రెండేళ్ల క్రితం భారీ వర్షాలతో జలమయమైన కూకట్‌పల్లి ధరణీనగర్ కాలనీ (ఫైల్)
కేరళ పరిస్థితే మనకు ఎదురైతే.? తలచుకుంటేనే భయంగా ఉంది కదూ! అలాంటి ఉపద్రవం భాగ్యనగరాన్ని ముంచేయక ముందే మేల్కొంటే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలోని నాలాలను తక్షణమే విస్తరించాలని, మూసీ సామర్థ్యాన్ని పెంచాలని సూచిస్తున్నారు. లేని పక్షంలో కేరళ తరహాముంపు ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని నాలాలను తక్షణమే విస్తరించి, వరదనీరు సాఫీగా వెళ్లే ఏర్పాట్లు చేయకపోతే.. మూసీ సామరŠాధ్యన్ని పెంచని పక్షంలో.. కేరళ తరహా ముప్పు హైదరాబాద్‌కూ పొంచి ఉందని వరద ప్రవాహాల నిపుణులు పేర్కొంటున్నారు. 2000 సంవత్సరంలో కురిసిన వర్షానికి నగరం అతలాకుతలమైంది. ఇళ్లు, కాలనీలు చెరువులను తలపించాయి. మారిన పర్యావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎండైనా, వానైనా తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున హటాత్తుగా భారీ వర్షాలొచ్చే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. కేరళలో కురిసనట్లుగా భారీ వర్షాలు వస్తే నగరం మునిగిపోక తప్పదని హెచ్చరిస్తున్నారు. 2000 నాటి వరదలతోనే కిర్లోస్కర్, వాయెంట్స్ సొల్యూషన్స్ నివేదికల్లో నాలాలను విస్తరించాలని ప్రణాళికలు రూపొందించినా ఇప్పటి వరకు పనులు పూర్తికాలేదు.
రెండేళ్లక్రితం వర్షాలతో తిరిగి నాలాల ఆధునీకరణ పనుల్లో కదలిక వచ్చినా ముందుకు సాగడం లేదు. నాలాలను ఆధునీకరించి, వరదనీరు వెళ్లే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి వరదలనైనా బయటకు పంపించే మూసీ నది కబ్జాకు గురికావడంతో నీరు బయటకు వెళ్లడం లేదు. మూసీగుండా ప్రస్తుతం దాదాపు 50 క్యూసెక్కుల నీరు ప్రవహించే సామర్ధ్యం మాత్రమే ఉండటం రెండు రోజుల క్రితం జరిగిన ఇంజినీరింగ్ సదస్సులో చర్చకు వచ్చింది. మూసీకి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించే సామర్ధ్యం ఉంటేనే నగరం వరదముంపు బారిన పడకుండా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇందుకుగాను తగిన కార్యాచరణతో తక్షణం పనులు చేపట్టాని వారు పేర్కొన్నారు. ఆక్రమణలతో తగ్గిపోయిన మూసీ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని ఇరిగేషన్, తదితర శాఖలు ఆరేడేళ్ల క్రితం జరిపించిన అధ్యయ నంలో వెల్లడవడాన్నీ సదస్సు ప్రస్తావించింది.
గంటకు 10 సెం.మీ.వర్షపాతాన్ని తట్టుకోవాలి..
గతంలో నిర్వహించిన అధ్యయనాలు, కమిటీల నివేదికలు గంటకు నాలుగు సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకునేందుకు రూపొందించినవి. ప్రస్తుతం గంటకు రెండు సెంమీటర్ల వర్షాన్ని తట్టుకునే సామర్ధ్యం మాత్రమే నాలాలకు ఉంది. గత ఏడాది తక్కువ సమయంలోనే పది సెంటీమీటర్లు మించిన వర్షపాతం నమోదైంది. మూసీని ఆక్రమించి ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలు చేయడమే కాక, ప్రభుత్వశాఖలు సైతం అభివృద్ధి పేరిట మూసీ స్థలంలో నిర్మాణాలు జరిపాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటికైనా వెంటనే తగు చర్యలు చేపట్టి మూసీ ప్రవాహ సామరŠాధ్యన్ని పెంచాల్సిన అవసరముందని, లేని పక్షంలో కేరళ కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉం దని హెచ్చరించారు. అందుకుగాను తగిన ఆలోచనలు, ప్రణాళికలు అవసరమని సూచించారు.
13 ప్రాంతాలు సమస్యాత్మకం..
మూసీలో అనేక ప్రాంతాల్లో వ్యర్థాలు పేరుకుపోయి సమస్యాత్మకంగా మారాయి. మూసీప్రక్షాళన, సుందరీకరణ పనుల కోసం ప్రభుత్వం మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మూసీ తీరం వెంబడి సర్వే నిర్వహించిన కార్పొరేషన్ 13 ప్రాంతాల్లో డెబ్రిస్ సమస్య తీవ్రంగా ఉన్నట్లు గుర్తించింది. 14 మండలాల పరిధిలో 57.5 కి.మీ.ల మేర విస్తరించిన మూసీని మొత్తం ప్రక్షాళన చేసి, ప్రవాహ సామరŠాధ్యన్ని పెంచితేనే వర్షాకాల సమస్యలు తప్పుతాయని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment