కర్మకాండలకూ డబ్బుల్లేవు.. | elder man request to bank manager no money for funeral | Sakshi
Sakshi News home page

కర్మకాండలకూ డబ్బుల్లేవు..

Published Sat, Nov 26 2016 3:02 AM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

కర్మకాండలకూ డబ్బుల్లేవు..

కర్మకాండలకూ డబ్బుల్లేవు..

‘మా అల్లుడు మూడు రోజుల క్రితం రైలు ప్రమాదంలో చనిపోరుుండు. మూడొద్దుల కర్మకు చేతిలో చిల్లి గవ్వలేదు.. ఉన్న డబ్బంతా బ్యాంకులోనే ఉంది.. దయుంచి పైసలు ఇయ్యండి..’.. అంటూ ఓ వృద్ధుడు బ్యాంకు మేనేజర్ వద్ద బోరున విలపించాడు. జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం వనపర్తికి చెందిన అరుులపురం చంద్రయ్య వేదన ఇది.

లింగాలఘణపురం గ్రామీణ వికాస్ బ్యాంకులో ఆయనకు రూ.42 వేల డిపాజిట్ ఉంది. అరుుతే జనగామలో ఉండే తన కుమార్తె భర్త మూడు రోజుల కింద రైలు ప్రమాదంలో మృతి చెందాడు. అక్కడ పుట్టింటి తరఫున చేయాల్సిన మూడు రోజుల కర్మ కార్యక్రమం కోసం డబ్బులు కావాలి. చేతిలో సొమ్ము లేకపోవడంతో చంద్రయ్య బ్యాంకుకు వచ్చాడు. కానీ బ్యాంకులో డబ్బు లేదనడం తో ఏం చేయాలో తెలియక బోరున విలపిం చాడు. అది గమనించిన మేనేజర్ రాజా మోహన్ తన వద్ద ఉన్న రూ.4 వేలు చంద్ర య్యకు ఇచ్చి పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement