పుణే: మగ బిడ్డ కోసం, డబ్బుపై ఆశతో ఆ భర్త చేసిన పని దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. వ్యాపారంలో లాభాలు రావాలన్నా.. ఇంట్లో శాంతి నెలకొనాలన్నా.. అన్నింటికి మించి మగ సంతానం కలగాలన్నా తాను చెప్పినట్లు చేయాలని ఓ ఫేక్ బాబా సలహా ఇవ్వడంతో.. భార్యను అందరి ముందు దుస్తులు లేకుండా స్నానం చేయించాడు సదరు భర్త.
మహారాష్ట్ర పుణేలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. పుణేకి చెందిన ఆమె భర్త కుటుంబం 2013 నుంచి అదనపు కట్నం, మగ బిడ్డ కోసం వేధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె చేత క్షుద్ర పూజలు కూడా చేయించింది. ఈ మధ్య మౌలానా బాబా జామదార్ అనే వ్యక్తి ఆమె భర్తతో జలపాతం కింద అంతా చూస్తుండగా ఒంటిపై బట్టలు లేకుండా స్నానం చేయిస్తే.. మగ సంతానం కలుగుతుందని, అప్పులు సైతం తీరతాయని సలహా ఇచ్చాడు.
దీంతో ఆ మూర్ఖపు భర్త, అతని కుటుంబం బాధితురాలని రాయ్‌ఘడ్‌కి తీసుకెళ్లి.. అక్కడి జలపాతం కింద ఆమె చేత బలవంతంగా ఫేక్ బాబా చెప్పినట్టు స్నానం చేయించింది. అక్కడ చాలామందే ఉన్నా.. ఎవరూ అడ్డుకునే యత్నం చేయలేదు. చివరికి.. బాధితురాలే ధైర్యం చేసి భారతీ విద్యాపీఠ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్త, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి.. పరారీలో ఉన్న ఫేక్ బాబా కోసం గాలింపు చేపట్టారు.
ఇదీ చదవండి: రూపాయి తెచ్చిన పంచాయితీ !
Comments
Please login to add a commentAdd a comment