death valley
-
సిమ్లాలో ఘనంగా భుండా మహాయజ్ఞం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్, సిమ్లాలోని స్పాల్ లోయలో అరుదైన, పురాతనమైన సంప్రదాయం మళ్లీ ప్రారంభమైంది. దేవంతలందరినీ ఏకం చేస్తుందని నమ్మే సాంస్కృతిక వారసత్వ ప్రదర్శనను పునరుద్ధరించారు. సిమ్లాలోని మారుమూలమైన దల్గావ్లో ధారి్మక కార్యక్రమం ‘భుండా మహా యజ్ఞం’ జరిగింది. ఈనెల 2న ప్రారంభమైన కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. నాలుగురోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా స్పాల్ లోయను కలుపుతూ ఉండే రెండు పర్వతాల మధ్య ముంజి(పవిత్రమైన తాడు)పై జారే కార్యక్రమం శనివారం నిర్వహించారు. మరణలోయగా పిలుచుకునే స్పాల్ లోయలో ఒక కొండ నుంచి మరో కొండకు కనీసం ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది. రెండు కొండలపైన ఉన్న వ్యక్తులు తాడును బిగ్గరగా పట్టుకోగా.. ఆ తాడును పట్టుకుని జారతారు. ఈ సాహసోపేతమైన కార్యక్రమాన్ని సూరత్ రామ్ అనే 65 ఏళ్ల వృద్ధుడు శనివారం ఆ తాడు గుండా జారాడు. మరో అంచున ఉన్న వ్యక్తుల చేతిలో తాడు చేజారింది. వెంటనే పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది తరలివచ్చారు. -
సాహసయాత్ర చేస్తూ.. హేరీపోటర్ విలన్ మృతి
హేరీపోటర్ సిరీస్ సినిమాలన్నింటిలో విలన్‌గా నటించిన డేవ్ లెగెనో మరణించాడు. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో సాహసయాత్ర చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు సాహసయాత్రికులు ఇటీవల డెత్ వ్యాలీ మీదుగా వెళ్తున్నప్పుడు వారికి లెగెనో మృతదేహం కనిపించింది. అది ఎంత మారుమూల ప్రదేశం అంటే, చివరకు మృతదేహాన్ని అక్కడినుంచి తరలించడానికి కాలిఫోర్నియా హైవే పెట్రోల్ హెలికాప్టర్‌ను రప్పించాల్సి వచ్చింది. 50 ఏళ్ల లెగెనో గుండె సంబంధిత వ్యాధితో మరణించి ఉంటారని, ఆయన మరణించిన నాలుగైదు రోజుల తర్వాతే మృతదేహం కనిపించిందని కౌంటీ పోలీసులు చెబుతున్నారు. డెత్ వ్యాలీలో ఉష్ణోగ్రతలు అత్యంత దారుణంగా ఉంటాయి. మంచి మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ అయిన లెగెనో.. ఇలా దిక్కు మొక్కు లేకుండా మరణించడం మాత్రం అభిమానులను కలచివేసింది.