
సాక్షి, హైదరాబాద్ : భారీ వరదలతో అతలాకుతలమవుతున్న కేరళకు మేమున్నామంటూ హైదరాబాద్‌లో స్థిరపడ్డ మళయాళీలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. తమ సోదరులకు తోచిన సాయం అందించేందుకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఓ రిలీఫ్ క్యాంప్‌ను ఏర్పాటుచేశారు. ఈ క్యాంప్‌కు భారీ స్పందన వస్తోంది. మలయాళీలతోపాటు, హైదరాబాదీలూ విపత్తులో చిక్కుకున్న కేరళపై ఔదార్యం చాటారు. పెద్ద ఎత్తున తరలివచ్చి తమవంతు విరాళాలతోపాటు సహాయక సామాగ్రిని అందజేశారు. రవీంద్రభారతీలో ఏర్పాటుచేసిన ఈ క్యాంప్‌నకు భారీ స్పందన వచ్చిందని, హైదరాబాద్‌లోని మలయాళీలతోపాటు రాష్ట్ర ప్రజలు పెద్దసంఖ్యలో ముందుకువచ్చి కేరళకు తమవంతు సహాయాన్ని అందజేస్తున్నారని భాషా, సంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.



Comments
Please login to add a commentAdd a comment