relief camp
-
సహాయక చర్యలపై తప్పుడు ప్రచారం: కమలా హారిస్
వాషింగ్టన్: మిల్టన్, హెలెన్ హరికేన్ల సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ట్రంప్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమలా హారిస్ మండిపడ్డారు. నార్త్ కరోలినాలో వారం రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజైన ఆదివారం ఆమె.. పలు చర్చిలకు వెళ్లి నల్లజాతీయులను కలిశారు. కోయినోనియా క్రిస్టియన్ సెంటర్లో ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకు సహాయం చేస్తున్న వారు నిజమైన హీరోలని కొనియాడారు. కానీ ఒక కీలక వ్యక్తి సహాయం చేయకపోగా, సొంత ప్రయోజనాలకోసం తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నారని ట్రంప్‌ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలో రాజకీయ నాయకులు చేయాల్సింది అది కాదని హితవు పలికారు. హెలెన్ తుఫాను అనంతరం ఫ్లోరిడాలో పర్యటించిన ట్రంప్.. రిపబ్లికన్ల సహాయాన్ని ప్రభుత్వం కావాలనే నిలిపేస్తోందని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్న వలసదారుల కోసం ఖర్చు చేయడంతో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీకి ఇవ్వడానికి నిధులు లేకుండా పోయాయయని విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలపై హారిస్ పైవిధంగా స్పందించారు. కమలా హారిస్ ప్రసంగానికి ముందు బైడెన్ గల్ఫ్ తీరంలోని టంపా, సెయింట్ పీట్ బీచ్ మధ్య హెలికాప్టర్లో హరికేన్ నష్టాన్ని సర్వే చేశారు. మిల్టన్ ఊహించినంత నష్టం చేయలేదని, చాలామంది సర్వం కోల్పోయారని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విపత్తు సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఫస్ట్ రెస్పాండర్లను బైడెన్ ప్రశంసించారు. ఇలాంటి సమయాల్లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లుగా కాకుండా అమెరికన్లుగా పరస్పరం సహాయం చేసుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులకోసం నిధులను మంజూరు చేశారు. పోలింగ్‌కు ఇంకా మూడు వారాల సమయమే ఉన్న నేపథ్యంలో వరుస తుఫానులు ఎన్నికలకు మరో కోణాన్ని జోడించాయి. -
పాకిస్తాన్లో అత్యవసర పరిస్థితి... 937 మంది మృతి
ఇస్లామాబాద్: గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు పాకిస్తాన్ అతలాకుతలమైపోయింది. ఈ వరద బీభత్సానికి పాకిస్తాన్లో దాదాపు 343 మంది చిన్నారులతో సహా సుమారు 937 మంది మృతి చెందారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది. ఈ విపత్తులో దాదాపు 30 మిలియన్ల మందికి పైగా ఆశ్రయం కోల్పోయినట్లు పేర్కొంది. జాతీయి విపత్తు నిర్వహణ అథారిటీ(ఎన్ఎండీఏ) ప్రకారం.. సింధూ ప్రావిన్స్‌లో ఈ వరదల కారణంగా అత్యధిక సంఖ్యలో చనిపోయారని, సుమారు 306 మందికి పైగా తమ జీవనాన్ని కోల్పోయినట్లు పేర్కొంది. అలాగే బలోచిస్తాన్లో 234 మంది, పంజాబ్ ప్రావిన్స్‌లో 165 మంది ఖైబర్ పంక్త్వులలో 185 మంది రికార్డు స్థాయిలో చనిపోయారని వెల్లడించింది. పాక్ ఆక్రమిత్ కాశ్మీర్లో 37 మంది, గిల్గిట్-బాల్టిస్తాన్‌లో తొమ్మిది చనిపోయినట్లు పేర్కొంది. అంతేకాదు ఆగస్టులో పాకిస్తాన్లో 166.8 మి.మీటర్ల వర్షం కురిసిందని, సగటున 48 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని ఎన్వెఎండీఏ వెల్లడించింది. ఈ అసాధారణ వర్షాలకు దక్షిణ పాకిస్తాన్‌లోని దాదాపు 23 జిల్లాలో బాగా ప్రభావితమయ్యాయని పేర్కొంది. వాతావరణ మార్పుల మంత్రి షెర్రీ రెహ్మాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ దేశవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టమని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు దేశంలోని పలుప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోయి, కమ్యూనికేషన్ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. పైగా వేలాది మంది నిరాశ్రయులయ్యరాని, తినేందుకు ఆహారం లేక అల్లాడిపోతున్నట్లు చెప్పారు. తమకు అంతర్జాతీయ దాతల సాయం అవసరమని నొక్కి చెప్పారు. ప్రస్తుతం పాక్‌లో ముంపుకు గురైన ప్రాంతాల్లో ఆశ్రయం, తక్షణ సహాయ చర్యలు ఆవశక్యత చాలా ఉందని పేర్కొన్నారు. (చదవండి: 500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద వేలం... మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడి ఆర్ట్ కలెక్షన్) -
వరద బీభత్సంలో పెళ్లి బాజా
యశ్వంతపుర (బెంగళూరు): అంతా సవ్యంగా ఉంటే ఈపాటికి ఆ ఇంట బంధు మిత్రులతో పెళ్లి సందడి నెలకొనేది. అయితే అనూహ్యంగా వరద విపత్తు కారణంగా సర్వం కోల్పోయిన ఆ కుటుంబానికి మేమున్నామంటూ అధికారులు దగ్గరుండి పెళ్లి జరిపించిన ఘటన కర్ణాటకలో వరద బాధిత కొడగు జిల్లాలో జరిగింది. మడికెరి తాలూకా మక్కందూరుకు చెందిన మంజుల, కేరళలోని కణ్ణూరు కుతుపరంబుకు చెందిన రాజేష్‌లకు ఈ నెల 26న పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. పెళ్లికి పదిరోజుల ముందుగానే భారీవర్షాలు కొడగు జిల్లాను ముంచెత్తగా మంజుల ఇల్లు నీటమునిగింది. పెళ్లి దుస్తులు, నగదు, బంగారు మొత్తం వరదలో కొట్టుకుపోయాయి. దీంతో ఆ కుటుంబం పునరావాస కేంద్రంలో తలదాచుకుంది. పెళ్లిని వాయిదా వేయాలని అనుకున్నారు. ఇది తెలుసుకున్న మడికెరి లయన్స్‌క్లబ్, సేవా భారతి సభ్యులు వారి పెళ్లి జరిపించడానికి సిద్ధమయ్యారు. మడికెరిలోని ఓంకారేశ్వరి దేవస్థానంలో ఆదివారం అనుకున్న ముహూర్తానికే వైభవంగా పెళ్లి చేసి మంజుల, రాజేష్‌లను ఆశీర్వదించారు. పెళ్లిలో జిల్లా కలెక్టర్ శ్రీవిద్య సహా పలువురు అధికారులు పాల్గొని దీవించారు. -
కేరళ రిలీఫ్ క్యాంప్.. హైదరాబాదీల ఔదార్యం!
సాక్షి, హైదరాబాద్ : భారీ వరదలతో అతలాకుతలమవుతున్న కేరళకు మేమున్నామంటూ హైదరాబాద్‌లో స్థిరపడ్డ మళయాళీలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. తమ సోదరులకు తోచిన సాయం అందించేందుకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఓ రిలీఫ్ క్యాంప్‌ను ఏర్పాటుచేశారు. ఈ క్యాంప్‌కు భారీ స్పందన వస్తోంది. మలయాళీలతోపాటు, హైదరాబాదీలూ విపత్తులో చిక్కుకున్న కేరళపై ఔదార్యం చాటారు. పెద్ద ఎత్తున తరలివచ్చి తమవంతు విరాళాలతోపాటు సహాయక సామాగ్రిని అందజేశారు. రవీంద్రభారతీలో ఏర్పాటుచేసిన ఈ క్యాంప్‌నకు భారీ స్పందన వచ్చిందని, హైదరాబాద్‌లోని మలయాళీలతోపాటు రాష్ట్ర ప్రజలు పెద్దసంఖ్యలో ముందుకువచ్చి కేరళకు తమవంతు సహాయాన్ని అందజేస్తున్నారని భాషా, సంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. -
హైదరాబాద్‌లో కేరళ రిలీఫ్ క్యాంప్
-
జీవితంలో ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదు
తిరువనంతపురం : ప్రకృతి బీభత్సానికి గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ చివురుటాకులా వణికిపోయింది. జీవితంలో ఇంతటి ఘోరమైన పరిస్థితిని చూడలేదని సహాయ శిబిరాల్లో తలదాచుకున్న జనం వాపోతున్నారు. బిక్కు బిక్కుమంటూ శిబిరాల్లో గడుపుతున్న వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో చేదు అనుభం. డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో వేరే ఇంటికి మారాం...కానీ కొండచరియలు తమ బంధువులను పొట్టన పెట్టుకున్నాయని, స్థానికులు తన పాపను రక్షించారంటూ అమ్మమ్మ తాతమ్మలను కోల్పోయిన బిబిన్ (23) కన్నీరుమున్నీరయ్యారు. అయితే సుబేష్అనే స్తానికుడు బిబిన్ భార్య, బిడ్డను రక్షించాడు. తెల్లవారుఝామున మా కుక్క గట్టిగా అరవడం మొదలుపెట్టింది. క్రమంగా ఇది చాలా అసాధారణ దుఃఖంతో హృదయ విదారకంగా మారిపోయింది. దీంతో పరిస్థితి అర్థమై తృటిలో మృత్యువునుంచి తప్పించుకున్నామని మరో బాధితుడు చెప్పారు. 59 ఏళ్ల మనియమ్మది ఇదే అనుభవం. రాత్రంతా కంటిమీద కునుకు లేదు. కొండచరియలు పడుతున్నాయి, భారీ వర్షం, ఇంతలో భయంకరమైన ధ్వనులను వినిపించాయి. అంతే తన పదేళ్ల మనుమరాల్ని తీసుకుని బయటపడ్డానని తెలిపింది. కేరళలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనం కన్నీటి సంద్రంగా మారారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే 30 మంది చనిపోగా అనేక కుటుంబాల్లోని 54వేలమంది నిరాశ్రయులయ్యారు. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. అరటి, కొబ్బరి పంటలు నాశనమయ్యాయి. ఇడుక్కి రిజర్వాయర్‌లోని అతి ప్రమాదకర స్థాయి మరింత ఆందోళన సృష్టిస్తోంది. మరోవైపు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ఎర్నాకులం, పాలక్కడ్, మలప్పురం, కాలికట్లో ఆగస్టు 12వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు, సహాయ కార్యక్రమాలను సత్వరమే అందించేందుకు నేవీ, ఎన్డీఆర్ఎఫ్, వాయు దళాలతో పాటు స్థానిక పోలీసు, ఇతర పరిపాలనా యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇడుక్కి మున్నార్ రిస్టార్ట్స్‌లో విదేశీయులు చిక్కుకుపోయారు. దాదాపు 54మందిలో సగం మంది ఇక్కడ ఉండిపోయారు. అయితే నేవీ, వాయు రక్షణ దళం బృందం వారిని సురక్షిత ప్రాంతానికి తరలించింది. హెలికాప్టర్ల సాయంతో వారిని రక్షించారు. ఇది ఇలా ఉంటే ఇప్పట్లో కేరళకు వెళ్లవద్దని అమెరికా హెచ్చరికలు చేసింది. కాగా మృతుల కుటుంబాలకు రూ.4లక్షల సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఇళ్లు, ఆస్తులు కోల్పోయినవారికి రూ.పది లక్షల పరిహారం ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ ఎత్తున విరాళాల్సిందిగా కేరళ సీఎం ప్రజలకు విజ్తప్తి చేశారు. మరోవైపు వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. వరద పరిస్థితి, అందుతున్న సాయంపై ప్రధానమంత్రి ఇప్పటికే పినరయి విజయన్‌తో మాట్లాడారు. ఇప్పటికే ఒక కేంద్ర బృందం కేరళలో పర్యటించింది. వరద ప్రభావం తెల్సుకునేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. -
అతిసార బాధితులకు ఊరట
బండపోతుగళ్‌లో కొనసాగుతున్న వైద్య శిబిరం గ్రామాన్ని సందర్శించిన జేడీ డాక్టర్ సుబ్బలక్ష్మి కౌడిపల్లి: మండలంలోని బండపోతుగళ్‌లో వైద్యశిబిరం కొనసాగుతోంది. శుక్రవారం మూడోరోజు గ్రామస్తులకు కాస్త ఊరట లభించింది. వాంతులు, విరేచనాలు అదుపులోకి వచ్చాయి. గ్రామాన్ని జేడీ సుబ్బలక్ష్మి సందర్శించారు. బండపోతుగళ్‌లో అతిసార ప్రబలడంతో గ్రామస్తులు అస్వస్థతకు గురై మూడు రోజులుగా గ్రామంలో వైద్యశిబిరం కొనసాగుతున్న విషయం విధితమే. కాగా మూడోరోజు వైద్య శిబిరంలో డాక్టర్ దివ్యజ్ఞ, డాక్టర్ విజయశ్రీ వైద్య సిబ్బంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పదమూడు మందికి వాంతులు, విరేచనాలు కావడంతో ప్రత్యేక చికిత్సలు చేశారు. దీంతోపాటు మరో యాభై మందికి పీఓ వైద్యం అందించారు. ఏఎన్ఎంలు ఇంటింటికీ తిరిగి గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ పంపిణీ చేసి క్లోరినేషన్ చేశారు. కాచి వడపోసిన నీటిని తాగాలని సూచించారు. గ్రామంలో ప్రధానంగా 1, 2, 3, 4వ వార్డుల ప్రజలకు మాత్రం అధికంగా అతిసార సోకినట్లు గుర్తించారు. దీంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, వైద్య సిబ్బంది రక్షిత మంచినీటి పథకం ట్యాంక్‌లలో క్లోరినేషన్ చేశారు. నల్లా గుంతలను సరిచేయడంతోపాటు కాలనీల్లో పంచాయతీ సిబ్బందితో కలిసి గుంతలు పూడ్చివేశారు. కట్వాల్ వద్ద లీకేజీలు లేకుండా చూశారు. గ్రామాన్ని సందర్శించిన జేడీ సుబ్బలక్ష్మి బండపోతుగళ్ గ్రామాన్ని వైద్య ఆరోగ్యశాఖ జేడీ డాక్టర్ సుబ్బలక్ష్మి సందర్శించారు. గ్రామంలోని పలు కాలనీలలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. నల్ల లీకేజీలు, నల్ల గుంతలను చూశారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులపై ఆరా తీశారు. అనంతరం వైద్యశిబిరంలో రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఓపీ, ఇన్‌పేషెంట్ జాబితా, మందులను పరిశీలించారు. వైద్యులు డాక్టర్ విజయశ్రీ, దివ్యజ్ఞలను అతిసార వ్యాధి బాధితులకు అందుతున్న సేవలను గురించి ప్రశ్నించారు. బాధితులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. డీఎంహెచ్ఓ అమర్‌సింగ్‌నాయక్, ఎపిడమాలజిస్ట్ రజిని, తహసీల్దార్ నిర్మల, ఎంపీడీఓ శ్రీరాములు, ఈఓ పీఆర్డీ సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చిన్ని నాయక్, పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్, వీఆర్ఓలు పాల్గొన్నారు.