ఇస్లామాబాద్: గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు పాకిస్తాన్ అతలాకుతలమైపోయింది. ఈ వరద బీభత్సానికి పాకిస్తాన్‌లో దాదాపు 343 మంది చిన్నారులతో సహా సుమారు 937 మంది మృతి చెందారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది.
ఈ విపత్తులో దాదాపు 30 మిలియన్ల మందికి పైగా ఆశ్రయం కోల్పోయినట్లు పేర్కొంది. జాతీయి విపత్తు నిర్వహణ అథారిటీ(ఎన్‌ఎండీఏ) ప్రకారం.. సింధూ ప్రావిన్స్‌లో ఈ వరదల కారణంగా అత్యధిక సంఖ్యలో చనిపోయారని, సుమారు 306 మందికి పైగా తమ జీవనాన్ని కోల్పోయినట్లు పేర్కొంది. అలాగే బలోచిస్తాన్‌లో 234 మంది, పంజాబ్ ప్రావిన్స్‌లో 165 మంది ఖైబర్ పంక్త్వులలో 185 మంది రికార్డు స్థాయిలో చనిపోయారని వెల్లడించింది.
పాక్ ఆక్రమిత్ కాశ్మీర్‌లో 37 మంది, గిల్గిట్-బాల్టిస్తాన్‌లో తొమ్మిది చనిపోయినట్లు పేర్కొంది. అంతేకాదు ఆగస్టులో పాకిస్తాన్‌లో 166.8 మి.మీటర్ల వర్షం కురిసిందని, సగటున 48 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని ఎన్వెఎండీఏ వెల్లడించింది. ఈ అసాధారణ వర్షాలకు దక్షిణ పాకిస్తాన్‌లోని దాదాపు 23 జిల్లాలో బాగా ప్రభావితమయ్యాయని పేర్కొంది. వాతావరణ మార్పుల మంత్రి షెర్రీ రెహ్మాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ దేశవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టమని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు దేశంలోని పలుప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోయి, కమ్యూనికేషన్ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. పైగా వేలాది మంది నిరాశ్రయులయ్యరాని, తినేందుకు ఆహారం లేక అల్లాడిపోతున్నట్లు చెప్పారు. తమకు అంతర్జాతీయ దాతల సాయం అవసరమని నొక్కి చెప్పారు. ప్రస్తుతం పాక్‌లో ముంపుకు గురైన ప్రాంతాల్లో ఆశ్రయం, తక్షణ సహాయ చర్యలు ఆవశక్యత చాలా ఉందని పేర్కొన్నారు.
(చదవండి: 500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద వేలం... మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడి ఆర్ట్ కలెక్షన్)
Comments
Please login to add a commentAdd a comment