సిమ్లా: హిమాచల్ ప్రదేశ్, సిమ్లాలోని స్పాల్ లోయలో అరుదైన, పురాతనమైన సంప్రదాయం మళ్లీ ప్రారంభమైంది. దేవంతలందరినీ ఏకం చేస్తుందని నమ్మే సాంస్కృతిక వారసత్వ ప్రదర్శనను పునరుద్ధరించారు. సిమ్లాలోని మారుమూలమైన దల్గావ్‌లో ధారి్మక కార్యక్రమం ‘భుండా మహా యజ్ఞం’ జరిగింది. ఈనెల 2న ప్రారంభమైన కార్యక్రమం ఆదివారంతో ముగిసింది.
నాలుగురోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా స్పాల్ లోయను కలుపుతూ ఉండే రెండు పర్వతాల మధ్య ముంజి(పవిత్రమైన తాడు)పై జారే కార్యక్రమం శనివారం నిర్వహించారు. మరణలోయగా పిలుచుకునే స్పాల్ లోయలో ఒక కొండ నుంచి మరో కొండకు కనీసం ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది. రెండు కొండలపైన ఉన్న వ్యక్తులు తాడును బిగ్గరగా పట్టుకోగా.. ఆ తాడును పట్టుకుని జారతారు. ఈ సాహసోపేతమైన కార్యక్రమాన్ని సూరత్ రామ్ అనే 65 ఏళ్ల వృద్ధుడు శనివారం ఆ తాడు గుండా జారాడు. మరో అంచున ఉన్న వ్యక్తుల చేతిలో తాడు చేజారింది. వెంటనే పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment