‘నన్ను టార్గెట్‌ చేస్తున్నారు’.. డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు | DK Shivakumar Says Sacrificial Ritual In Kerala To Target Me | Sakshi
Sakshi News home page

‘నన్ను టార్గెట్‌ చేస్తున్నారు’.. డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు

Published Fri, May 31 2024 8:41 AM | Last Updated on Fri, May 31 2024 8:57 AM

DK Shivakumar Says Sacrificial Ritual In Kerala To Target Me

బెంగళూరు: కాంగ్రెస్‌ ప్రభుత్వం, తనపై కొందరు తాంత్రిక పూజలు జరుపుతున్నారని  కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘ కాంగ్రెస్‌ ప్రభుత్వం, నాపై కేరళలో తాంత్రిక పూజలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో, ఎప్పటి నుంచి ఆ పూజలు చేస్తున్నారలో నాకు తెలుస్తునే ఉంది. ఈ పూజలను కొందరు నాతో పాటు సీఎం సిద్ధరామయ్యపై కూడా చేయిస్తున్నారు. కేరళలోని రాజ రాజేశ్వరీ ఆలయంలో శత్రువులను తొలగించటం కోసం కొందరు ‘‘శత్రు భైరవీ యాగం’’ (అగ్నిబలి) పేరిట పూజలు చేస్తున్నారు. 

పంచబలి(ఐదు వస్తువులను బలి ఇవ్వటం) చేస్తున్నారు. దీని కోసం ఎర్రమేక, 21 బర్రెలు, మూడు నల్ల మేకలు, ఐదు పందులను బలి ఇచ్చారు. దీని ఫలితంగా అగ్ని బలి జరుగుతుంది. ఫలితంగా శత్రువులు తొలిగిపోతారని నమ్మక​ం ఉంది’’ అని డీకే శివ కుమార్‌ అన్నారు.

ఈ పూజలు ఇంకా కొనసాగుతున్నాయని డీకే తెలిపారు. ఆ పూజలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందుతోందని అన్నారు. అయితే ఈ పూజలు ఎవరూ జరిపిస్తున్నారన్న విషయాన్నిమాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ, ఓ ప్రతిపక్ష నాయకుడి ఆదేశాల మేరకు ఈ తాంత్రిక పూజులు జరుగుతున్నాయని తెలిపారు.

‘‘అలా చేయటం వారి నమ్మకం. దాన్ని వారికే వదిలేస్తున్నా. వారు ఏం చేయాలకుంటే అది చేసుకోవచ్చు. వాళ్ల పూజల నుంచి మమ్మల్ని రక్షించే శక్తి మా వెంటే ఉంది’’ అని  డీకే శివకుమార్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement