపుతారు. -
కర్మకాండలకూ డబ్బుల్లేవు..
‘మా అల్లుడు మూడు రోజుల క్రితం రైలు ప్రమాదంలో చనిపోరుుండు. మూడొద్దుల కర్మకు చేతిలో చిల్లి గవ్వలేదు.. ఉన్న డబ్బంతా బ్యాంకులోనే ఉంది.. దయుంచి పైసలు ఇయ్యండి..’.. అంటూ ఓ వృద్ధుడు బ్యాంకు మేనేజర్ వద్ద బోరున విలపించాడు. జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం వనపర్తికి చెందిన అరుులపురం చంద్రయ్య వేదన ఇది. లింగాలఘణపురం గ్రామీణ వికాస్ బ్యాంకులో ఆయనకు రూ.42 వేల డిపాజిట్ ఉంది. అరుుతే జనగామలో ఉండే తన కుమార్తె భర్త మూడు రోజుల కింద రైలు ప్రమాదంలో మృతి చెందాడు. అక్కడ పుట్టింటి తరఫున చేయాల్సిన మూడు రోజుల కర్మ కార్యక్రమం కోసం డబ్బులు కావాలి. చేతిలో సొమ్ము లేకపోవడంతో చంద్రయ్య బ్యాంకుకు వచ్చాడు. కానీ బ్యాంకులో డబ్బు లేదనడం తో ఏం చేయాలో తెలియక బోరున విలపిం చాడు. అది గమనించిన మేనేజర్ రాజా మోహన్ తన వద్ద ఉన్న రూ.4 వేలు చంద్ర య్యకు ఇచ్చి పంపారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
శాలిగౌరారం): మండలంలోని ఊట్కూరు గ్రామానికి చెందిన మహేశ్వరం నర్సింహ(45) వ్యవసాయ కూలీ. రోజువారీగా వ్యవసాయ కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురై మంగళవారం మృతిచెందాడు. మృతుడికి భార్యతో పాటు కుమార్తె ఉన్నారు. నర్సింహ అంత్య క్రియలు సాయంత్రం ఊట్కూరు గ్రామంలో జరిగాయి. నర్సింహకు కుమార్తె ఇందుమతి తలకొరివి పెట్టింది. ఇందుమతి ప్రస్తుతం రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. కుటుంబ పెద్దదిక్కు మృతిచెందడంతో ఆ కుటుంబం రోదిస్తున్న తీరు అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. -
దొంగతనం చేయడానికే ఈ గుడికి వెళ్లాలి!
రూర్కీ: గుడికి వెళ్లి దొంగతనం చేయాలని ఎవరూ అనుకోరు. కానీ అక్కడ గుడికి మాత్రం దొంగతనం చేయడానికే వెళ్లాలి. దొంగతనం చేస్తేనే అక్కడున్న అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. ఇంతకీ ఎక్కడా గుడి? ఏంటా ఆచారం అని అనుకుంటున్నారా? ఉత్తరాఖండ్‌లోని రూర్కీ జిల్లాలోని చేడియాల అనే గ్రామంలో చూడామణి ఆలయం ఉంది. పిల్లలు లేని వాళ్లు ఈ ఆలయాన్ని దర్శిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. పిల్లలు కావాలని అనుకునేవారు అక్కడ దొంగతనం చేయాలి. దొంగతనం అంటే డబ్బూ నగలూ అనుకునేరు.. అవి కాదండి. దేవతానుగ్రహం పొందాలంటే అమ్మవారి పాదాల దగ్గర ఉన్న ఓ చెక్క బొమ్మను దంపతులు అపహరించాలి. అలా దొంగలించిన తరువాత పిల్లలు పుట్టగానే మళ్లీ ఆలయానికి వచ్చి ఆ బొమ్మతో పాటు మరో ప్రతిమను కూడా అక్కడే పెట్టాలి. వింతగా ఉంది కదూ ఆచారం. -
నిప్పులపై నడుస్తూ.. కిందపడి..
జలంధర్: హిందూ మతాచారం ప్రకారం ఆచార కార్యక్రమాల్లో భాగంగా నిర్విహిస్తున్న నిప్పులపై నడకలో ఓ తండ్రి తన ఆరేళ్ల కుమారుడిని నిప్పులపై పడేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మా మారియమ్మ జాతరలో ఉట్టికాళ్లతో నిప్పులపై నడవడానికి సిద్ధమైన తండ్రి అతని కొడుకు కార్తీక్(6)ను చేతుల్లో పట్టుకుని నిప్పులపై నడకను ప్రారంభించారు. అయితే, నిప్పుల గుండం మధ్యలోకి వెళ్లిన తర్వాత అతను అదుపుతప్పి కింద పడిపోవడంతో కొడుకు కార్తీక్ శరీరం తీవ్రంగా కాలిపోయింది. దీంతో పక్కనే ఉన్న వారు స్పందించి వెంటనే కుర్రవాడిని ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులను ఎవరినైనా కార్తీక్ తోడుగా రమ్మని అడుగగా తమకు దేవుని మీద నమ్మకం ఉందని, పిల్లవాడిని ఆయనే కాపాడతాడని చెప్పినట్లు తెలిపారు. కాగా, కార్తీక్ ను ఆదివారం ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశారు. తండ్రికి శరీరం కూడా 15 శాతం కాలిపోయిందని వివరించారు. గత వారం ఇదే ఉత్సవాల్లో భాగంగా నిప్పులపై నడుస్తూ ఓ తల్లి, కూతురు కిందపడి గాయలపాలైన విషయం తెలిసిందే. -
కర్మకాండకు వెళ్తొస్తూ.. కానరాని లోకాలకు
శంషాబాద్ రూరల్: దగ్గరి బంధువు చనిపోతే కర్మకాండలకు వచ్చి తిరుగు ప్రయాణంలో ప్రమాదం బారిన పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా చటాన్‌పల్లికి చెందిన దేవగిరి శ్రీనివాస్ (40) రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్లో బంధువు కర్మకాండలకు ఆదివారం వచ్చాడు. కార్యక్రమం పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో పెద్ద షాపూర్ వద్ద బెంగళూరు రహదారిపై రోడ్డు దాటుతుండగా మారుతి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.