ఈ సర్వీస్‌కు బిల్లు ఎక్కడికి పంపాలి? | Gautam Gambhir Seeks His Daughter Blessings On Ashtami Kanjak | Sakshi
Sakshi News home page

ఈ సర్వీస్‌కు బిల్లు ఎక్కడికి పంపాలి?

Published Tue, Oct 8 2019 7:20 PM | Last Updated on Tue, Oct 8 2019 7:20 PM

Gautam Gambhir Seeks His Daughter Blessings On Ashtami Kanjak - Sakshi

టీమిండియా మాజీ ఓపెనర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ తన కూతుళ్ల కాళ్లు కడిగి.. వారి ఆశీర్వాదం తీసుకున్నారు. మాములుగా తండ్రి కూతురి పెళ్లి చేసేటప్పుడు అల్లుడి కాళ్లు కడుగుతాడు.. కానీ గంభీర్‌ ఎందుకు తన కూతుళ్ల కాళ్లు కడిగాడని అనుకుంటున్నారా. శరన్నవరాత్సోవాల సందర్భంగా జరుపుకునే అష్టమి కంజక్‌ ఆచారంలో భాగమే ఇది. ఈ ఆచారం ప్రకారం తండ్రి తన కూతుళ్ల కాళ్లు కడిగి.. వారి ఆశీర్వాదం తీసుకోవాలి. దీంతో గంభీర్‌ కూడా ఆ ఆచారాన్ని పాటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను గంభీర్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అంతేకాకుండా తను చేసిన ఈ సర్వీస్‌కు బిల్లు ఎక్కడికి పంపాలని తన భార్య నటాషాను ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు. 

ప్రసుత్తం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రి ప్రేమ వెలకట్టలేనిదని పలువురు నెటిజన్లు ఈ ఫొటోపై కామెంట్‌ చేస్తున్నారు. కాగా, 2018లో క్రికెట్‌ అన్ని ఫార్మాట్‌లకు గుడ్‌ బై చెప్పిన గంభీర్‌.. ఆ తర్వాత రాజకీయాల్లో చేరారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement