మరణాలపై ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన నమ్మకాలు, మత విశ్వాసాలు, ఆచారాలు, పద్దతులు ఉంటాయి. ఈజిఫ్టు పిరమిడ్లు కూడా ఇటువంటి ఆచారాలు, నమ్మకాల కోవలోకే వస్తాయి. మన దేశంలో కూడా వ్యక్తి మరణం తరువాత చేయాల్సిన కొన్ని పనులను కర్మలుగా నిర్వహిస్తాం. కాకపోతే కొందరి ఆచారాలు.. భీతిగొలిపేలా, ఇటువంటివి కూడా ఉంటాయా? అన్న ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి.
ఇండోనేషియాలోని రిందిగాల్లో గ్రామ ప్రజలు నమ్మకాలు, విశ్వాసాలు ఇలాగే ఉంటాయి.
రిందిగాల్లో గ్రామ ప్రజలు చనిపోయిన వారి మీద చూపే ప్రేమ, గౌరవం చాలా గొప్పగా ఉంటుంది. సాధారణంగా ఎక్కడైనా మృతి చెందిన వారికి ఏడాదికోసారి సంవత్సరీకం పేరుతో వారిని స్మరించుకోవడం సహజం. అయితే రిందిగాల్లో గ్రామ ప్రజలు మాత్రం.. వారిని పార్థివ దేహాలను సమాధుల నుంచి వెలికి తీసి కార్యక్రమాలను నిర్వహిస్తారు. మృత దేహాలను ఏడాదికోసారి సమాధుల నుంచి బయటకు తీస్తారు. వాటిని చాలా జాగ్రత్తగా రసాయనాలతో శుభ్రపరుస్తారు. వారు బతికున్నప్పుటి అలవాట్లను గుర్తు చేసుకుంటూ శవాలను ఆలా రూపొందిస్తారు. వారికి నచ్చే రంగులతో రూపొందించిన దుస్తులు, కళ్లజోడు, సిగరెట్లు, తినే పదార్థాలను ఏర్పాటు చేస్తారు.
తరువాత శవాలను ఇంటికి తీసుకువచ్చి.. బతికున్నప్పుడు ఎక్కడైతో కూర్చునేందుకు ఇష్టపడేవారే.. ఆ స్థలంలో కూర్చోబెడతారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తారు. రోజంతా వారు పండుగలా గడిపేస్తారు. సాయంత్రం అయ్యేసరికి గ్రామస్థుల మొహాల్లో విషాదఛాయలు కనిపిస్తాయి. చీకటి పడ్డతరువాత గ్రామస్థులంగా శవాలను తిరిగి సమాధుల్లోకి భద్రంగా చేరుస్తారు. ఆ రాత్రంతా వారు జాగరణ చేస్తూ గడుపుతారు.
Comments
Please login to add a commentAdd a comment