
యశ్వంతపుర (బెంగళూరు): అంతా సవ్యంగా ఉంటే ఈపాటికి ఆ ఇంట బంధు మిత్రులతో పెళ్లి సందడి నెలకొనేది. అయితే అనూహ్యంగా వరద విపత్తు కారణంగా సర్వం కోల్పోయిన ఆ కుటుంబానికి మేమున్నామంటూ అధికారులు దగ్గరుండి పెళ్లి జరిపించిన ఘటన కర్ణాటకలో వరద బాధిత కొడగు జిల్లాలో జరిగింది. మడికెరి తాలూకా మక్కందూరుకు చెందిన మంజుల, కేరళలోని కణ్ణూరు కుతుపరంబుకు చెందిన రాజేష్‌లకు ఈ నెల 26న పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు.
పెళ్లికి పదిరోజుల ముందుగానే భారీవర్షాలు కొడగు జిల్లాను ముంచెత్తగా మంజుల ఇల్లు నీటమునిగింది. పెళ్లి దుస్తులు, నగదు, బంగారు మొత్తం వరదలో కొట్టుకుపోయాయి. దీంతో ఆ కుటుంబం పునరావాస కేంద్రంలో తలదాచుకుంది. పెళ్లిని వాయిదా వేయాలని అనుకున్నారు. ఇది తెలుసుకున్న మడికెరి లయన్స్‌క్లబ్, సేవా భారతి సభ్యులు వారి పెళ్లి జరిపించడానికి సిద్ధమయ్యారు. మడికెరిలోని ఓంకారేశ్వరి దేవస్థానంలో ఆదివారం అనుకున్న ముహూర్తానికే వైభవంగా పెళ్లి చేసి మంజుల, రాజేష్‌లను ఆశీర్వదించారు. పెళ్లిలో జిల్లా కలెక్టర్ శ్రీవిద్య సహా పలువురు అధికారులు పాల్గొని దీవించారు.
Comments
Please login to add a commentAdd a comment