తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు | Ritual completed a doughter for father | Sakshi
Sakshi News home page

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

Published Tue, Jul 26 2016 10:26 PM | Last Updated on Tue, Mar 19 2019 7:01 PM

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు - Sakshi

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

శాలిగౌరారం):
మండలంలోని ఊట్కూరు గ్రామానికి చెందిన మహేశ్వరం నర్సింహ(45)  వ్యవసాయ కూలీ. రోజువారీగా వ్యవసాయ కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు.  ఇటీవల అనారోగ్యానికి గురై మంగళవారం మృతిచెందాడు. మృతుడికి భార్యతో పాటు కుమార్తె ఉన్నారు. నర్సింహ అంత్య క్రియలు సాయంత్రం ఊట్కూరు గ్రామంలో జరిగాయి. నర్సింహకు కుమార్తె ఇందుమతి తలకొరివి పెట్టింది. ఇందుమతి ప్రస్తుతం రెసిడెన్షియల్‌ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. కుటుంబ పెద్దదిక్కు మృతిచెందడంతో ఆ కుటుంబం రోదిస్తున్న తీరు అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement