జకార్తా: ఇండొనేషియాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు జావా సెంట్రల్ ప్రావిన్సులో కొండచరియలు విరిగి పడటంతో 43 మంది మృతి చెందగా.. మరో 19 మంది గల్లతయ్యారు. సహాయక బృందాలు సహాయకచర్యలను వేగవంతం చేసినట్లు సోమవారం ఇండొనేషియా విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాల మూలంగా జరిగిన నష్టాన్ని అంచనావేస్తున్నామని అధికారులు తెలిపారు.
పుర్వోరెజో, బంజార్నెగారా, కెబుమెన్ జిల్లాలు వరదలకు తీవ్రంగా ప్రభావితం అయినట్లు విపత్తు నిర్వహణ సంస్థ అధికారి పుర్వో నుగ్రొహో తెలిపారు. ఇక్కడ వరదల మూలంగా రవాణావ్యవస్థ పూర్తిగా దెబ్బతినటంతో ప్రజలు తీవ్ర అవస్తలు పడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
భారీ వర్షాలకు 43 మంది మృతి
Published Mon, Jun 20 2016 11:17 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement
Advertisement