ఆఫ్రికా దేశమైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వరదలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా దక్షిణ ప్రావిన్స్‌లోని కలేహలో నదులు వరదలతో పోటెత్తాయి. దీంతో బుషుషు, న్యాముకుబి వంటి గ్రామాలను ముంచెత్తింది. ఈ వరదల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 200 మందికిపైగా మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 203 మృతదేహాలను గుర్తించినట్లు సివిల్ సొసైటీ సభ్యుడు కసోల్ మార్టిన్ చెప్పారు
భారీ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లోని నదులు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలు మునిగిపోయాయని, చాలా ఇళ్లు కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఈ మేరకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెనిస్ ముక్వేగే ప్రకృతి విపత్తులో నిరాశ్రయులైన ప్రజలకు తక్షణ వైద్య సాయం అందించేలా వైద్యులను, సాంకేతిక నిపుణలను ఆయా ప్రాంతాలకు పంపినట్లు ప్రకటించారు. ఐతే రువాండ సరిహద్దులో ఉన్న దక్షిన కిపులో తరచుగా వరదలు, కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణమని అధికారులు చెబుతున్నారు.
కాగా, ఈ వారం రువాండాలో భారీ వర్షాలకు వరదలు సంభవించి.. కొండచరియలు విరిగిపడటంతో సుమారు 130 మంది దాక మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ విధ్వంసంలో ఐదువేలకు పైగా గృహాలు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రువాండ, కాంగోలో సంభవించిన ప్రకృతి విపత్తులకు ప్రభావితమైన ప్రజలకు యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ తన సంతాపాన్ని తెలియజేశారు.
గ్లోబల్ వార్మింగ్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోని దేశాలకు ఇదోక వినాశకరమైన ఉదాహరణ అని పేర్కొంది. వేగవంతమైన వాతావరణ మార్పులకు ఇదొక మచ్చుతునక అని స్పష్టం చేసింది. కాగా, 2014లో కూడా కాంగో ఇంతే స్థాయిలో ప్రకృతి విపత్తుని ఎదర్కొన్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. నాటి విధ్వంసంలో సుమారు 130 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యినట్లు యూఎన్ పేర్కొంది.
(చదవండి: చైనా తమ దేశంలోని పేదరికం గురించి బయటకు పొక్కనీయదు..ఆఖరికి ఆన్‌లైన్ వీడియోలను)
Comments
Please login to add a commentAdd a comment