సాహసయాత్ర చేస్తూ.. హేరీపోటర్ విలన్ మృతి | Harry Potter villian dies hiking in Death Valley | Sakshi
Sakshi News home page

సాహసయాత్ర చేస్తూ.. హేరీపోటర్ విలన్ మృతి

Published Sat, Jul 12 2014 1:55 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

సాహసయాత్ర చేస్తూ.. హేరీపోటర్ విలన్ మృతి - Sakshi

సాహసయాత్ర చేస్తూ.. హేరీపోటర్ విలన్ మృతి

హేరీపోటర్ సిరీస్ సినిమాలన్నింటిలో విలన్గా నటించిన డేవ్ లెగెనో మరణించాడు. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో సాహసయాత్ర చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు సాహసయాత్రికులు ఇటీవల డెత్ వ్యాలీ మీదుగా వెళ్తున్నప్పుడు వారికి లెగెనో మృతదేహం కనిపించింది. అది ఎంత మారుమూల ప్రదేశం అంటే, చివరకు మృతదేహాన్ని అక్కడినుంచి తరలించడానికి కాలిఫోర్నియా హైవే పెట్రోల్ హెలికాప్టర్ను రప్పించాల్సి వచ్చింది.

50 ఏళ్ల లెగెనో గుండె సంబంధిత వ్యాధితో మరణించి ఉంటారని, ఆయన మరణించిన నాలుగైదు రోజుల తర్వాతే మృతదేహం కనిపించిందని కౌంటీ పోలీసులు చెబుతున్నారు. డెత్ వ్యాలీలో ఉష్ణోగ్రతలు అత్యంత దారుణంగా ఉంటాయి. మంచి మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ అయిన లెగెనో.. ఇలా దిక్కు మొక్కు లేకుండా మరణించడం మాత్రం అభిమానులను కలచివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement