
బ్రస్సెల: బ్రెజిల్ దేశంలో సంభవించిన వరద విపత్తు వల్ల మృతుల సంఖ్య 204కు పెరిగింది. బ్రెజిల్ దేశంలోని ఆగ్నేయ రియో డి జనీరో రాష్ట్రంలోని పెట్రోపోలిస్ నగరంలో భారీ వరదల కారణంగా 204 మంది మరణించినట్లు బ్రెజిల్ అధికారులు చెప్పారు. కొండచరియలు విరిగిపడటంతోపాటు బురద ప్రవాహంలో చిక్కుకొని మరో 51 మంది గల్లంతు అయినట్లు రియో డిజెనీరో రాష్ట్ర అగ్నిమాపక శాఖ ప్రతినిధి చెప్పారు.
వరదల వల్ల బ్రెజిల్‌లోని చారిత్రాత్మక పర్యాటక కేంద్రమైన పెట్రోపోలిస్ నగరంలో ఇప్పటికీ 810 మంది నిర్వాసితులు గత వారం రోజులుగా పాఠశాల శిబిరాల్లో నివశిస్తున్నారు.అతి భారీవర్షాల వల్ల మెరుపు వరదలు సంభవించడంతో ప్రాణనష్టంతోపాటు ఆస్తినష్టం సంభవించింది. వేలాది ఇళ్లు వరదల్లో దెబ్బతిన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment